కొమ్మాల లక్ష్మీనరసింహుడి ఆదాయం 21. 22 లక్షలు…

కొమ్మాల లక్ష్మీనరసింహుడి ఆదాయం 21. 22 లక్షలు

13 హుండీల ఆదాయం 13.39 లక్షలు, వివిధ టికెట్లకు రూ. 7 లక్షల 82 వేల ఆదాయం

సీసీ కెమెరాలు పర్యవేక్షణతో 13 హుండీల లెక్కింపు..

శ్రీరామ నవమి పండుగ వరకు జాతర కొనసాగింపు..ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి

నర్సంపేట,గీసుకొండ,నేటిధాత్రి:

 

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆదాయం 21 లక్షల 22 వేల 410 రూపాయల ఆదాయం వచ్చింది.వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం జాతర హుండీల లెక్కింపు ఎండోమెంట్ జిల్లా శాఖ, దేవస్థానం ఈ.వో ప్రసాద్,కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి,దేవాలయ శాశ్వత ధర్మకర్త శ్రీనివాసచార్యులు, కమిటి సభ్యులు,అర్చకులు రామాచార్యులు ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టారు.జనవరి 3 వ తేదీ నుండి జాతర బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మార్చి 11 వరకు హుండీలలో భక్తులు వేసిన కానుకలను లెక్కింపు చేశారు. దేవస్థానంలోని 13 హుండీలలో గల కానుకలను 18 బ్యాగులలో ప్యాక్ చేసిన అనంతరం దేవస్థానం పరిధిలోని కళ్యాణ మండపంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో కానుకలను లెక్కించగా శ్రీ రాజరాజేశ్వరి సేవాసమితి ఆధ్వర్యంలో 120 మంది మహిళా సేవకులు కుండీల లెక్కింపులో పాల్గొన్నారు.

అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన అభక్తులు శ్రీఘ దర్శనం,ప్రత్యేక దర్శనం, కేశవకండనము, జాతరలో అష్టోత్తరము వివిధ టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయం లెక్కింపు చేశారు.ఈ సందర్భంగా దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసాద్ మాట్లాడుతూ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా జనవరి 3 నుండి మార్చి 11 వరకు దేవస్థానం హుండీలలో భక్తులు వేసిన కానుకలను లెక్కించామని అన్నారు.2 నెలల 8 రోజుల పాటు హుండీలల్లో వచ్చిన ఆదాయం రూ.13 లక్షల 39 వేల 701 రూపాయలను,అలాగే శ్రీఘ దర్శనం,ప్రత్యేక దర్శనం, కేశవకండనము, జాతరలో అష్టోత్తరము వివిధ టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయం 7 లక్షల 82 వేల 700 రూపాయలు మొత్తం 21 లక్షల 22 వేల 410 రూపాయల ఆదాయం దేవస్థానం బ్యాంకు అకౌంట్లో జమ చేస్తున్నట్లు తెలిపారు.ఉత్సవ కమిటీలో చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయానికి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయాన్ని బ్యాంకు ఖాతా లో జమ చేస్తామని అన్నారు. జాతర బ్రహ్మోత్సవాల నేతంలో చంద్రగ్రహణం ప్రభావంతో మొదటగా భక్తులు తక్కువగా ఉన్నప్పటికీ రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతున్నదని తెలిపారు. ఈ జాతర శ్రీరామనవమి వరకు కొనసాగనున్నట్లు దీనితో దేవస్థానానికి మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉన్నదని చైర్మన్ రవీందర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎండోమెంట్ శాఖ ఇన్స్పెక్టర్ డి.అనిల్ కుమార్,ఉత్సవ కమిటి సభ్యులు అజ్మీర సమ్మయ్య, కందారి సంతోష్, హలావత్ వీరన్న, మంద రమేష్, బధావత్ రమేష్, ఊరుగొండ రాజు, లాడే రాజేశ్వర్ రావు, గోనెల మల్లేష్, మండల నరేష్,మార్తాల రాజు, దుకిరే వినయ్, మామూనూరి వనిత, నాగిరెడ్డి నాగన్న,కొమ్మాల సర్పంచ్ కన్నేబోయిన జమున ప్రవీణ్, దేవాలయ ప్రధాన అర్చకులు విష్ణు,జూనియర్ అసిస్టెంట్ కనకయ్య, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version