ఒంటరి ప్రయాణమే మేలు!

https://epaper.netidhatri.com/view/206/netidhathri-e-paper-10th-march-2024/2

పొత్తులతో ఒరిగేదేమీ లేదు.

బిఆర్‌ఎస్‌ ఎక్కడా బలహీన పడలేదు.

కార్యకర్తలు ఎక్కడా పక్క చూపులు చూడడం లేదు.

నాయకులే గోడ మీద కూర్చున్నారు.

అధిష్టానం డైలమా మంచిది కాదు.

https://netidhatri.com/revanth-reddy-attention-towards-land-grabbing-nala-illegal-constructions-bhudan-lands-netidhathri-exclusive/

పొత్తులో సీట్లు పంచి ఇవ్వడం కన్నా,పార్టీ నేతలకిస్తేనే మేలు.

ఒకవేళ ఓడిపోయినా మళ్ళీ బలపడేందుకు కృషి చేస్తారు.

పార్టీలో ఎంత కాలమున్నా పదవులు రావనేలా చేయకండి.

అవకాశవాదులు వెళ్ళి పోయినా అసలైన వారు మిగులుతారు.

ఎన్నటికైనా వాళ్లే మిగులుతారు.

పార్టీకి వాళ్లే దిక్కవుతారు.

ఇప్పటికైనా అభ్యర్థుల ఎంపిక క్యాడర్‌ కు వదిలేయండి.

పొత్తులు పక్కన పెట్టేయండి.

త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఒంటరిపోరే మేలు చేస్తుంది. పొత్తులతో మరింత నష్టమే జరుగుతుంది. పార్లమెంటు ఎన్నికలు అంటే జాతీయ స్ధాయి పార్టీలకే పట్టం కట్టాలనేమీ లేదు. ప్రజలు ఎవరు కావాలని కోరుకుంటే ఆ పార్టీయే ఎక్కువ సీట్లు గెల్చుకుంటుంది. అలా అనుకుంటే ఏ పార్లమెంటు ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు గెలవకూడదు. జాతీయ స్ధాయిలో కూటములే వుండకూడదు. అందువల్ల పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ పొత్తుల కోసం ఎదురుచూడడం నాయకుల, కార్యకర్తల ఆత్మస్ధైర్యం దెబ్బతినేలా చేస్తుంది. గడచిన శాసన సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు 37 శాతం ఓట్లు వచ్చాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు 39శాతం ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు 2శాతం ఓట్లు వచ్చాయి. ఆ రెండు శాతం ఈ పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు కలిసివస్తాయేమో? అన్న ఆలోచన తప్పు. పార్లమెంటు ఎన్నికలు ఫలితాలకు ఎలాంటి ప్రత్యేకమైన సిద్దాంతాలు వుండదు. కొందరు పార్లమెంటు ఎన్నికలు అనగానే ప్రజలు జాతీయ స్ధాయిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు గురించి జాతీయ పార్టీల వైపు మాత్రమే మొగ్గు చూపుతారనే వాదనలు నిజం కాదు. ఎన్నికలు వచ్చిన సమయంలో ప్రజల ఆలోచనలు ప్రస్పుటిస్తాయే గాని, జాతీయ పార్టీలే గెలుస్తాయన్న దానికి సైద్దాంతిక రుజువులు ఎక్కడా లేవు. కొందరు గత పార్లమెంటు ఎన్నికల ముందు 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ 85 స్ధానాలు గెల్చుకొని ప్రభంజనం సృష్టించింది. ఆ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెల్చిన బిజేపి రాష్ట్రంలో నాలుగు పార్లమెంటు స్ధానాలు గెలిచింది. కొడంగల్‌లో ఓడిపోయిన రేవంత్‌రెడ్డి, మల్కాజిగిరి నుంచి గెలిచారు. నల్లగొండలో ఓడిపోయిన వెంకటరెడ్డి భువనగిరిలో గెలిచాడు. ఇలా కొన్ని సూత్రీకరణలు చెబుతుంటారు. వాటికి ఎలాంటి నిబద్దతలు లేవు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏకంగా జాతీయ స్ధాయిలో ప్రతిపక్ష హోదా దక్కించుకున్నది. ఆ ఎన్నికల ముందు ఇందిరాగాంధీ హత్య చేయబడ్డారు. దేశమంతా సానుభూతి పవనాలు వీచాయి. కాంగ్రెస్‌ 408 స్ధానాలు గెల్చుకొని రికార్డు సృష్టించింది. అలాంటి రికార్డు ఏ పార్టీ సృష్టించలేదు. అలాంటి సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం స్వీప్‌ చేసింది. సుమారు 33 స్ధానాలు గెల్చుకొని ప్రతిపక్ష హోదాను సొంతం చేసుకున్నది. రాజకీయాలలో ఫలితాలకు ప్రత్యేకమైన లెక్కలేమీ వుండవు. జనం ఆ సమయంలో వారి బావోద్వేగాలు కూడా ప్రభావితమౌతాయి. సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి పరిస్ధితులే బిఆర్‌ఎస్‌కు కలిసి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బొటాబొటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్ధిరంగా వున్నట్లు ఆ పార్టీ నాయకులే నమ్మడం లేదు. బిఆర్‌ఎస్‌ నాయకులు ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలు చేస్తామని చెప్పడం లేదు. కాకపోతే రాజకీయ వి మర్శలు చేస్తూ వుంది. అంత మాత్రాన కుట్రలు చేస్తుందని చెప్పాల్సిన అవసరం లేదు. బిఆర్‌ఎస్‌ నాయకులు ఒకసారి అంటే సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పదే పదే పదిసార్లు మమ్మల్ని టచ్‌ చేస్తే ఏమౌతుందో చూడండి? అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇది కూడా బిఆర్‌ఎస్‌ కలిసి వచ్చే అంశమే. ఎందుకంటే ఒక రకంగా వాళ్ల ప్రభుత్వంపై వాళ్లకే నమ్మకంలేకుండాపోతోందన్న ప్రచారం విసృతంగా జరుగుతోంది. అంతే కాకుండా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హమీల అమలు అంతంత మాత్రంగానే వుండేలా కనిపిస్తున్నాయి. పైగా కరంటు కష్టాలు ఈ వేసవిలో ఎలా వుంటాయన్నదానిపై కూడా ఇప్పుడే చర్చ జరుగుతోంది. కోతలు కనిపిస్తూనే వున్నాయి. రైతులు సంతోషంగా వున్నట్లు మాత్రం కనిపించడం లేదు. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. బావులు ఎండిపోతున్నాయి. బోర్లలో నీళ్లు సరిగ్గా రావడం లేదు. కొత్తకొత్త బోర్లు రైతులు వేసుకోవాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఇవి ఎన్నికల నాటికి పెరిగితే కాంగ్రెస్‌కు నష్టం జరిగే అవకాశం వుంది. అయితే ఆ ఓటు బిజేపికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం బిఆర్‌ఎస్‌ మీద వుంది. బిఆర్‌ఎస్‌ బలంగా వుందన్న సంకేతాలు పార్టీ పంపాల్సిన అవసరం లేదు. ప్రజల్లో నిజంగానే బిఆర్‌ఎస్‌ బలంగా వుంది. కాని పార్టీ అధిష్టానమే డైలమాలో వుంది. గెలుస్తామా? లేదా? అన్న సంశయం పార్టీ పెద్దల్లోనే కనిపిస్తోంది. ఆ కలవరం బిజేపికి అనుకూలంగా మారే ప్రమాదం వుంది. అందువల్ల గోడ మీద వున్నట్లు అనిపిస్తున్న నాయకులను పక్కన పెట్టండి. వెళ్లే వాళ్లను వెళ్లనీయండి. పార్టీకి పెట్టని గోడలాంటి ద్వితీయ స్ధాయి నాయకత్వం ఎంతో బలంగా వుంది. వారిని ప్రోత్సహించండి. అప్పుడు పార్టీ మరింత బలపడుతుందే కాని, బలహినపడదు. గోడమీద పిల్లుల లాంటి నాయకులను ఇంత కాలం ప్రోత్సహించి, పార్టీకి కొమ్మలు లేకుండా చేసుకున్నారు. ఇప్పటికైనా అసలు కొమ్ములను కాపాడుకోండి.
గత ఎన్నికలలో కాంగ్రెస్‌ అనుసరించిన ఫార్ములాను ఇప్పుడు బిఆర్‌ఎస్‌ అనుసరిస్తే కారుకు తిరుగే వుండదు. పదేళ్ల పాటు అధికారంలో లేకపోయినా కాంగ్రెస్‌ పార్టీ ఎవరి పొత్తుల కోసం ఆరాటపడలేదు. వెంపర్లాడలేదు. ఒంటరి పోరుకే సై అన్నది.

వామపక్షాల మద్దతు తీసుకున్నా, ఒకే ఒక సీటు ఇచ్చింది. అంటే గెలుస్తామన్న నమ్మకం వారిలో బలంగా పెంచుకున్నది కూడా పార్టీయే. అందుకు నాయకుడు ధైర్యంగా వుండాలి. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. హుజూరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలవడని తెలిసినా బల్మూరు వెంకట్‌ను ఎన్నికల్లో నిలిపారు. అదీ నాయకుడి ధైర్యమంటే..ఇప్పుడు బిఆర్‌ఎస్‌ అనుసరించాల్సిన ఫార్ములా ఇదే..ఎక్కడ తమకు సీట్లు తక్కువ వస్తాయో అన్న అనుమానం వుంటే, పార్టీ శ్రేణుల్లో కూడా నిస్తేజం ఆవహిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరికన్నా ముందు అభ్యర్థులను ప్రకటించి తప్పు చేశారు. ఇప్పుడు ఆలస్యం చేసి తప్పు చేస్తున్నారు. కాలం గడిచే కొద్ది నాయకుల్లో ఆలోచనలు పెరుగుతున్నాయి. సోషల్‌ మీడియా ప్రభావం మూలంగా కాంగ్రెస్‌ బలంగా కనిపిస్తున్నట్లు వార్తలు కనిపిస్తున్నాయి. కాని ప్రజల్లో మాత్రం కాంగ్రెస్‌కు అంత ఆదరణ లేదనే చెప్పాలి. కాళేశ్వరం మీద కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టి, నీళ్లు లేని పరిస్ధితులను వివరిస్తే ప్రజలు బిఆర్‌ఎస్‌ను ఆదరిస్తారని చెప్పడంలో సందేహంలేదు. లేకుంటే కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలే నిజమని నమ్మే పరిస్ధితి మరింత పెరుగుతుంది.
రాష్ట్రంలో బిఎస్పీని ప్రోత్సహించడం అంటే బహుజనులకు చేరువ కావడం. .అదే బిఆర్‌ఎస్‌ పార్టీలో వున్న బహుజనులకు ప్రాదాన్యత కల్పిస్తే మేలు. ఇతర పార్టీల నాయకులను నెత్తిన పెట్టుకోవడం ఇకనైనా మానుకోవాలి. నిజానికి అవకాశ వాదులను పార్టీ ఎంపిక చేస్తే, ఒక వేళ గెలిచినా వుంటారన్న నమ్మకం లేదు. అదే బగుడు నేతలకు, ద్వితీయ శ్రేణులకు అవకాశం కల్పిస్తే వాళ్లు పార్టీకి పెట్టని గోడలా నిలుస్తారు. పార్టీని కాపాడుకుంటారు. ఇప్పటికైనా బిఆర్‌ఎస్‌ అంటే బడుగులకు పెద్ద పీట వేస్తుందన్న నమ్మకం మరింత పెగాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అన్న పేరుండేది. ఆ పార్ములానే ఇప్పటికీ ఆ పార్టీకి ఆదరణ వుంది. ఆంధ్రప్రదేశ్‌లో బలంగా వుంది. తెలంగాణలో కూడ ఇంత కాలమైనా దాని ఉనికి అంతో ఇంతో వుంది. ఏ పార్టీనైతే బడుగులు ఓన్‌ చేసుకుంటారో ఆ పార్టీకి ఎంత కాలమైనా ఉనికి వుంటుంది. కాంగ్రెస్‌ పార్టీలో ఎంత రెడ్డి ఆధిపత్యం వున్నా, ఎస్సీ, ఎస్టీలకు మేలు చేసేది కాంగ్రెస్సే అని బలంగా నమ్ముతారు.
తెలంగాణలో బిఆర్‌ఎస్‌ అదికారంలో వున్నంత కాలం బడుగులకు అనేక సంక్షేమ పధకాలు అమలు చేసింది. దానిని నిలుపుకోవాల్సిన అవరసం వుంది. దానిని విసృతంగా ప్రచారం చేసుకోవాలి. కాకపోతే బడుగుల నేతలకు మరింత ప్రాధాన్యం కల్పించాలి. పార్టీవేదికల మీద ప్రతపక్షంలో వున్నప్పుడైనా ప్రాధాన్యత పెంచాలి. పార్లమెంటు ఎన్నికల్లో వారికి టిక్కెట్లు ఇవ్వండి. జనామోదం పొందండి. మెజార్టీ సీట్లు గెల్చుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *