బస్టాండ్లో బస్సు ఢీకొని ప్రయాణికుడికి తీవ్ర గాయాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో సీటు కోసం పరుగులు తీస్తున్న ఖదీర్ (35) అనే ప్రయాణికుడిని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.ఈ ఘటనలో ఖదీర్ రెండు కాళ్లు తీవ్రంగా గాయపడ్డాయి.సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది అతన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డిపో మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులు అజాగ్రత్తగా పరుగులు తీయడం ప్రమాదకరమని డిపో మేనేజర్ సూచించారు. కొందరు బస్సు డ్రైవర్ల ర్యాష్ డ్రైవింగ్ వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
