కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలి

సీసీ రోడ్డు పలుగులతో ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డి పేట గ్రామంలోని ఏడవ వార్డు ఎస్సీ కాలనీలో నిర్మించిన సీసీ రోడ్ 2001 సంవత్సరంలో వేశారు ఎనిమిది నెలలకే పలిగిపోయింది నాణ్యత లేమితో పగుళ్లు ఏర్పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఏటా లక్షల రూపాయల నిధులను కేటాయిస్తున్నా నాయకుల అండదండలతో పనులు చేజిక్కించుకున్న గుత్తేదారులు ఇష్టారీతిన రోడ్లు నిర్మించడంతో కోట్ల రూపాయలు మట్టి పాలవుతున్నవి. సీసీ రోడ్లు పగుళ్లు, కంకర తేలడంతో గ్రామస్థులు ఇబ్బందుల పడుతున్నారు. ఈ పనులపై గత ప్రభుత్వం లో ఉన్న తొలి శాసనసభాపతి మధుసూదనాచారి దృష్టికి తీసుకువెళ్లారు అయినా ఫలితం లేకుండా పోయింది మళ్లీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డికి దృష్టికి తీసుకువెళ్లారు అయినా ఆ కాలనీవాసుల ఫలితం శూన్యంగా అయింది . ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దృష్టి సారించి ఈ కాలనీలోని గతంలో వేసిన సీసీ రోడ్డు తీసి వేయించి కొత్త సిసి రోడ్డు వేయించాలని, సైడ్ డ్రైనేజీ కాలువలు నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు కాగ గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లను ఉన్నతాధికారులు పరిశీలించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *