చివరి రక్తపు బొట్టు వరకు ……ప్రజాక్షేత్రంలోనే ఉంటా.

#రాష్ట్రంలోనే అత్యధిక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా.

#మండు వేసవిలో కూడా చెరువులను మత్తల్లు పోయించిన ఘనత కేసిఆర్ కే దక్కుతుంది.

#50 శాతం ఇన్పుట్ సబ్సిడీ తీసుకువచ్చి రైతాంగాన్ని ఆదుకున్న.

#బోగస్ హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కింది.

#తాజా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి: అమలు కాని హామీలను ఎరచూపి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని తాజా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం మండలంలో పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం ఆయా గ్రామాలలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్ తో అండగా నిలబడి ఆదుకున్న ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని అన్నారు గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక బోగస్ హామీలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని అన్నారు గత ప్రభుత్వ హయాంలో మండు వేసవిలో సైతం చెరువులన్నీ నిండుకుండలా ఉండి మత్తల్లు పోయించిన ఘనత కెసిఆర్ కె దక్కుతుంది కానీ ఇప్పుడు రాష్ట్రంలో నీళ్ల కోసం గొంతెండే పరిస్థితి రావడానికి కారణం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం ఒకప్పుడు పంటల కోసం కాలం కాకపోతే రైతులు మేఘాల వైపు చూసే వాళ్ళు కానీ ఇప్పుడు రైతులు కెసిఆర్ వైపు చూస్తున్నారు గత ఏడాది వడగళ్ల వానల వల్ల పంట నష్టపోయిన రైతులకు పదివేల రూపాయలు నష్టపరిహారం అందించి ఆదుకున్నామని ఇప్పుడున్న ప్రభుత్వం మొన్నటికి మొన్న అకాల వర్షాలు వచ్చి రైతులు నష్టపోతే కనీసం పంటలను పరిశీలించిన పాపాన పోలేదు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనటువంటి 50% ఇన్పుట్ సబ్సిడీ తో రైతుల కోసం వ్యవసాయ యాంత్రికరణ పథకాన్ని తీసుకువచ్చి నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతు లబ్ధి పొందే విధంగా కృషి చేశానని అలాగే మండల మిర్చి రైతుల కోసం కన్నారావుపేటలో రాష్ట్రస్థాయి మిర్చి పరిశోధన కేంద్రాన్ని తీసుకువచ్చి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది నేను ప్రజల కోసం ఇంత కష్టపడి చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తే ప్రజలు నన్ను పక్కన పెట్టి ఇంత నష్టపరుస్తారని కలలో కూడా అనుకోలేదు గత ఎనిమిది సంవత్సరాల ఉపాధి హామీ పనులకు ఎన్నడూ రానంత కూలీలు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రైతులను కూలీలుగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు మేలు జరుగుతుందని పదేపదే చెప్పినా కూడా పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మద్దతు ధరపై 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వడం లేదు ఉపాధి హామీ కూలీలకు 15000 , కౌలు రైతులకు 12000 , రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేస్తామన్నారు కానీఇప్పటివరకు అమలు చేయలేదు మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని చిద్రం చేసి తద్వారా రైతులందరినీ కూలీలుగా మార్చింది నమ్మిన రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలి నేను ప్రజల మనిషిని ప్రజా క్షేత్రంలో ఓడిన ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసమే పోరాడే వ్యక్తిని కాబట్టి ప్రజలు గతంలో చేసిన తప్పును మళ్లీ చేయకుండా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మాలోత్ కవిత కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్లీ బిఆర్ఎస్ పార్టీ పునర్ వైభవాన్ని తీసుకువచ్చే విధంగా పార్టీ కార్యకర్తలు ప్రజలు కృషి చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, పిఎసిఎస్ చైర్మన్ మురళీధర్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్,నాయకులు గందే శ్రీనివాస్ గుప్తా, సమ్మయ్య నాయక్, శివాజీ, మామిండ్ల మోహన్ రెడ్డి, ప్రతాప్ సింగ్, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *