ఈవీఎంలు కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించిన బండారి స్వాగత్ రణ్వీర్ చంద్

బ్యాలెట్ యూనిట్లలో అభ్యర్థల గుర్తులు స్పష్టంగా కనిపించేల ఏర్పాటు

ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా కమిషనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

బాలేట్ యూనిట్లలో ఓటర్లుకు గుర్తులు స్పష్టంగా కనిపించేలా పకడ్బందీగా అమరుస్తున్నట్లు వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ తెలిపారు.

సోమవారం సింగరేణి మినీ ఫంక్షన్ హల్లో కొనసాగుతున్న ఈ వి ఎమ్, వివి ప్యాట్ ల కమిషనింగ్ రెండో రోజు కమిషనింగ్ ప్రక్రియను, జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బాలేట్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా తో కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో 317 పోలింగ్ కేంద్రాలున్నాయని అన్నారు. వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున మూడు బాలేట్ యూనిట్లు వినియోగించాయాల్సి ఉన్నట్లు తెలిపారు. మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియకు 1236 బాలెట్ యూనిట్లు, 412 కంట్రోల్ యూనిట్లు, 412 వివి ప్యాట్ లు కమిషనింగ్ ప్రక్రియ పగఢ్భందిగా చేపట్టినట్లు తెలిపారు. కమిషనింగ్ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరుగకుండా తగు జాగ్రత్తలు చేపట్టామని, కమిషనింగ్ ప్రక్రియకు 30 సెక్టార్లుగా విభజించి టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి 10 టేబుల్స్ పరిశీలనకు ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. వివి ప్యాట్లను, కంట్రోల్ యూనిట్లను పోలింగ్ కేంద్రాల వారిగా నంబర్లను వేసి భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కమిషనింగ్ కేంద్రంలో అత్యవసర చికిత్స కేంద్రం, చల్లదనం కొరకు కూలర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రతిష్టాత్మకంగా ఈవిఎం కమిషనింగ్ ప్రక్రియ
జరుగుతున్నట్లు ఆమె తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ తో కలిసి భూపాలపల్లిలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోస్టల్ బాలేట్ వినియోగంలో హెల్ప్ లైన్ ఏర్పాటు ద్వారా ఓటరు పరిశీలన చేస్తున్నారని, తదుపరి పోలింగ్ కేంద్రం వారిగా ఓటురు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలింగ్ మిగిసిన తదుపరి స్ట్రాంగ్ రూములో పటిష్ట భద్రత, వీడియో గ్రఫి మధ్య భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు జరిగిన పోలింగ్ ప్రక్రియను ఎన్నికల పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా మాట్లాడుతూ 8వ తేదీ వరకు పోస్టల్ బాలేట్ వినియోగానికి అవకాశం ఉందని తెలిపారు. 7, 8 తేదీలు అనగా రెండు రోజులు మాత్రమే సమయం ఉన్నందున పోస్టల్ బ్యాలెట్ పొందిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఉదయం 9 గంటల నుండి సాయత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగానికి సమయం ఉందని అన్నారు. నిర్ణీత పోలింగ్ సమయం ముగిసే సమయానికి ఓటర్లుకు చివరి నుండి ముందుకు క్రమసంఖ్య వారిగా స్లిప్పులు జారీ చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని పర్యవేక్షణకు డిపిఓ నారాయణరావును నోడల్ అధికారిగా నియమించామన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో ఓటరు దృవీకరణ చేయాల్సి ఉన్నందున గెజిటెడ్ అధికారులను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,
పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి నారాయణరావు, ఆర్డిఓ,
సహాయ రిటర్నింగ్ అధికారి
మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *