ఉద్యోగులు ఓటర్లే క(కా)దా.!

https://epaper.netidhatri.com/view/235/netidhathri-e-paper-13th-april-2024%09/3

-అభ్యర్థులు, ఉద్యోగుల ఓట్ల అభ్యర్థన తప్పా!

-రూల్‌.నెం. 5..క్లాజ్‌ నెం.1(a) ప్రకారం రాజకీయాలలో సభ్యులు కావొద్దు…కార్యాచరణలో భాగంగా కావొచ్చు. అని స్పష్టంగా వుంది.

-అభ్యర్థి ప్రచారానికి వస్తే వద్దనకూడదు.

-ప్రతి చోట ఉద్యోగుల కాలనీలున్నాయి.

-ప్రచారంలో భాగంగా అభ్యర్థి ఉద్యోగి ఇంటికి వెళ్లకూడదా?

-కాలనీలలో ప్రచారం చేయకూడదా?

-అభ్యర్థులు వచ్చి చేసే ప్రచారంలో ఉద్యోగులు ఎలా బాధ్యులౌతారు?

-నలుగురు ఉద్యోగులతో కలిసి మాట్లాడడం ఉల్లంఘనౌతుందా?

-అది ఉద్యోగులకు శిక్షగా మారుతుందా?

-కాలనీలలో ఉద్యోగులకు ప్రచారం చేయడం తప్పెలా అవుతుంది.

-అభ్యర్థితో ఉద్యోగులు కనిపించడం నేరమెలా అవుతుంది?

-టీచర్స్‌ ఎమ్మెల్సీలు ఎన్నికల ప్రచారంలో ఎవరిని ఓటడుగుతారు?

-అది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు రాదా?

-పట్టభద్రుల ఎమ్మెల్సీలలో మెజారిటీ ఓట్లు ఉద్యోగులే…అప్పుడు ప్రచారం జరగదా?

-ఉద్యోగులు బహిరంగ ప్రదేశాలలో ప్రచారం పాల్గొనొద్దు.

-ఉద్యోగులు పార్టీల జెండాలు పట్టుకుంటే తప్పు!

-నాలుగు గోడల మధ్య కూడా ఉద్యోగులు వుండే అవకాశం లేదా?

-ఎన్నికల సంఘం తొందరపాటు నిర్ణయం కాదా?

-ఉద్యోగుల జీవితాలను బలిచేయడం కాదా?

-ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నట్లు?

-ఉద్యోగ సంఘాల మౌనంలో ఆంతర్యమేమిటి?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఈసారి జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు ఒక కొత్త ప్రశ్నను ముందుకు తీసుకొచ్చాయి. ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగులు, అభ్యర్ది చేసే ప్రచారంలో వున్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులపై వేటు పడిరదన్న వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ ఎన్నికల వ్యవస్ధ మీద అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతుతున్నాయి. ఎన్నికల నియమాలు అభ్యర్ధులకు పూర్తి స్దాయిలో అవగాహన లేక జరుగుతున్నాయా? ఉద్యోగ సంఘాలకు కూడా వాటిపై సరైన పట్టు లేకపోవడం మూలంగా జరుగుతున్నాయా? నిజంగా ఉద్యోగులు తప్పు చేశారా? ప్రచారంలో పాలు పంచుకున్నట్లు రుజువైందా? అన్న విషయాలపై కూడా ఉద్యోగ సంఘాల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎన్నికలు జరుగుతున్న వేళ ఉద్యోగులంతా ఎన్నికల సంఘం ఆదీనంలోకి వెళ్తారు. ఇంతవరకు బాగానే వుంది. అయితే ఉద్యోగులంతా ఓటర్లే కదా? వారికి కూడా ఓటు హక్కు వుంటుంది కదా? వారు కూడా వారి వారి పరిదిలో ఎవరు పోటీ చేస్తున్నారన్న సంగతి తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఎన్నికల సంఘం చెప్పే సూచనలు కేవలం సామాన్యులకేనా? ఉద్యోగులకు కాదా? ఎన్నికలు సమీపిస్తున్న సందర్భాలలో ప్రజలు ఎలా ఓటు వేయాలి. ఎవరికి వేయాలి. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మంచి అభ్యర్ధిని ఎన్నుకోవాలి. ప్రలోభాలకు గురి కావొద్దు. అభ్యర్ధులు ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తారు..హమీలు ఇస్తారు. వాటిని నమ్మొద్దు. అంటూ సమాజంలో అనేక ప్రజా సంఘాలతో, కాలేజీలలో, యూనివర్సిటీలలో కూడా సదస్సులు ఏర్పాటు చేసి మరీ వివరిస్తుంటారు. ప్రజలను చైతన్యం చేస్తుంటారు. వివిధ ప్రచార సాధనాల ద్వారా ప్రకటనలు కూడా జారీ చేస్తారు. మరి ఇవన్నీ ఎన్నికల కమీషన్‌ చేయడంలో ఆంతర్యం కేవలం అభ్యర్దుల ఎంపికలో ప్రజల జాగ్రత్తల కోసం, రేపటి దేశ భవిష్యతు కోసం. మరి అలాంటి ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకునే ఉద్యోగులు కూడా , ఓటును వినియోగించుకోవాల్సిన ఓటర్లే. మరి వారు కూడా తమ తమ నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్ధులు ఎవరు? అన్నది తెలుసుకోవాల్సిన అవసరం వారికి కూడా వుంటుంది. వారు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకునే అవకాశం వుంటుంది.
ఎన్నికల హడావుడి మొదలైన నాటి నుంచి అభ్యర్ధులు ప్రజలకు వద్దకు వస్తారు.
ఇళ్లిళ్లు తిరుగుతారు. అందులో ఉద్యోగులు కూడా వుంటారు. అభ్యర్ధులు కాలనీలలో ప్రచారం సాగిస్తుంటారు. ఆ సభలు జరుగుతున్న సమయంలో అటు వైపు ఉద్యోగులు వెళ్లకూడదన్న నియమాలున్నాయా? ఏ ఉద్యోగి అయినా అభ్యర్ది తరుపున ప్రచారం చేయడం తప్పు. పది మంది ముందు ఉద్యోగి ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకోవడం తప్పు. ప్రచార సాధనాల ద్వారా ఎన్నికల ప్రచారం సాగిస్తే తప్పు. అభ్యర్తి చెప్పే విషయాలను వినడం అన్నది వారికి వున్న ప్రాధమిక హక్కు. అభ్యర్థులు ప్రజల వద్దకు వచ్చి తానను ఎన్నుకుంటే మీ సమస్యలు తీరుస్తానంటూ ప్రజలను ఆకర్షిస్తుంటారు. అలాగే ఉద్యోగులకు కూడా అనేక సమస్యలుంటాయి. వాటిపై చట్ట సభల్లో ఉద్యోగుల తరుపున పోరాటం చేస్తానని చెప్పడానికి ఉద్యోగుల వద్దకు అభ్యర్ధి రావొద్దా? వారి సమస్యలు తీరొద్దా? మెదక్‌ పార్లమెంటు పరిదిలో జరిగిన సంఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘమే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా నిర్వహిస్తుంది. ఎమ్మెల్సీలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్స్‌ ఎమ్మెల్సీలనీ ప్రత్యేకంగా వుంటాయి. వాళ్లు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన తర్వాత టీచర్లు విద్యా వ్యవస్ధతోపాటు, ఉపాధ్యాయ సమస్యలను సాధించుకునేందుకు వీలైతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ నిరుద్యోగులు సమస్యలు, ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తారు.
టీచర్స్‌ ఎమ్మెల్సీలు, పట్టభద్రుల ఎమ్మెల్సీలు చేసే ప్రచారం అంతా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలలోనే వుంటుంది.
నిజానికి పని వేళలల్లో ఎవరూ ఓటు అడుక్కోవడానికి ఉద్యోగుల వద్దకు వెళ్లకూడదు. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అభ్యర్ధులు, వారి అనుచరులు ప్రభుత్వ కార్యాలయాలు, సూళ్లలో ప్రచారం సాగిస్తారు. అలాంటప్పుడు ఉద్యోగులు నేరుగా ప్రచారంలో పాల్గొన్నట్లు కాదా? యూనివర్సిటీలలో ఆడిటోరియంలలోనే సభలు నిర్వహిస్తూ ఓట్లు అడుగుతారు. పట్టణాలలో అనేక ఫంక్షన్‌ హాళ్లలలో అనేక సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో ఉద్యోగులంతా అభ్యర్ధుల వద్దనే వుంటారు. ఉపాధ్యాయ సంఘాలు భహిరంగంగానే ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకుంటాయి. పట్టభద్రుల ఎన్నికల్లో ఉద్యోగ సంఘాలు పార్టీలకు మద్దతు ప్రకటిస్తాయి. అది తప్పు కానప్పుడు, ఉద్యోగులు వున్న ప్రదేశానికి వెళ్లి అభ్యర్ధులు ప్రచారం సాగిస్తే ఉద్యోగుల తప్పెలా అవుతుంది. దానికి వారు బాద్యులెలా అవుతారు. ప్రస్తుత కాలాల్లో ఉద్యోగుల విషయంలో గాని, ప్రైవేటు ఉద్యోగుల విషయంలో గాని ఎక్కడికక్కడ కాలనీలు వెలిశాయి. ఎన్జీవోస్‌ కాలనీ, టీచర్స్‌ కాలనీ, ఆర్టీసి కాలనీ, డాక్టర్స్‌ కాలనీ, లాయర్స్‌ కాలనీ అంటూ ఎక్కడిక్కడ కాలనీలున్నాయి. ఆ కాలనీలలో ఫంక్షన్‌ హాళ్లువున్నాయి. కమ్యూనిటీ భవనాలున్నాయి. అభ్యర్థులు ఇంటింటికీ తిరిగే ఓపిక లేక, ఉద్యోగులను అక్కడికి పిలిపించుకొని, పని వేళల్లో కాకుండా సాయంత్రం వేళ, నాలుగు గోడ మధ్య నలుగురితో సమావేశం జరగడం నిజంగా తప్పేనా? ఎన్నికల సంఘం ఆదేశాలను అతిక్రమించినట్లేనా? అలా ఉద్యోగులున్న చోటకు అభ్యర్ధులు వెళ్లి ప్రచారం చేసినా, ఉద్యోగులదే బాధ్యత అన్న హెచ్చరికలు ఏమైనా వున్నాయా?
నిజానికి ఉద్యోగి ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సభ్యుడై వుండొద్దు.
అసలు రాజకీయాలతో సంబంధాలు వుండకూడదు. సభ్యత్వాలు అసలే వుండకూడదు. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్లు ఎలా ఇస్తున్నారు. ఉద్యోగ సంఘాలన్నీ దేశంలో రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్న సంగతి ఎన్నికల సంఘానికి తెలియదా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా తమ అనుకూల సంఘాల ఉద్యోగులకు పెద్ద పోస్టులు అందడం నిజం కాదా? వారికి అనుకూలంగా పనులు జరుగుతుందడం అబద్దమా? ఉద్యోగి అయినంత మాత్రానా ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు అర్హుడు కాదా? తాను ఎవరికి ఓటేస్తున్నానో చెప్పడం చెప్పడం తప్పు. ఎవరికైనా ఓటు వేయమయని చెప్పడం తప్పు. ఓటర్లను ఉద్యోగి ప్రభావితం చేస్తే తప్పు. కాని తాను చైతన్యం కావడం తప్పుకాదు. తమ హక్కులను కాపాడే అభ్యర్ధులెవరో తెలుసుకోవడం తప్పు కాదు. ఒక వేళ మీరు గెలిస్తే మా సమస్యలు తీర్చుతారా? అని అభ్యర్ధులను ఉద్యోగి అడడం అవసరం. ఎందకంటే వారికి వుండే సమస్యలు వారికి వుంటాయి. ఎన్నికల నిర్వహణ చేస్తున్నంత మాత్రానా, తర్వాత సమయంలో తాను ఎవరికి ఓటు వేయలో నిర్ణయం తీసుకోవడం తప్పెలా అవుతుంది. కాలనీలలోకి అభ్యర్ధులు ఇంటింటి ప్రచారం సాగించే సమయంలో అభ్యర్ధులకు ఉద్యోగులు ఎవరో, కాదో తెలియకపోవచ్చు. అంత మాత్రాన అభ్యర్ధి మీ ఇంటికి అభ్యర్ధి వచ్చాడని ఉద్యోగిని ప్రశ్నించే అధికారం ఎవరికైనా వుందా? ఇది కూడా అలాగే జరిగినట్లు లెక్క. ఎన్నికల సమయంలో నలుగురు ఉద్యోగులు ఒక చోట కలడం కూడా తప్పె అనుకున్నప్పుడు, ఎన్నికల సంఘం ఏర్పాటు చేసే ట్రైనింగ్‌ ప్రోగ్రాంలకు కూడా హజరౌతారు. ఉద్యోగులు ప్రచారం గురించి మాట్లాడాలనుకుంటే అక్కడ కూడా మాట్లాడుకుంటారు. ఈ మాత్రం అవగాహన లేకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయా? ఎన్నికల సంఘం ఉద్యోగుల విషయంలో విధించే శిక్షలు కఠినంగానే వుంటాయి. ఉద్యోగి పట్టుబట్టి ఓట్లు వేయిస్తే తప్పు. కాని తాను ఎవరికి ఓటు వేయాలో తెలుసుకునే సందర్భంలో ఇతర ఉద్యోగులతో కలిసి వుండడం తప్పా? కాదా? అన్నది ఉద్యోగ సంఘాలు కూడా చెప్పాలి. అభ్యర్ధి ఉద్యోగులను ఓట్లు అడగొద్దన్న నియమావళి కొత్తగా ఏదైనా తెచ్చారోతెలియాలి. ఇదీ ఉద్యోగ వర్గాలలో సాగుతున్న చర్చ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *