భారతీయ చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘రామాయణ’. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నితిశ్ తివారి భక్తిశ్రద్ధలతో రూపొందిస్తున్నారు.
భారతీయ చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘రామాయణ’. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నితిశ్ తివారి భక్తిశ్రద్ధలతో రూపొందిస్తున్నారు. వివాదాలకు తావు లేకుండా, విజువల్ వండర్‌గా ‘రామాయణ’ చిత్రాన్ని రూపొందించడానికి కృషి చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ చాలా కాలం క్రితమే మొదలైనా గత ఏడాది నవంబర్ నెలలో అధికారికంగా వివరాలు వెల్లడించారు. సాయిపల్లవి సీతగా, రావణుడిగా కన్నడ హీరో యశ్, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణునిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, లారా దత్తా కైకేయిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. ఇక ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర శూర్పణఖ. రామ, రావణ యుద్ధం జరగడానికి కారణమైన ఈ పాత్రను రకుల్ ప్రీత్‌సింగ్ పోషించనున్నారు. ఆమె కంటే ముందు ఆ పాత్ర కోసం ఎవరిని సంప్రదించారో తెలుసా? పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రాను. ఆమె శూర్పణఖ పాత్ర పోషిస్తే అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ‘రామాయణ’ చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతుందని దర్శకనిర్మాతలు భావించారు. అయితే తనకున్న ఇతర కమిట్‌మెంట్స్ వల్ల ఆ పాత్ర చేయలేనని ప్రియాంక చెప్పడంతో అప్పుడు రకుల్‌ను ఈ అవకాశం వరించింది. ప్రియాంక చోప్రా ఇప్పుడు మహేశ్, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా రామాయణగాథ స్ఫూర్తితో రూపొందుతుండడం విశేషంగా పేర్కొనాలి.
ఎయిరిండియాలోనే మంచు లక్ష్మీ ప్రయాణం ఆమె ఏమన్నారంటే…
అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన రోజే మంచు లక్ష్మీ ఎయిరిండియా విమానంలో లండన్‌కు వెళ్లారు.
అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా (Air india Plain) విమానం కుప్పకూలిన రోజే మంచు లక్ష్మీ (manchu lakshmi Prasanna) ఎయిరిండియా విమానంలో లండన్‌కు వెళ్లారు. దీంతో ఆమె ఎలా ఉన్నారో ఆరా తీశారు అభిమానులు. మెసేజ్‌లు చేశారు. అయితే తాను క్షేమంగా ఉన్నానంటూ మంచు లక్ష్మి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ‘‘ఫ్లైట్ దిగిన తర్వాత ప్రమాదం గురించి తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యాను. నేను ఎలా ఉన్నానో కనుక్కోవడం కోసం ఎన్నో ఫోన్లు, మెేసజ్‌లు వస్తూనే ఉన్నాయి. నేను, మా అమ్మాయి అదేరోజు ముంబయి నుంచి లండన్‌కు ఎయిరిండియా విమానంలో ప్రయాణం చేశాము. దేవుడి దయ వల్ల మేము సేఫ్‌గా చేరుకున్నాం. అక్కడికి వెళ్లిన వెంటనే ఈ ప్రమాదం గురించి తెలిసి ఉలిక్కిపడ్డాను.
ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం. విద్యార్థులు కూడా మృతి చెందారని తెలిసి నా హృదయం ముక్కలైంది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మన ప్రాణాలు క్షణంలో ముగిసిపోతాయనడానికి ఈ ప్రమాదం ఒక ఉదాహరణ. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని మంచు వీడియోలో పేర్కొన్నారు. ఈ నెల 12న జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా ఆస్పత్రి, నివాస సముదాయం లోని ప్రజలు కొంత మంది మరణించినట్లు చెప్పారు.
పుష్ప అంటే ఇంటర్నేషనల్’ అంటూ పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్‌లానే ఇప్పుడు ఆయన ఇమేజ్ కూడా ఇంటర్నేషనల్ లెవల్‌కు వెళ్లింది. దాంతో ఆయనతో సినిమాలు చేయబోయే దర్శకులు.
పుష్ప అంటే ఇంటర్నేషనల్’ అంటూ పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్‌లానే ఇప్పుడు ఆయన ఇమేజ్ కూడా ఇంటర్నేషనల్ లెవల్‌కు వెళ్లింది. దాంతో ఆయనతో సినిమాలు చేయబోయే దర్శకులు అంటూ రోజుకో పేరు తెరపైకి తెస్తున్నాయి సోషల్ మీడియా వర్గాలు. తాజాగా అల్లు అర్జున్‌ను డైరెక్ట్ చేయబోతున్న దర్శకుల జాబితాలో మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ పేరు చేరింది. ఆయనతో ఓ సినిమా చేసేందుకు బన్నీ ఎస్ చెప్పారంటూ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బాసిల్ చెప్పిన కథ అల్లు అర్జున్‌కు బాగా నచ్చిందని, త్వరలోనే వీరి కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వస్తుందనేది ఆ వార్తల సారాంశం. బాసిల్ జోసఫ్ నటుడిగా, దర్శకుడిగా మలయాళ పరిశ్రమలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అయితే అవేవీ అల్లు అర్జున్ స్థాయికి తూగేవి మాత్రం కావు. కాబట్టి ఈ ప్రచారంలో నిజానిజాలేమిటో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఇప్పుడీ చిత్రానికి లీకుల కష్టం మొదలైంది. టీజర్‌లోని కొన్ని విజువల్స్‌ను నెట్టింట లీక్ చేశారు. దీనిపై టీమ్ స్పందించింది.
ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి (Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. (The raja saab) జూన్ 16న ఈ సినిమా టీజర్ విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇప్పుడీ చిత్రానికి లీకుల కష్టం మొదలైంది. టీజర్‌లోని కొన్ని విజువల్స్‌ను నెట్టింట లీక్ చేశారు. దీనిపై టీమ్ స్పందించింది.
లీక్ కంటెంట్‌ను షేర్ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని టీమ్ హెచ్చరించింది. ఎవరైనా ‘రాజాసాబ్’ కంటెంట్‌కు సంబంధించిన అనధికారక వీడియోలు, ఫొటోలు, షేర్ చేస్తే వారి సోషల్ మీడియా అకౌంట్‌ను తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సినిమాటిక్ అనుభూతి అందించేందుకు చిత్రబృందం ఎంతో కష్టపడుతోందని దానికి అందరూ సహకరించాలని కోరింది.
ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ చిత్రమిది. దీంతో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. టీజర్‌ను ఈ నెల 16న విడుదల చేయనున్నట్లు టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్‌లో ఈవెంట్ చేయాలను కుంటున్నారని తెలిసింది. మాళవిక మోహనన్, నిధీ అగర్వాల్, రిద్థికుమార్ కథానాయికలు. సంజయ్‌దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
మైండ్ దొబ్బే క్రైమ్ థ్రిల్లర్.. సడన్‌గా ఓటీటీకి! ఎందులో అంటే
ఎలాంటి హాడావుడి లేకుండా, ప్రచార ఆర్బాటాలు లేకుండా రూపొంది గత నెల మే9న థియేటర్లలోకి వచ్చిన మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా బ్లైండ్ స్పాట్.
ఎలాంటి హాడావుడి లేకుండా, ప్రచార ఆర్బాటాలు లేకుండా రూపొంది గత నెల మే9న థియేటర్లలోకి వచ్చిన మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా బ్లైండ్ స్పాట్ (Blind Spot).
నవీన్ చంద్ర (Naveen Chandra), అలీ రెజా (Ali Reza), రాశి సింగ్ (Rashi Singh), రవి వర్మ (Ravi Varma), గాయత్రి భార్గవి కీలక పాత్రలు పోషించారు.
మూవీ రిలీజ్ అయ్యాక పబ్లిక్ నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఎలాంటి ప్రచారం లేక పోవడంతో జనాలకు రీచ్ కాలేక పోయింది.
ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి ఆశ్చర్య పరిచింది.
రాకేష్ వర్మ (Rakesh Varma) ఈ సినిమాతో దర్శక, రచయితగా ఎంట్రీ ఇచ్చాడు.
యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను రిలీజ్ చేసింది.
సినిమా పుస్తకాలు
Blind Spot
జయరామ్ (రవివర్మ), దివ్య (రాశి సింగ్) భార్యాభర్తలు వీరికి ఓ చిన్న పాప ఉంటుంది.
వీరి ఇంట్లో లక్ష్మి (గాయత్రీ భార్గవి) పని మనిషిగా వర్క్ చేస్తుంటుంది.
అయితే ఒక రోజు రాత్రి దివ్య తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపిస్తుంది.
సమాచారం అందుకున్న పొలీసాఫీసర్ విక్రమ్ (నవీన్ చంద్ర) కేసు టేకప్ చేసి ఇంటి కొచ్చి అంతా పరిశీలించి ఇది ఆత్మహత్య కాదు, హత్య అని డిసైడ్ అవుతాడు.
ఈ నేపథ్యంలో విక్రమ్ పరిశోధన స్టార్ట్ చేసి ఆ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కరినీ ఇంటరాగేట్ చేస్తూ వెళుతుంటాడు.
ఈ సందర్భంగా వారు చెప్పే అన్సర్ సైతం అనుమానాస్పదంగా గోచరిస్తుంటాయి.
వాళ్లు చెప్పే జవాబులు నిజంగా అనిపించినా అందులో ఎక్కడో, ఎవరో అబద్ధం చెబుతున్నారని అనిపిస్తుంటుంది.
ప్రతిసారీ ఓ కొత్త విషయం తెలుసుకుంటాడు.
ఈ నేపథ్యంలో విక్రమ్ అసలు హంతకుడిని పట్టుకోగలిగాడా, లేదా అసలు దివ్య ఎలా చనిపోయిందనే ఇంట్రెస్టింగ్ కథకథనాలతో సినిమా చివరి వరకు సస్పెన్స్ తో సాగుతుంది.
కాగా.. ఇది రెగ్యులర్‌గా వచ్చే మర్టర్ థ్రిల్లర్ అయినప్పటికీ చూసే వారికి ప్రతి క్షణం ఉత్కంఠను కలుగ జేస్తూ తర్వాత ఏం జరుగబోతుందనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.
ఒక హత్య పది మంది అనుమానితులు వీరిలో అసలు హంతకుడిని కనిపెట్టే క్రమంలో అంతా అనుమానితులుగా అనిపించడం, పోలీసులు వ్యవహరించే విధానం బాగా చూయించారు.
సినిమా ఆరంభమైన తొలి ఐదు నిమిషాల్లోనే డైరెక్ట్ కథ స్టార్టవడం చివరి వరకు హంతకుడెవరనే పాయింట్‌తో సస్పెన్స్‌ను మెయింటెన్ ఏశారు.
Blind Spot
చివరిలో వచ్చే ట్విస్టు లు సైతం అదిరిపోయేలా ఉంటాయి.
రవి వర్మ, పని మనిషి పాత్రలు కీ రోల్ పోషించాయి.
ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ఎక్కువగా మిస్టరీ థ్రిల్లర్లు ఇష్టపడే వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్లైండ్ స్పాట్ (Blind Spot) చిత్రాన్ని మిస్ చేయకుండా ఫ్యామిలీతో చూసేయవచ్చు.
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మిత్రమండలి’. నిహారిక ఎన్.ఎం కథానాయిక. విజయేందర్ ఎస్. దర్శకత్వంలో కల్యాణ్ మంతిన…
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మిత్రమండలి’. నిహారిక ఎన్.ఎం కథానాయిక. విజయేందర్ ఎస్. దర్శకత్వంలో కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. నిర్మాత బన్నీ వాసు, బీవీ వర్క్స్‌తో కలసి సమర్పిస్తున్నారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ ‘మిత్రమండలి’ టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బన్నీ వాసు సమర్పిస్తున్న తొలి చిత్రం ఇది. టీజర్ చాలా బావుంది. దర్శకుడిలో ఎంతో ప్రతిభ ఉందని అర్థమవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలి’ అని ఆకాంక్షించారు. బన్నీ వాసు మాట్లాడుతూ ‘వినోదాత్మకంగా, ఉల్లాసంగా సాగే నలుగురు స్నేహితుల కథ ఇది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. థియేటర్లకు వచ్చి మనస్ఫూర్తిగా నవ్వుకోండి’ అన్నారు. ‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కంటెంట్‌తో వస్తున్నాం’ అని విజయేందర్ ఎస్. అన్నారు. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమిదని నిర్మాతలు తెలిపారు.
గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఆపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రఫూల్ రాంరెడ్డి చెప్పారు…
గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఆపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రఫూల్ రాంరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఆంధ్రా సినిమాలకు ఇవ్వవద్దని హైకోర్టులో ఫిటిషన్ వేశామని, శుక్రవారం వాదనలు వినిపించబోతున్నామని వారు చెప్పారు. కోర్టు ద్వారా తెలంగాణ సినిమాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు రవికుమార్ చౌదరి మరణించిన 24 గంటలు కాకముందే సీనియర్ నిర్మాత, ఎ.ఎ.ఆర్ట్స్ అధినేత కావూరి మహేంద్ర(79) గురువారం…
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు రవికుమార్ చౌదరి మరణించిన 24 గంటలు కాకముందే సీనియర్ నిర్మాత, ఎ.ఎ.ఆర్ట్స్ అధినేత కావూరి మహేంద్ర(79) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న మహేంద్ర తన స్వస్థలమైన గుంటూరులోని రమేశ్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. నటుడు, నిర్మాత మాదాల రవి ఆయనకు అల్లుడు. కుమారుడు జీతూ కొన్నేళ్ల క్రితమే మరణించారు. ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించిన మహేంద్ర తర్వాత నిర్మాణరంగంలోకి ప్రవేశించి గీతా ఆర్ట్ పిక్చర్స్, ఎ.ఎ. ఆర్ట్స్ బేనర్లపై 36 చిత్రాలు నిర్మించారు. 1977లో వచ్చిన ‘ప్రేమించి పెళ్లి చేసుకో’ నిర్మాతగా మహేంద్ర తొలి సినిమా. రాజశేఖర్ హీరోగా నటించిన ‘అర్జున’ ఆయన చివరి చిత్రం.
గోపీచంద్ కథానాయకుడిగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘గోపీచంద్ 33-వర్కింగ్ టైటిల్’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు…
గోపీచంద్ కథానాయకుడిగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘గోపీచంద్ 33-వర్కింగ్ టైటిల్’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూపొందించిన భారీసెట్లో చిత్రీకరణ జరుగుతోంది. గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం చిత్రబృందం పోస్టర్‌ను, గ్లింప్స్‌ను విడుదల చేసింది. గోపీచంద్ విభిన్నమైన లుక్‌లో కనిపించారు. యుద్ధభూమిలో వీరతిలకం ధరించిన యోధుడిగా ఆయన కనిపించారు. ఏడో శతాబ్దానికి చెందిన ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని ఓ పాయింట్‌తో సంకల్ప్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని యూనిట్ తెలిపింది.
హిస్టారికల్ కోర్ట్ రూ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం సుమారు 50 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే..
1919లోబ్రిటీష్ హాయాంలో జరిగిన దారుణ మారణ కాండ జలియన్ వాలా బాగ్‌కు మూల కారకుడైన అప్పటి పంజాబ్ జనరల్ మైఖైల్ ఓ డ్వేయర్ ఆ వార్త బయటి ప్రపంచానికి తెలియకుండా చేస్తాడు.
ఆపై తమకు అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలని ఆ సమయంలో వైస్రాయ్ కౌన్సిల్‌లో సభ్యుడైన అడ్వకేట్ శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్)ను డ్వేయర్ కోరుతాడు.
కానీ ఆక్కడ జరిగిన మారణకాండ విషయం తెలుసుకున్న ఆయన అందుకు ససేమిరా అని అక్కడిక్కడే తన పదవికి సైతం రాజీనామా చేసి డయ్యర్‌పైనే కేసు వేస్తాడు.
Kesari Chapter 2
దీంతో జనరల్ మరో ప్రముఖ అడ్వకేట్ నెవిల్లే మెక్‌కిన్లే (ఆర్.మాధవన్)ని ఆశ్రయించడంతో కేసు రసవత్తరంగా మారుతుంది.
ఈ క్రమంలో శంకర్ నాయర్, మెక్‌కిన్లేల మధ్య ఎలాంటి వాదనలు జరిగాయి, నాటి దురాగతాన్ని ఎలా బాహ్య ప్రపంచానికి తెలియజేశారు.
చివరకు కథ ఎన్ని మలుపులు తిరిగిందనే కథకథనాల చుట్టూ సినిమా సాగుతూ నాటి జలియన్ వాలాబాగ్ దుర్ఘటనను తలుచుకుని ఎమోషనల్‌గా ఫీలయ్యే విధంగా మూవీ నడుస్తుంది.
ఇప్పుడీ చిత్రం జూన్ 13 శుక్రవారం నుంచి జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇప్పటికే థియేటర్లలో ఈ సినిమా చూడలేక పోయిన వారు, మల్లీ చూడాలనుకునే వారు ఇప్పుడు ఎలాంటి సమస్య లేకుండా ఇంటి పట్టునే ఉంటూ ఫ్యామిలీతో కలిసి ముఖ్యంగా పిల్లలకు నాటి జలియన్ వాలా బాగ్ ఘటనను తెలియజేస్తూ మూవీ వీక్షించవచ్చు.
ముందే ఓటీటీకి వచ్చి షాకిచ్చిన లేటెస్ట్ స్పొర్ట్స్ కామెడీ మూవీ…
ప్రేమలు హీరో నస్లెన్ మరో ముగ్గురు యువ నటులు కీలక పాత్రల్లో నటించగా థియేటర్లలో మంచి విజయం సాధించిన మలయాళ అనువాద చిత్రం ఓ రోజు ముందే ఓటీటీకి వచ్చి షాకిచ్చింది.
ప్రేమలు హీరో నస్లెన్ (Naslen) మరో ముగ్గురు యువ నటులు కీలక పాత్రల్లో ఏప్రిల్ నెలాఖరున థియేటర్లలోకి వచ్చి మంచి పాజిటివ్ టాక్‌తో విజయం సాధించిన మలయాళ అనువాద చిత్రం అలప్పుజ జింఖానా (Alappuzha Gymkhana). తెలుగు కన్నా ముందే ఏప్రిల్ 10న కేరళలో రిలీజైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. గతంలో టొవినో థామస్, కళ్యాణి ప్రియదర్శన్ కాంబోలో తల్లుమాల (Thallumaala) అనే సినిమాతో కేరళను షేక్ చేసిన ఖలీద్ రహమాన్ (Khalid Rahman) ఈ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించడం విశేషం. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం రూ. 70 కోట్ల వరకు వసూళ్లు చేసి కేరళ నాట హయ్యెస్ట్ గ్రాసింగ్ చిత్రాల్లో టాప్5లో నిలిచింది. సుమారు 55 రోజుల తర్వాత ముందస్తుగా ప్రకటించిన డేట్ కన్నా ఓ రోజు ఎర్లీగానే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి షాకిచ్చింది.
సినిమా టికెట్లు
కథ విషయానికి వస్తే.. జోజో జాన్సన్ (నెస్లన్), డీజే, చిరుత, పెద్దోడు, చిన్నోడు, సెహనావాస్ ఐదుగురు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే ఇంటర్ ఫలితాల్లో ఒకరు మాత్రమే పాస్ అవుతారు.ఇక రెగ్యులర్‌గా కాలేజికి వెళ్లి చదువుకోవడం మన వళ్ల కానీ పని అని డిసైడ్ అయి కొత్తగా ఏదైనా ట్రై చేయాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం బాక్సింగ్ పోటీల్లో పాల్గొని స్పోర్ట్స్ కోటాలో కాలేజీలో పాస్ మార్కులతో బయట పడొచ్చని ఫ్లాన్ చేస్తారు. ఈక్రమంలో సమీపంలోని జింఖానా బాక్సింగ్ ఆకాడమీలో శిక్షణ కోసం చేరుతారు. ఈ నేపథ్యంలో ట్రైనింగ్ తీసుకునే క్రమంలో వారు ఆ పని సరిగ్గా చేయలేక, సీరియస్‌నెస్ లేక బాక్సింగ్ కోచ్ ముందు, అమ్మాయిల ఎదుట చేసే విన్యాసాలు, జిమ్మిక్కులు ఆపై డిస్ట్రిక్ లెవల్, స్టేట్ లెవల్ టోర్నమెంట్స్ ఆడాల్సి రావడంతో చివరకు ఆ కుర్రాళ్లు ఏం చేశారు, చివరకు ఎలా ముగించారనే ఆసక్తికర కథకథనాలతో సినిమా సాగుతుంది.
కాగా ఈ చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు ఫుల్ ఫన్ మోడ్‌లోనే సాగుతూ ప్రేక్షకులకు తీరిక ఇవ్వని వినోదంతో ఆకట్టుకుంటుంది. అయితే మూవీలో ఫలానా వాడు హీరో అని చెప్పలేం. నస్లైన్ తప్ప అందరూ మనకు ఏమాత్రం పరిచయం లేని మొహాలే అయినా ఐదుగురి పాత్రలకు సమ ప్రాధాన్యత ఉంటుంది. వారి చుట్టే కథ తిరుగుతూ వారి నటన, డైలాగులు, వన్ లైనర్స్ వాటినన్నింటినీ మరిచి పోయేలా చేస్తుంది. మూవీ స్టార్ట్ అయిన నిమిషం నుంచే పంచులు, తెలుగు ఫేమస్ మీమ్స్ అలేఖ్య ఫికిల్స్ టేస్ట్ చూయించాలి, వేణు స్వామి వద్ద జాతకం చూపించి చెప్పాలా వంటి వన్ లైనర్స్ తో కిక్ ఇస్తారు. ఫస్టాఫ్ అంతా బాక్సింగ్ ట్రైనింగ్, అమ్మాయిలకు సైట్ కొట్టే సరదా సరదా సన్నివేశాలతో నవ్విస్తారు.
ఇక సెకండాఫ్ అంతా బాక్సింగ్ కోర్టులో యాక్షన్ సీన్లతో ఆటాడేసుకుంటారు. మిత్రులు ఒక్కొక్కరు బాక్సింగ్ రింగ్‌లోకి వెళ్లే ముందు తోటి మిత్రులు ఇచ్చే బిల్డప్‌లు, వచ్చేపాట, డైలాగులు సీటులో కూర్చోనియకుండా నవ్విస్తాయి. ఎక్కడా అసభ్యత, అశ్లీలతలకు చోటివకుండా పాత్రల మధ్య సందర్భోచిత కామెడీతో ఆలరిస్తారు.ఇక క్లైమాక్స్ హీరో ఇంట్లో సన్నివేశం సినిమాకే హైలెట్. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో అదిరిపోతుంది. ఇప్పుడీ సినిమా జూన్ 12 నుంచి సోనీల లివ్ (SONY LIV) ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. చివరి వరకు మంచిగా ఎలాంటి బాదరబందీ లేకుండా హాయిగా మనస్పూర్తిగా నవ్వుకోవాలంటే, ఎలాంటి లాజిక్‌లు వెతక్కుండా కుటుంబం అంతా కలిసి ఈ సినిమా చూసి తీరాల్సిందే.
అయితే నగరంలో జరుగుతున్న వరుస హత్యల కేసుని డీల్ చేస్తున్న పోలీస్ అధికారి రంజిత్ (శశాంక్) రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆ బాధ్యత అరవింద్ తీసుకుంటాడు.
ఆపై కూడా వరుస హత్యలు కొనసాగుతూనే ఉన్నా హంతకుడు, హత్యకి గురైనవాళ్ల ఆనవాళ్లు ఆధారాలు ఎంతకీ లభించవు.
ఈ క్రమంలో చివరకు ఆరో హత్య దగ్గర లభించిన ఓ చిన్న క్లూతో కేసులో కదలిక వచ్చి ఒక్కొక్కరిగా హత్యకు గురైన వాళ్ల వివరాలు బయటకు వస్తాయి.
కానీ హత్యలు చేసేది ఎవరనే విషయం మాత్రం తెలియదు.
చివరకు అరవింద్ ఏం చేశాడు.
హంతుకుడిని పట్టుకో గలిగాడా?
లేదా అతను ఈ దారుణాలు చేయడానికి కారణమేంటి?
ట్విన్ బర్డ్ స్కూల్‌కి, 6 మంది కవలలకి ఈ హత్యలకు సంబంధం ఏంటి?
ఈ కథలో బెంజిమన్ పాల్, ఫ్రాన్సిస్ ఎవరు?
అన్నది కథ.
సినిమా ఆరంభమైన 10 నిమిషాలలోనే ఇన్వెస్టిగేషన్ మొదలై..
ప్రేక్షకులకు స్పైన్ చిల్లింగ్ ఇస్తూ సినిమా ఆద్యంతం సస్పెన్స్ తో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.
అంతేగాక సీరియల్ కిల్లర్ బ్యాగ్రౌండ్ స్టోరీ ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది.
మరి కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు సైతం ఆకట్టుకుంటాయి.
ఇక ఫ్రీ ఇంటర్వెల్‌కు ముందే కిల్లర్ బయటపడ్డప్పటికీ చివర్లో వచ్చే ట్విస్టు సైతం గూస్‌బమ్స్ తెచ్చేలా ఉంటుంది.
ఇప్పుడీ సినిమా జూన్ 13 శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లోనే కాకుండా మరో మూడు ఓటీటీల్లో (ఆహా తమిళ్, టెన్ కొట్టా, సింప్లీ సౌత్) స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్లలో మిస్సయిన వారు, మంచి థ్రిల్లర్ చిత్రం చూడాలనుకునే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎలెవన్ (Eleven) సినిమాను మిస్ అవకుండా చూసి ఎంజాయ్ చేయవచ్చు.
ఇదిలాఉంటే నవీన్ చంద్ర నటించిన మరో థ్రిల్లర్ బ్లైండ్ స్పాట్ సైతం ఈ సినిమా విడుదల రోజే థియేటర్లలోకి రాగా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కూడా ఓకే రోజు రావడడం గమనార్హం.
సినిమా రివ్యూవర్లపై.. దయ్యం పగ! డీడీ నెక్స్ట్ లెవెల్ ఓటీటీకి వచ్చేసింది
పాపులర్ తమిళ కమెడియన్ సంతానం హీరోగా నటించిన కొత్త చిత్రం ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ ఓటీటీకి తెలుగులోనూ వచ్చేసింది.
పాపులర్ తమిళ కమెడియన్ సంతానం (Santhanam) హీరోగా నటించిన కొత్త చిత్రం ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ (DD Next Level).
సెల్వ రాఘవన్ (Selva raghavan), గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon), గీతికా తివారి (Geethika Tiwary) తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
క్రియేటివ్ రైటర్, డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ (S. Prem Anand) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
గతంలో సంతానం నటించిన హర్రర్, కామెడీ సినిమా డీడీ రిటర్న్స్ కి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం మే16న ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయం పాలైంది.
ఇప్పుడీ సినిమా నెల తిరగకుండానే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది.
కథ విషయానికి వస్తే.. ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించే కృష్టమూర్తి (సంతానం) తరుచూ కొత్త సినిమాల రివ్యూలు ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటుంటాడు.
ఒకసారి ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ అనే సినిమా స్క్రీనింగ్‌కు హాజరు కావాలని మూవీ ఫ్యారడైజ్ అనే థియేటర్ నుంచి కృష్టమూర్తి, మరికొంతమంది రివ్యూవర్స్‌కి ప్రత్యేక ఆహ్వానం వస్తుంది.
దీంతో ఈ సినిమా చూడడానికి కృష్ణమూర్తి అక్కడ చిక్కుకుపోతాడు.
గతంలో తన రివ్యూ వళ్ల నష్టపోయిన నిర్మాత దయ్యంగా మారి ట్రాప్ చేసి ఇక్కడకు తీసుకు వచ్చినట్లు తెలుసుకుంటాడు.
అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు గానీ సాధ్య పడదు..
పైగా ఆ థియేటర్లో రన్ అవుతున్న సినిమాల్లో వచ్చి పడతాడు.
ఈక్రమంలో కృష్ణమూర్తి ఆ సినిమాలో నుంచి ఆపై దయ్యం, థియేటర్ నుంచి ఎలా బయట పడ్డాడనే నేపథ్యంలో సినిమా సాగుతుంది.
వినడానికి, చూడడానికి ఈ మూవీ ఎంతో ఆసక్తికరంగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే పరంగాఫెయిల్ అయి సెకండాఫ్ కాస్త ఇబ్బంది పెడుతుంది.
అయినా ఒక సారి ఈ సినిమాను చూసేందుకు ప్రయత్నించవచ్చు.
ఇప్పుడీ చిత్రం జీ5 (zee 5) ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు ఇతర సౌత్ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
హర్రర్ చిత్రాలు ఇష్టపడే వారు ఒకసారి ఈ ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ (DD Next Level) చిత్రాన్ని ట్రై చేయవచ్చు.
గత నెల మే23న తమిళ, తెలుగు భాషల్లో థియేటర్లలోకి మిశ్రమ స్పందనను దక్కించుకున్న రొమాంటిక్ క్రైమ్ డ్రామా చిత్రం ఏస్ (Ace). విజయ్ సేతుపతి (Vijay Sethupathi), రుక్మిణి వసంత్ (Rukmini Vasanth), దివ్యాపిళ్లై (Divya Pillai), యోగిబాబు (Yogi Babu), ఫృథ్వీ రాజ్ (బబ్లూ) (Babloo Prithiveeraj) కీలక పాత్రల్లో నటించారు. అర్ముగ కుమార్ దర్శకత్వం వహించగా సామ్ సీఎస్ (Sam C. S), జస్టిన్‌ప్రభాకరన్ (Justin Prabhakaran) సంగీతం అందించారు. అయితే పూర్ పబ్లిసిటీ వళ్ల అటు తమిళంలో, ఇటు తెలుగులో ప్రేక్షకులకు చేరువ కాలేక ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సడన్గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి షార్ చేసింది.
కథ విషయానికి వస్తే.. బోల్ట్ కన్నన్ జైలు నుంచి రిలీజై కొత్త జీవితం స్టార్ట్ చేసేందుకు మలేషియా వెళతాడు. అక్కడ జ్ఞానందం సాయంతో అక్కడే ఉంటూ కల్పన అనే యువతి హోటల్‌లో పని చేస్తుంటాడు. మరోవైపు మలేసియా పోలీసుగా పని చేసే కామంధుడైన పెంపుడు తండ్రి రాజా దొరైతో ఇబ్బందులు పడుతూ ఓ బట్టల షాప్‌లో పని చేస్తూ ఉంటుంది రుక్మిణి. అయితే తను అడిగిన డబ్బు ఇస్తే వదిలేస్తానని చెప్పడంతో పలుచోట్ల పని చేస్తూ డబ్బు కూడబెడుతూ ఉంటుంది. సేమ్ అపార్ట్‌మెంట్‌లో ఉండడంతో బోల్ట్ కన్నన్, రుక్మిణిల మధ్య పరిచయం ప్రేగా మారుతుంది.
ఇదిలాఉంటే.. ఓ వైపు కల్పన హోటల్ కోసం తీసుకున్న లోన్ డబ్బులు తిరిగి కట్టలేక పోతుండడం, మరో వైపు రుక్మిణి తన పెంపుడు తండ్రి నుంచి బయట పడడానికి డబ్బులు అవసరం పడడంతో కన్నన్ వారి సమస్యలు తీర్చేందుకు నిర్ణయించుకుంటాడు. ఈక్రమంలో లోకల్‌గా అక్రమ వ్యాపారుల మధ్యకు వెళ్లి క్యాసినో తరహా గేమ్‌లు ఆడి లక్షల్లో బకాయి పడతారు. అయితే తమ డబ్బు కోసం ప్రాణాలు తీసే వారి నుంచి హీరో ఎలా బయట పడ్డాడు, అసలు హీరో ఆ గేమ్‌లు ఎందుకు ఆడాడు, కల్పన, రుక్మిణిల సమస్యలు తీర్చాడా, అక్కడ జరిగిన బ్యాంక్ రోబరికి కన్నన్‌కు మధ్య ఉన్న లింకేంటి అనే కథకథనాలతో సినిమా సాగుతూ ఆకట్టుకుంటుంది.
అయితే. సినిమాలో తర్వాత ఏం జరుగబోతుందనేది మనకు ముందే తెలుస్తున్నా చూసే ప్రేక్షలకు మాత్రం ఎక్కడా బోర్ కోట్టకుండా విజయ్ సేతుపతి, యోగిబాబు పాత్రలు ఆకట్టుకుంటాయి. వారి మధ్య వచ్చే సంభాషణలు డార్క్ కామెడీతో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. విలన్లతో హీరో ఆడే గేమ్ కూడా సరదాగా సాగుతుంది. బ్యాంక్ దొంగతనం, కన్నన్ వేసే ఎత్తులు అన్నీ మంచి క్యూరియాసిటీని కలుగ జేస్తాయి. ఇప్పుడీ సినిమా జూన్ 13, శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (PrimeVideoIN) ఓటీటీలో తమిళంతో పాటు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి ఫన్ రైడ్ మూవీ చూడాలనుకునే వారికి ఈ ఏస్ (Ace) సినిమా మంచి ఆఫ్సన్. ఎక్కడా ఎలాంటి అసభ్యత లేకుండా సినిమా అలా సరదాగా సాగి పోతూ ఉంటుంది.
NTR – War 2: పాత్రలోని స్వభావాన్ని ప్రతిబింబించేలా లుక్స్..
వార్-2 (War 2) చిత్రం తారక్ (Jr NTR) బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
వార్-2 (War 2) చిత్రం తారక్ (Jr NTR) బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల టీజర్ విడుదల చేయగా దానికి చక్కని స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. టీజర్‌లో ఎన్టీఆర్ లుక్, స్టైలింగ్ అదిరిందనే ప్రశంసలు వచ్చాయి. ఆ క్రెడిత్ మొత్తం అనైతా ష్రాఫ్ అడజానియాకే (Anaita Shroff Adajania) దక్కుతుంది. తన కాస్ట్యూమ్స్‌కి, తన పని తనానికి వచ్చిన ప్రశంసని, అభిమానుల నుంచి వచ్చిన ప్రేమను చూసి ‘వార్ 2’ కాస్ట్యూమ్ డిజైనర్ ఆనందంతో మునిగి తేలుతున్నారు. దేశంలోనే అత్యుత్తమ స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందిన అనైతా ఈ మేరకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
‘‘వార్ 2’లో మొదటిసారి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో పని చేయడం పూర్తిగా సంతోషాన్ని ఇచ్చింది. అదొక కొత్త అనుభూతి. ఆయన సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తే ఆ ఎనర్జీ అంతా అందరిలోకి వచ్చేస్తుంటుంది. ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉందనిపిస్తుంది. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంతో ఉల్లాసంగా ఉంచుతారు. ఆపై అతను పోషిస్తున్న పాత్రలో ఎన్నో రకాల లేయర్స్ ఉంటాయి. అందుకే ఎన్టీఆర్ కోసం చాలా లుక్స్ డిజైన్ చేశాం. ఆయన పాత్రలోని స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాం. ఓ లక్ష్యంతో, ఉద్దేశ్యంతో పనిచేసే మానవ యంత్రంలా చూపించే ప్రయత్నం చేశాం’’ అని అన్నారు. ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రమిది. కియారా అద్వానీ కథానాయిక. ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో వార్ 2 భారీ ఎత్తున విడుదల కానుంది.
కోలీవుడ్‌లో రవి మోహన్‌కు(జయంరవి) ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లు హీరోగా అందరినీ మెప్పించిన ఆయన ఇకపై నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
కోలీవుడ్‌లో రవి మోహన్‌కు(జయంరవి) ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లు హీరోగా అందరినీ మెప్పించిన ఆయన ఇకపై నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన హీరోగా, నిర్మాతగా రానున్న ‘బ్రోకోడ్’ (Brocode) చిత్రానికి సంబంధించిన అప్డేట్ ప్రకటించారు. ‘డిక్కీలోనా’, ‘వడక్కుపట్టి రామసామి’ వంటి చిత్రాలతో పేరొందిన కార్తీక్ యోగీ దర్శకత్వంలో ‘బ్రోకోడ్’ చిత్రం తెరకెక్కనుంది. నలుగురు ప్రముఖ మహిళా నటులతో పాటు ఎస్.జె. సూర్య కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నారు. స్ల్లాప్ స్టిక్ కామెడీ అంశాలతో కూడిన ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రవి మోహన్ (Ravi Mohan) స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు జయం రవి. మహిళా నటీమణులు ఎవరనేది త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. రవి మోహన్ ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’, గణేష్ కె. బాబు డైరెక్ట్ చేస్తున్న ‘కరాటే బాబు’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా గురించి దర్శకుడు కార్తీక్ యోగీ మాట్లాడుతూ.. ‘నేను రవి మోహన్‌కి కథ చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఈ కథను పూర్తిగా ఆస్వాదించారు. ఈ చిత్రంలో స్లాప్ స్టిక్ కామెడీ బేస్డ్ సినిమా ఇది. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా రూపొందిస్తున్నాం’’ అని అన్నారు. పోర్ తోజిల్ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన కలైసెల్వన్ శివాజీ, యానిమల్, అర్జున్ రెడ్డి వంటి విజయాలను అందించిన హర్షవర్థన్ ఈ ప్రాజెక్ట్ కోసం పని చేయనున్నారు. ఎడిటర్‌గా ప్రదీప్ ఇ. రాఘవ్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ. రాజేష్ వ్యవహరించనున్నారు.
నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అటు రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇటు పూర్తి చేయాల్సిన సినిమాలపైన దృష్టిపెట్టారు.
నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), అటు రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇటు పూర్తి చేయాల్సిన సినిమాలపైన దృష్టిపెట్టారు. ఇటీవల ఓ షెడ్యూల్‌తో హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేశారు. తదుపరి ఓజీ సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagath singh) వంతు వచ్చింది. హరీశ్ శంకర్(HariSh Shankar) దర్శకత్వంలో ఎప్పుడో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. మంగళవారం నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలు కానుందని తెలిసింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో షూటింగ్ జరగనుంది. ప్రస్తుతం సినిమాలో కీలక పాత్రధారులపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. తదుపరి ఈ నెల 12 నుంచి పవన్‌కల్యాణ్ సెట్‌లో అడుగుపెడతారని తెలిసింది.
ఈ సినిమా అనుకున్నప్పుడు ‘తెరీ’ మూవీ రీమేక్ అనుకున్నారు. ఏపీ ఎలెక్షన్ ముందు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు
అందుకు తగ్గట్టుగా డైలాగ్స్ సీన్స్ రాసుకున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం కాబట్టి కంప్లీట్ గా సీన్స్, డైలాగ్స్ మార్చారని సమాచారం. మార్పులు చేర్పులు చేసిన కథతో సెట్స్ మీదకెళ్లనున్నారని సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే దర్శకుడు స్పందించాల్సిందే. పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్ సెట్‌లో అడుగుపెట్టబోతున్నారని తెలియగానే అభిమానులు హంగామా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక.
నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ -3’ మూవీ బుల్లితెరలోనూ ప్రత్యక్షం కాబోతోంది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను టీవీ ఛానెల్స్ లో ప్రసారం కోసం రీ-సెన్సార్ కు మేకర్స్ అప్లయ్ చేశారని తెలుస్తోంది.
నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన ‘హిట్ -3’ (Hit -3) సినిమాను అతని కెరీర్ లోనే కాదు… తెలుగులో వచ్చిన అత్యంత హింసాత్మక చిత్రం అని విశ్లేషకులు కొందరు వ్యాఖ్యానించారు. నాని గత చిత్రాలకు భిన్నంగా ఇది ‘ఎ’ సర్టిఫికెట్ ను పొందింది. ఈ విషయాన్ని స్వయంగా నానినే ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్స్ లో తెలిపారు. చిన్న పిల్లలు, వయసులో మరీ పెద్ద వాళ్ళు ‘హిట్ -3’కి దూరంగా ఉండాలని, కథానుగుణంగా వయొలెన్స్ ను ఈ సినిమాలో పెట్టక తప్పలేదని వివరణ ఇచ్చాడు. మానసికంగా నాని అండ్ టీమ్ ప్రేక్షకులను అంతలా ప్రిపేర్ చేసినా… థియేటర్లలో ‘హిట్ -3’ చూసిన వాళ్ళు అవాక్కయ్యారు.
నాని సినిమాలో ఇంత దారుణమైన సన్నివేశాలు ఉన్నాయేమిటీ అని వాపోయారు. ప్రస్తుతం వివిధ భాషల్లో ఈ తరహా హింసాత్మక చిత్రాలు బాగానే ప్రేక్షాకరణ పొందుతున్నాయని కొందరు చెబుతూ, అందుకు ఉదాహరణగా మలయాళ చిత్రం ‘మార్కో’ను, హిందీ సినిమా ‘కిల్’ను ఉదహరించారు. తెలుగు వారికి ‘హిట్ -3’ మరో ‘మార్కో’ (Marco) లేదా ‘కిల్’ (Kill) అని సరిపెట్టుకోవాలని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. థియేటర్లలో ‘హిట్ -3’ని చూసి హింసను తట్టుకోలేక నోరు వెళ్లబెట్టిన చాలామంది… మే నెలాఖరులో ఓటీటీ (OTT) కి సెన్సార్ ఉండదు కాబట్టి నెట్ ఫ్లిక్స్ (Netfilx) లో ‘హిట్ -3’ అన్ ఎడిటెడ్ వర్షన్ చూసి ఖంగుతిన్నారు. ఓటీటీలో ఈ సినిమాను చూసిన తర్వాత… థియేట్రికల్ వర్షన్ చాలా బెటర్ గా ఉందని భావించారు.
ఇక ఇప్పుడు టీవీలో…
చిత్రం ఏమంటే… ‘హిట్ -3’ సినిమాలోని హింస గురించి సినీ గోయర్స్ లో అంతగా ప్రచారం జరిగిన తర్వాత కూడా ఈ మూవీ మేకర్స్ ‘హిట్ -3’ని టీవీలో స్క్రీనింగ్ చేయడానికి సిద్థపడ్డారట. నిజానికి ‘ఎ’ సర్టిఫికెట్ పొందిన సినిమాలను ఏ ప్రైవేట్ టీవీ ఛానెల్స్ కూడా ప్రసారం చేయవు. ఖచ్చితంగా యు/ఎ సర్టిఫికెట్ పొందాల్సిందే. అందుకే ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చిన చిత్రాలను నిర్మాతలు ‘యు/ఎ’ కన్వర్షన్ కోసం మళ్ళీ సెన్సార్ కు అప్లయ్ చేస్తారు. ‘హిట్ -3’ సినిమా నిర్మాతలు సైతం ఇప్పుడు ‘యు/ఎ’ సర్టిఫికేషన్ కోసం తిరిగి సెన్సార్ బోర్డ్ ను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ‘హిట్ -3’ మూవీ విడుదలకు ముందు ‘మా సినిమాను కేవలం పెద్దలకు మాత్రమే తీశాం, ఈ హింసను తట్టుకునే ధైర్యం ఉన్నవాళ్ళే థియేటర్లకు రండి, ఇది అందరి కోసం తీసిన సినిమా కాదు’ అని అంతగా గట్టిగా చెప్పిన హీరో నాని… ఇప్పుడు ఈ సినిమాను టీవీల్లో ప్రసారం చేయడానికి ఎందుకు తహతహ లాడుతున్నాడో!? ఈ సినిమాకు ఆయన కూడా నిర్మాతే కాబట్టి… టీవీ ఛానెల్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎందుకు వదులుకోవాలని నానికి బహుశా అనిపించి ఉండొచ్చు. దారుణమైన హింస ఉన్న కారణంగా ‘హిట్ -3’కి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బృందం… ఇప్పుడు ‘యు/ఎ’ కోసం ఎలాంటి కసరత్తులు చేస్తుంది? రెండున్నర గంటల నిడివి ఉన్న ఈ సినిమాను టీవీ వీక్షకుల కోసం ఎంత ఎడిట్ అవుతుందనేది చూడాలి!?
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.