ఓదెల మోడల్ స్కూల్ రోడ్డు భద్రతా అవగాహన : ఎస్సై దీకొండ రమేష్
ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి
ఓదెల మోడల్ స్కూల్, మోడల్ జూనియర్ కాలేజీల్లో పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టం, కుటుంబాలపై పడే దుష్పరిణామాలపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. మద్యం మత్తులో వాహనం నడపడం చట్ట విరుద్ధమే కాకుండా తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా తీవ్రమైన ము స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని, మైనర్లు వాహనాలు నడపరాదని, సరైన డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారే వాహనాలు నడపాలని తెలిపారు. రాంగ్ పార్కింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి చర్యలు ప్రాణాలకే ముప్పు తెస్తాయని హెచ్చరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో రోడ్ సేఫ్టీపై ప్రతిజ్ఞ చేయించగా, నోటీస్ బోర్డుల్లో రోడ్ సేఫ్టీ పోస్టర్లు అతికించారు. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియాలో రోడ్డు భద్రతపై పోస్టర్లు షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
