మా నానమ్మకి ఏం కాలేదు: అమన్‌జోత్…

మా నానమ్మకి ఏం కాలేదు: అమన్‌జోత్

 

మహిళల ప్రపంచ కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అమన్‌జోత్ తన నానమ్మ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించింది. ఆమె బాగానే ఉన్నారని, అవాస్తవ ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంట్లో అమన్‌జోత్ పట్టిన క్యాచ్ ఆట గతిని మార్చేసింది. అద్భుత ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ ఇచ్చిన క్యాచ్ బౌండరీ లైన్ దగ్గర అమన్ అద్భుతంగా అందుకుంది. చరిత్రలో నిలిచిపోయే ఈ క్యాచ్‌తో 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడేలా భారత్‌ను తొలిసారి ఛాంపియన్‌గా నిలిపింది. మ్యాచ్ అనంతరం ఆమె తండ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై అమన్‌జోత్ క్లారిటీ ఇచ్చ

‘అమన్‌జోత్(Amanjot Kaur) కెరీర్ వెనక మా అమ్మ భగవంతి మూలస్తంభంలా నిలబడింది. మొహాలీలో అమన్ వీధుల్లో క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు ఆమెనే తీసుకెళ్లేది. బలోంగిలో నాకు కార్పెంటరీ షాప్ ఉంది. అమన్‌తో వెళ్లేందుకు నాకు వీలయ్యేది కాదు. కానీ ఇంటి ముందు, పార్క్ వద్ద అమన్ మగపిల్లలతో ఆడేటప్పుడు బయట కూర్చొని చూస్తూ ఉండేది. చాలామంది అమ్మాయిలూ ధైర్యంగా వారితో ఆడేవారు. ప్రపంచ కప్ సమయంలో మా అమ్మకు గుండెపోటు వచ్చింది. అయితే ఆ విషయాన్ని అమన్‌కు చెప్పలేదు. ఆమె దృష్టి మారకుండా ఉండాలనే అలా చేశాం’ అని అమన్ తండ్రి భూపిందర్ సింగ్ తెలిపారు.

తన నానమ్మ విషయంలో తండ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భిన్నంగా ప్రచారం అవ్వడంపై అమన్ స్పందించింది. ‘మా నానమ్మ విషయంలో ఓ క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. ఆమె ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. బయట ప్రచారం అవుతున్నట్లు ఎలాంటి సమస్యా లేదు. ఇలాంటి వాస్తవాలు నమ్మొద్దు. ప్రచారం చేయొద్దు. మా కుటుంబంపై ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అమన్ వెల్లడించింది.

మ్యాచ్‌లో గాయపడ్డ సాయి సుదర్శన్.. హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన బీసీసీఐ….

మ్యాచ్‌లో గాయపడ్డ సాయి సుదర్శన్.. హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన బీసీసీఐ

 

వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ప్లేయర్ సాయి సుదర్శన్ గాయపడ్డాడు. అతడి గాయం తీవ్రమైనది కాదని బీసీసీఐ తాజాగా హెల్త్ అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడని తెలిపింది.

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్ రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ టీమిండియా క్రికెటర్ సాయి సుదర్శన్ ఆరోగ్యంపై బీసీసీఐ తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చింది. అతడు ప్రస్తుతం బాగానే ఉన్నాడని పేర్కొంది. రెండో రోజున విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ కొట్టిన బంతిని సాయి సుదర్శన్ అద్భుత రీతిలో అందుకుని అతడిని పెవిలియన్ బాట పట్టించాడు. ఈ క్రమంలో చేతికి కాస్త పెద్ద దెబ్బతగలడంతో తట్టుకోలేకపోయిన అతడు వెంటనే మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో దేవదూత్ పడిక్కల్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన విషయం తెలిసిందే (Sai Sudarshan BCCI Health Update).
విండీస్‌తో తాజా చివరి టెస్టు మూడో రోజున కూడా సాయి సుదర్శన్ బరిలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో అతడు ఆరోగ్యంపై బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. అతడి గాయం తీవ్రమైనది కాదని తెలిపింది. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడని తెలిపింది. తమ మెడికల్ టీమ్ అతడి ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొంది. ఇక ప్రస్తుత టెస్టులో గడ్డు పరిస్థితిలో పడిపోయిన ఫాలో ఆన్ ముప్పును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఇక రెండో టెస్టు తొలి రోజున సాయి సుదర్శన్ ఆట తీరుతో జనాల విమర్శలకు గట్టిగా బదులిచ్చారు. 87 పరుగులతో నిలకడైన ఆటతో రాణించాడు. అయితే, వైస్ కెప్టెన్ జోమెల్ వారికన్ వేసిన బంతిలో బ్యాక్ ఫుట్ షాట్‌కు ప్రయత్నించి ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

బన్నీ హాప్స్‌ క్యాచ్‌లు కుదరవు.

బన్నీ హాప్స్‌ క్యాచ్‌లు కుదరవు

 

 

 

 

బౌండరీల దగ్గర పట్టే ‘బన్నీ హాప్స్‌’ క్యాచ్‌ల విషయంలో మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. క్యాచ్‌ విషయంలో ఫీల్డర్‌ నియంత్రణ…

దుబాయ్‌: బౌండరీల దగ్గర పట్టే ‘బన్నీ హాప్స్‌’ క్యాచ్‌ల విషయంలో మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. క్యాచ్‌ విషయంలో ఫీల్డర్‌ నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటే మైదానంలో ఉన్నప్పుడే బంతిని పైకి విసిరి.. లైన్‌ దాటి తిరిగి లోనికి వచ్చే అందుకోవాల్సి ఉంటుంది. అంటే బౌండరీ బయట బంతిని పలుమార్లు ఎగర వేయడం కుదరదు. ఈనెల నుంచే కొత్త రూల్‌ ఐసీసీ ప్లేయింగ్‌ కండిషన్‌లో భాగం కానుండగా.. వచ్చే ఏడాది అక్టోబరు నుంచి ఎంసీసీ రూల్‌ ఆఫ్‌ లాలో అధికారికంగా చేరుస్తారు. మరోవైపు వన్డేల్లో రెండు కొత్తబంతుల నిబంధనల్లో మార్పు, కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ప్రొటోకాల్‌ను ఐసీసీ ఆమోదించింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version