దొరికింది దొంగ!

https://epaper.netidhatri.com/

మూడేళ్ళ నేటిధాత్రి అక్షర పోరాటానికి తార్కానం.

తస్లిమా పాపం పండింది.

సామాన్యల ఉసురు తగిలింది.

అక్రమార్జనకు బ్రేక్‌ పడిరది.

నేటిధాత్రి అక్షర యజ్ఞం ఇంకా వుంది.

నేటిధాత్రి చెప్పిందే నిజమైంది.

తస్లిమా ప్రచారాలే చూశారు.

సామాజిక సేవ నటనలు అందరూ నమ్మారు.

ఆమె అవినీతి ఎవరికీ తెలియదు.

తస్లిమా నటనంతా నిజం కాదు.

సామాజిక సేవ పూర్తి వాస్తవం కాదు.

ట్రస్ట్‌ పేరుతో సేవలు…రిజిస్ట్రేషన్లలో లక్షలు.

మూడేళ్ళుగా నేటిధాత్రి చెప్పింది చాలా మంది నమ్మలేదు.

నిజాలు రాసినందుకు తస్లిమా కేసుపెట్టింది.

నేటిధాత్రి మీద పగపట్టింది.

అధికారులతో కలిసి నేటిధాత్రి మీద కుట్రలు చేసింది.

అనుచరుల చేత కాపు కాసింది.

ప్రైవేటు సైన్యం నడుపి జనాన్ని పీల్చుకుతిన్నది.

మొగుళ్ల భద్రయ్యపై దాడి చేయించింది.

నేటిధాత్రి వార్తలు నిందలన్నది.

తస్లిమా అసలు రూపం నేటిధాత్రి మాత్రమే చెప్పింది.

తట్టుకోలేక పరువు నష్టం దావా వేసింది.

పోలీసు కేసులతో వేధించాలని చూసింది.

మారే ప్రయత్నం చేయలేదు..నిజమైన సేవ ఏనాడు చేసింది లేదు.

ఏసిబికి చిక్కితేగాని అసలు రంగు బైడపడలేదు.

సాంప్రదాయినీ..సుప్పినీ..సుద్దపూసనీ..అని ఇటీవల ఓ పాట బాగా పాపులర్‌ అయ్యింది. ఆ పాట సరిగ్గా ఏసిబికి అడ్డంగా దొరికిన మహబూబాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లిమాకు సరిపోతుంది. అరెరె..ఆమె అపూర్వమైన ఆస్కార్‌ నటనను చూసి ఎంతో మంది మోసపోయారు. సేవ చేస్తున్నట్లు మూటలు నెత్తిన పెట్టుకుంటే, దోచుకున్న మూటలు కాపాడుకునేందుకని ఊహించలేదు. ఎంతోమంది తస్లిమా గొప్పది లేదని కీర్తించారు. అందరి నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆమె పెద్దఎత్తున లంచం తీసుకుంటూ, నేటిదాత్రి గత మూడేళ్లుగా చెబతున్నదే నిజమని ఆమే నిరూపించింది. తనకు తానే లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయింది. డాక్యుమెంటు రైటర్లను వేధించుకుంటూ ఏసిబి వలలో చిక్కింది. తస్లిమా అసలు రూపం ఇదే నేటిధాత్రి గత మూడు సంవత్సరాలుగా నెత్తినోరు, కొట్టుకొని మరీ చెబుతోంది. ఒకటా రెండా..అనేక వరస కథనాలు రాసింది. అయినా చాల మంది నమ్మలేదు. ఆమె నటనను చూసి నిజమని నమ్మారు..నేటిధాత్రి గురించి తెలిసిన వారు మాత్రం నిజమని నమ్మారు. బాదితులు అనేక మంది నాడే నేటిధాత్రిని ఆశ్రయించేవారు. ప్రజలను పూడిరచుకొని తింటున్న తిమింగలాన్ని పట్టుకోండి! అని ఎంత రాసినా గత ప్రభుత్వంలో పట్టించుకున్నవారు లేరు. కాని పాపం పండే కాలం రావాలి కదా! అది ఇప్పుడు వచ్చింది. నేటిధాత్రికి చెప్పిందే నూటికి నూరుపైసలు నిజమైంది. ఏసిబికి అడ్డంగా తస్లిమా చిక్కితే గాని నమ్మలేకపోయారు. తినే వేళ్లకు అంటుకున్న నాలుగు మెతులకు విలిలిస్తూ, సముద్రమంత ప్రచారం చేసుకుంటూ, కోట్లకు కోట్లు వెనకేసుకున్న తస్లిమా అసలు బండారం ఇప్పుడు బైటపడిరది. పైకి అమాయకంగా కనిపించేవారంతా సుద్దపూసలు కాదు. సమాజ సేవ చేస్తున్నట్లు ప్రచారం చేసుకునేవారంతా గొప్పవాళ్లు కాదు. నిజమైన సామాజిక సేవకులు ప్రచార ఆర్భాటంకోసం ఆరాటపడరు. గుప్తదానాలు ఎవరూ చెప్పుకోరు. కాని ప్రచారం కోసం ఆరాటపడుతున్నారంటే దాని వెనకాల ఏదో నిగూడ రహస్యం దాగి వున్నట్లే..ఇక్కడ తస్లిమా విషయంలో కొండంత అవినీతి చేస్తుంది. గోరంత సాయాలు చూపిస్తూ, ప్రపంచమంతా ప్రచారం చేసుకోవడంలో ఆరితేరిపోయింది. అందుకే ఆమెను ప్రజలు కూడ నమ్ముతూ వచ్చారు. కాని ఆమె అసలు స్వరూపం, రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వచ్చిన వారికి మాత్రం తెలుసు. ఏకాన సాయం చేస్తున్నట్లు నటిస్తూ, దొవ్వాణ సంపాదనకు ఎగబడిరది. అడ్డంగా అడ్డగోలుగా సంపాదించింది. అవకాశం వస్తే రాజకీయాల్లో చేరాలని కూడా ప్రయత్నం చేసింది. ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే ఎన్ని వందల కోట్లైనా ఖర్చు చేసేందుకు సిద్దపడిపడిరది. కాని అవకాశం రాలేదు. టికెట్ల పంపకాల్లో సీట్లు కుదరలేదు. ఒక సబ్‌ రిజిస్ట్రార్‌గా ఉద్యోగం చేసే తస్లిమా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎంత ఖర్చయినా సిద్దం అన్నదంటే ఎంత సంపాదించిందో ప్రజల ఊహలకే వదిలేస్తున్నాం..

ఎట్టకేలకు ఒక అవినీతి తిమింగలం పట్టుబడిరది. ప్రజలను పీడిరచుకుతిన్న అవినీతి దోపిడీ దారు ఏసిబికి పట్టుబడిరది. దొంగే , దొంగ అన్నట్లు ఆమె చేస్తున్న అక్రమాలపై వార్తలు రాసిన నేటిధాత్రిపై కక్షకట్టింది. నేటిధాత్రిని వదిలిపెట్టనంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడిరది. ఓ వైపు పెద్దఎత్తున అవినీతి చేస్తూ, వాటిపై వార్తలు రాస్తున్న నేటిధాత్రిపై కేసులు నమోదు చేసింది. అందులో భాగంగా అనేక నోటీసులిచ్చింది. రూ.50లక్షలు పరువు నష్టం దావా వేసింది. రెండు లక్షలు చెల్లించి మరీ నేటిధాత్రిపై కేసు నమోదు చేసింది. ఒక సబ్‌ రిజిస్ట్రార్‌ పై అధికారులకు తెలియకుండా, ఎవరి మీద దావా వేయకూడదు. అయినా వేసింది. ఇలా చట్టాలను అతిక్రమించింది. అవినీతికి తెగబడిరది. అన్యాయాలను సాగించింది. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నది. డ్యూటీ వదిలేసి, పని దినాలలో కూడా తన రాచకార్యాలు వెలగబెట్టేందుకు వెళ్తుంది. సన్మానాలు, సత్కారాల కోసం ఆరాటపడుతుంది. ప్రైవేటు సైన్యం రిజిస్ట్రేషన్‌ కార్యాయలంలో పనులకు పురమాయిస్తుంది. చివరికి లాగిన్‌ ఐడి కూడా తన బినామీలకు అప్పగించి, అక్రమాలకు తెగబడిరది. ప్రభుత్వాన్ని కూడా మోసం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు. రెండు కాదు లెక్కలేనన్ని తప్పులు చేసింది. ఎంతో మందిని వేధించింది. వారి నుంచి తన నోటి నుంచి ఎంత వస్తే అంత వసూలు చేసింది. అవినీతి సంపాదనలో ఆరితేరిపోయింది. ఈ విషయాలపై నేటిదాత్రి గత ఐదేళ్లుగా అక్షర పోరాటం సాగిస్తూనే వుంది. ఇంత కాలానికి ఆమె పాపం పండే సమయం వచ్చింది. ములుగులో సాగించినట్లు అడ్డగోలు సంపాదన మహబూబాబాద్‌లో కూడా మొదలుపెట్టింది. కాని కథ అడ్డం తిరిగింది. ములుగులో పదమూడు సంవత్సరాల కాలం పాటు ఎలాంటి ట్రాన్స్‌ఫర్‌ లేకుండా పాతుకుపోయింది. ఆమెపై ఎన్ని కథనాలు రాసినా, పై అధికారులు కూడా ఆమె పంపే వాటాలకు అలవాటు పడ్డారు. ఆమెను కదిలించలేదు. నాయకులను కూడా తన గుప్పిట్లో పెట్టుకొని అక్కడి నుంచి కదల్లేదు. అయినా నేటిధాత్రి వదల్లేదు. ఆమె ట్రాన్స్‌ఫర్‌ అయ్యే వరకు అక్షర పోరు సాగించింది. ఇక తప్పని పరిస్ధితుల్లో ఆమెను ములుగు నుంచి తప్పించారు. మహబూబాబాద్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అప్పటికే ములుగులో కూడా ఆమె పేరు పూర్తిగా చెడిపోయింది. ప్రజలందరికీ ఆమె అసలు స్వరూపం తెలిసిపోయింది. ఆమె సామాజిక చేతల్లో కనిపిస్తున్న సేవ అంతా ట్రాష్‌ అని తేలింది. అదంతా సామాన్యులను పీడిరచి సొమ్మే అని అందరూ గ్రహంచారు. అడ్డగోలు సంపాదనలో నయాపైస పంచుతూ, రూపాయి పంచినంత కలరింగ్‌ ఇచ్చుకోవడాన్ని ప్రజలు కూడా అసహ్యించుకున్నారు. దాంతో ఇక ములుగులో తన ఆటల సాగేలా లేవని గ్రహించి, మహబూబాబాద్‌కు మకాం మార్చుకున్నది. అక్కడ మళ్లీ తన ఆస్కార్‌ నటనకు శ్రీకారం చుట్టింది. అయినా ఆమె అసలు రంగు అక్కడి ప్రజలు తొందరగానే తెలుసుకున్నారు. పైకి చేసుకునే ప్రచారానికి, ఆమె ప్రవర్తించే విధానానానికి ఎక్కడా పొంతన కుదరడం లేదని ప్రజలు తెలుసుకున్నారు. సోషల్‌ మీడియాలో ఆమె నటనలు చూసిన, ప్రజలు కార్యాలయంలోకి వెళ్లే ఆమె చూపించే నటనలకు పోలిక లేదని తెలుసుకున్నారు. ములుగు ప్రజల్లా కాకుండా మహబూబాబాద్‌ ప్రజలు, డాక్యుమెంటు రైటర్లు తొందరగా తేరుకున్నారు. తస్లిమా వేధింపులు భరించలేక ఏసిబికి పట్టించారు.

ఒక్క మాటలో చెప్పాలంటే నేటిధాత్రి అసలు పని ఇప్పుడే మొదలైందనుకుంటున్నాం. ఇంత కాలం ఆమె చేసిన అక్రమాలు, అవినీతి కార్యకలాపాలపై అనేక కథనాలు వెలుగులోకి తెచ్చిన నేటిధాత్రి బాధితుల పక్షాన మరో పోరాటం మొదలుపెడుతుంది. తస్లిమామూలంగా నష్టపోయిన బాధితుల పక్షాన నిలబడి అక్షర పోరు సాగిస్తుంది. ఇప్పటికే అనేక మంది బాదితుల ఇబ్బందులు వెలుగులోకి తెచ్చిన నేటిధాత్రి వారికి న్యాయం జరిగేవరకు కూడా తన అక్షర యజ్ఞం ఆపదు. తెలంగాణ ప్రజలు తస్లిమా ప్రచారాలే ఇంత కాలం చూశారు. ఆమె చేసిన అవినీతి బాగోతాలు మళ్లీ పాఠకుల కోసం నేటిధాత్రి అందిస్తుంది. బాధితులకు పూర్తి స్ధాయిలో న్యాయం జరిగేవరకు వారికి అండగా వుంటుంది. ఆమె వల్ల నష్టపోయిన వారి జీవితాలు మళ్లీ నిలబడేంత వరకు నేటిధ్రాత్రి అలుపెరగని కృషి చేస్తుంది. తస్లిమా చూపించిన ఆస్కార్‌ నటనను నమ్మిన వారు చాలా మందికి ఆమె అసలు స్వరూపం తెలియక ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే తస్లిమా చేసిన సామాజిక సేవ అన్నది ఒక బూటకం. అంతా అవాస్తం. కుండలు పెట్టి బిందెలు ఎత్తుకుపోయింది. సామాజిక సేవ చేస్తున్నట్లు నటించి, రిజిస్ట్రేషన్లలో అవకతవకలు చేసి ఎంతో సంపాదించింది. అందులో నుంచి ఆమె రూపాయి ఖర్చు చేయలేదు. కాని ఆమె సామాజిక సేవను పెద్ద పెద్ద వారికి చూపించి, వారి నుంచి కూడా పెద్దఎత్తున విరాళాలు కూడా సేకరించినట్లు కూడా సమాచారం అందుతోంది. ఆ సొమ్ములో కూడి పది పైసలు ఖర్చు చేయలేదని సమాచారం.
తస్లిమా తన తండ్రి పేరు మీద ఓ ట్రస్టు ఏర్పాటు చేసి, పెద్దఎత్తున విరాళాలను సేకరించిందనేది ఆమె అనుచరులు అంటున్న మాట. తస్లిమా ఓ వైపు అవినీతి కార్యకలాపాలు నిర్వహిస్తూ, మరో వైపు విరాళాల సేకరణ చేపడుతోందని నేటిధాత్రి చెప్పింది. ఇక ములుగు ప్రాంతంలో పెద్దఎత్తున భూముల సర్వే నెంబర్లను గోల్‌ మాల్‌ చేసి, కొన్ని వందల ఎకరాలు అటవీ భూములను ఇతరులకు, తన బినామీల పేరు మీద రాసినట్లు కూడా పెద్దఎత్తున ఆరోపణలున్నాయి. ఇలాంటి విషయాలను అనేకం వెలుగులోకి తెచ్చిన నేటిధాత్రి మీద తస్లిమా కన్నెర్ర చేసింది. పోలీసుల సహకారంతో కేసులు నమోదు చేసింది. అయినా నేటిధాత్రి బెదిపోకపోవడంతో, దాడులు చేయాలని కూడా కుట్రలు పన్నింది. దారి కాచి భౌతిక దాడులకు దిగేందుకు స్కెచ్‌ వేసింది. కాని ఆమె కుట్రలు ఫలించలేదు. కాకపోతే ములుగులో ఆమె చేస్తున్న అక్రమాలపై న్యాయ పోరాటం చేసే మొగుళ్లు భద్రయ్య అనే వ్యక్తిపై దాడి కత్తులతో దాడి చేయిచేయించింది. తస్లిమా ప్రైవేటు సైన్యం అతన్ని చంపేందుకు వెంటాడారు. ఆయన తృటిలో తప్పించుకున్నారు. మొగళ్ల భద్రయ్యను వారి గ్రామస్థులు కాపాడకపోతే, అతను చనిపోయేవాడు. అలా కత్తులతో దాడి చేశారు. ఒంటి మీద వున్న కత్తుల గాయాలతో మొగుళ్ల భద్రయ్య పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే అక్కడా ఆయనకు అన్యాయమే జరిగింది. తస్లిమాపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైగా మొగుళ్ల భద్రయ్యపైనే కేసు నమోదు చేసి, ఆయనను జైలు పాలు చేశారు. ఇలా వ్యవస్ధలను గుప్పిట్లో పెట్టుకొని ఆమె అక్రమాలపై పోరాటం చేసిన వారెందరినో ఆమె వేధించింది.
నేటిధాత్రికి సహకరిస్తున్నారని తెలిసిన వాళ్లందరిపై ఆమె దాడులు చేసేందుకు వెనుకాడలేదు. ఆఖరుకు నేటిధాత్రి మీదనే పగ పట్టింది. కేసులు నమోదు చేయించింది. ఒక దశలో తస్లిమా మీద ఎలాంటి వార్తలు రాయొద్దని స్టే కూడా తెచ్చుకున్నది. అంటే ఆమె తన అక్రమాల కొనసాగింపుకోసం న్యాయ వ్యవస్ధను కూడా తప్పుదోవ పట్టించింది. ఇప్పుడు ఏం సమాదానం చెబుతుంది. ఆమె చేసిన అక్రమాలపై మరింత లోతైన విచారణ జరగాల్సిన అవసరం వుంది. ఆమె అక్రమంగా సంపాదించిన సొమ్ముంతా రికవరీ చేయాల్సిన అవసరం వుంది. ఆమె వల్ల నష్టపోయిన బాధితులకు న్యాయం జరగాల్సి వుంది. ఆమె అన్యాక్రాంతం చేసిన అటవీ, ప్రభుత్వ భూములను తిరిగి ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాల్సిన అవసరం వుంది. ఆమె చేసిన అరాచకాలు, దుర్మార్గాలపై విజిలెన్స్‌ ఎంక్వైరీ చేయిస్తే అసలు గట్టంతా బైటకు వస్తుంది. ప్రజలు, ప్రజా సంఘాలు కూడా తస్లిమా చేసిన అక్రమాలపై అనేక వివరాలు అందిస్తారు.
తస్లిమా…అరెస్టు ఒక రకంగా చెప్పాలంటే నేటిధాత్రి అక్షర విజయం. నేటిధాత్రి చేసిన అక్షర పోరాటానికి నిదర్శనం. ఆమె చేస్తున్న అక్రమాలపై నిఘా ఏర్పాటుచేసి, పరిశోధన జర్నలిజాన్ని కొనసాగించడానికి నేటిధాత్రి అనేక అవస్ధలు ఎదుర్కొవాల్సివచ్చింది. తస్లిమా వేసిన కేసులపై న్యాయం పోరాటం చేయడానికి ఆర్ధికంగా ఎంతో ఖర్చు నష్టపోవాల్సివచ్చింది. ఆర్ధికంగా చితిపోయే పరిస్ధితి వచ్చినా అక్షర పోరాటంలో వెనుకడుగు వేయలేదు. ఒక దొంగను దొంగా అని నిరూపించడానికి కూడా ఈ కాలంలో కూడా మీడియా కూడా ఇంత కష్టపడాల్సిన రావడం బాధాకరం. ఒకప్పుడు తప్పు చేస్తే మీడియా కంటపడతామన్న భయంవుండేది. కాని ఇప్పుడు కొందరు తస్లిమా లాంటి అధికారులు విచ్చలవిడి ధన దాహనికి అలవాటు పడుతున్నారు. అధికార దుర్వినియోగానికి, అవినీతి సంపాదనకు మీడియా తగులుతుందని కేసులు పెట్టేదాకా వెళ్తున్నారంటే వారి పైత్యం ఎంతదూరం వెళ్లిందో అర్దం చేసుకోవచ్చు. అయినా ఐదేళ్లుగా తస్లిమా మీద పుంఖాను పుంఖాలుగా వార్తలు రాస్తున్నా గత ప్రభుత్వం స్పందించలేదు. తస్లిమాపై చర్యలకు పూనుకోలేదు. కనీసం ఏం జరగుతుందో అని తెలుసుకునే ప్రయత్నం కూడ చేయలేదు. ఒక మహిళా అధికారి మీద ఇంత పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయన్నదానిని కూడా తెలుసుకునే ప్రయత్నంచేయలేదు. ములుగులో ప్రజా సంఘాలు, మీడియా సంస్ధలు ఎందుకు స్పందిస్తున్నాయన్నది పట్టలేదు. కారణం ఆనాడు రాజకీయంగా ఆమెకు సహకారం లభించింది. అందుకే వ్యవస్ధలను ఆమె గుప్పిట్లో పెట్టుకున్నది. ఆడిరది ఆట, పాడిరది పాటగా ప్రజలను వేదించింది. అంతులేని సంపద పోగేసుకున్నది. ఏసిబికి చిక్కితే గాని ఆమె అసలు రంగు బైటపడలేదు. ఏసిబి పట్టుకునేందుకు ఉపయోగించే పింక్‌ రంగు ఆమె చేతులకు అంటుకుంటే గాని ఆమె అవినీతి రంగు వెలుగులోకి రాలేదు. తప్పు చేసినవారికెప్పుడైనా శిక్ష తప్పదు. ముందో,వెనకో పాపం పండుతుంది. కాకపోతే ఎన్ని ఇబ్బందులు ఎదరైనా సరే…అవినీతి పరులను పట్టించాలనే పట్టుదలతో అక్షర ప్రయాణం చేసే నేటిదాత్రిలా కలం కదిలిస్తే, అక్షరం విదిలిస్తే తస్లిమా లాంటి వాళ్లను అక్రమాలు వెలుగులోకి తేవడం కష్టం కాదు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *