ఐనవోలు జాతర సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి సురేఖ,ఎమ్మెల్యే నాగరాజు
హన్మకొండ, నేటిధాత్రి:
ఐనవోలు హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్నేహ శభరీష్ అధ్యక్షతన జనవరి నెల 13వ తేదీ నుంచి జరగబోయే ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన జాతర సమీక్ష సమావేశంలో అటవీ–పర్యావరణ–దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రివర్యులు కొండ సురేఖతో కలిసి పాల్గొని జాతరలో పటిష్ట ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు…
అనంతరం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గోడ పత్రికను మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా కలెక్టర్, కమిషనర్, అధికారులతో కలిసి ఆవిష్కరించారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ
ఐనవోలు మండలం పరిధిలోని వివిధ గ్రామాల నుంచి స్వామివారి ఊరేగింపుకు వచ్చే డీజేలను 20–30 సంఖ్యకు పరిమితం చేస్తూ కట్టడి చేయాలి.
మహిళలు బట్టలు మార్చుకునేందుకు శాశ్వతంగా బాత్రూమ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలి.
ఆలయ పరిసర ప్రాంతాల్లో హైమాస్ట్ (ఐమాక్స్) లైట్లు మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
జాతర సమయంలో నిర్వహించే షాపుల్లో రాత్రి వేళ ఎవరు నిద్రించకుండా చర్యలు తీసుకోవాలి.
దుకాణదారులు వారికి కేటాయించిన స్థల పరిమితిలోనే వస్తువులు పెట్టేలా కట్టడి చేసి, ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలి.
ఆలయంలో క్యూఆర్ కోడ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
ఐనవోలు పరిసర ప్రాంతాల్లో అనుసంధానమయ్యే రోడ్లపై మలుపుల వద్ద సైన్ బోర్డులు, ప్రికాషన్ బోర్డులు ఏర్పాటు చేయాలి.
రోడ్డు ఇరువైపులా ఉన్న ప్రమాదకరమైన చెట్లను తొలగించాలి.
జాతరకు వచ్చే మార్గాల్లో ఉన్న బావులు, మలుపుల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
ఐనవోలు గ్రామ చెరువు చుట్టూ పూర్తి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి.
ఐనవోలు ఆలయం నుంచి పున్నెల్ క్రాస్ రోడ్డు వరకు వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలి.
ఐనవోలు ఆలయ ప్రవేశ ద్వారం మరియు బయటకు వెళ్ళే మార్గాల వద్ద హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి.
జాతర జరిగే పరిసర ప్రాంతాల్లో డీజేలు పూర్తిగా నిషేధిస్తూ కట్టడి చేయాలి.
జాతర సమయంలో తాగునీటి కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలి.
అన్నదానం సమయంలో భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలి.
జాతర పరిసర ప్రాంతాల్లో గుడుంబా, లిక్కర్, గాంజా వంటి మత్తు పదార్థాలు రాకుండా ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలి.
పోలీస్ శాఖ వారు సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టి, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలి.
వీఐపీ దర్శనం చేసుకోవాలనే భక్తులు 500 రూ ప్రత్యేక దర్శన టికెట్‌తోనే దర్శనం చేసుకోవాలి దానిపై ఆలయ ఈవో పకడ్బంది చర్యలు చేపట్టాలి….
అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ఐనవోలు జాతరను విజయవంతంగా నిర్వహించాలని సూచిస్తూ, విధులను సమర్థవంతంగా నిర్వర్తించిన అధికారులకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు…
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పాయ్, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ వై.వి గణేష్, ఆర్డిఓ రమేష్ రాథోడ్, కుడపీవో అజిత్ రెడ్డి, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, కమిటీ సభ్యులు ఆలయ ఈవో సుధాకర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు అధికారులు తదితరులు పాల్గొన్నారు….
