మహిళసదస్సు కు బయలుదేరిన పరకాల మహిళలు

జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎంపీపి స్వర్ణలత,ఎంపిడిఓ ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రోజున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో పాల్గొనేందుకు పరకాల మండలం నుండి రెండు బస్సులలో వంద మంది మహిళలు వెల్లడం జరిగింది.ఈ ఈ బస్సులను మండల పరిషత్ అధ్యక్షులు తక్కల్ల పల్లి వరకు స్వర్ణలత మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు ఏ.పి.యం క్రాంతి లతో కలిసి జండా ఊపి ప్రారంభించారు.ప్రతి బస్సులో ఒక ఏ.పి.యం,పోలీసు, ఏ.యన్.యం లను ఏర్పాటు చేయడం జరిగింది.ప్రతి ఒక్కరికీ ఉదయం బ్రేక్ ఫాస్ట్,టీ, వాటర్ బాటిల్స్,స్నాక్స్ అండ్ మధ్యాహ్నం ఘట్కేసర్ లో బోజనం,రాత్రి డిన్నర్ కూడా ఏర్పాటు చేసినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు తెలిపారు.ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు తక్కల్లపల్లి స్వర్ణణలత మాట్లాడుతూ గౌరవ ముఖ్య మంత్రి గత పది సంవత్సరాలుగా వెనక బడిన మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు మహిళా సదస్సు ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో విఓఏలు, మహిళ సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *