పెబ్బేర్ లో రైస్ మిల్లును తనిఖీ చేసిన
అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్
వనపర్తి నేటిదాత్రి
బుధవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ వనపర్తి, పెబ్బేరు మండలాల్లో విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గోదాములను తనిఖీ చేశారు. వనపర్తి మండలంలోని నాచహళ్లి ఐకేపీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించార అదనపు కలెక్టర్ రైతులతో మాట్లాడారు. వడ్లు తాలు, పొల్లు లేకుండా శుభ్రం చేసుకుని తీసుకురావాలని రైతులకు సూచించారు.
పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామానికి వెళ్ళిన అదనపు కలెక్టర్, అక్కడ ఏఈఓ జారీ చేస్తున్న టోకెన్లను పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, సీరియల్ పద్ధతిలో వరుస క్రమంలో టోకెన్లు జారీ చేయాలని ఏఈఓను ఆదేశించారు. పెబ్బేరు మండలంలోని సూగురు గ్రామంలోని ఎస్.డబ్ల్యూ.సి గోదామును సందర్శించి,అక్కడ డెలివరీ అవుతున్న సీఎంఆర్ బియ్యం నాణ్యతను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని బియ్యం వస్తే వెంటనే తిరస్కరించాలనివాటిని సంబంధిత మిల్లుకు వెనక్కి పంపాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చివరగా పెబ్బేరు మండలంలోని సత్యసాయి ఇండస్ట్రీస్ రైస్ మిల్లును అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు.మిల్లు యజమానితో మాట్లాడి, యాసంగి 2024-25 సీజన్ కు సంబంధించిన సీఎంఆర్ డెలివరీలను ఎటువంటి జాప్యం లేకుండా, త్వరితగతిన పూర్తి చేయాలని మిల్లు యజమానిని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జగన్ పెబ్బేరు తహసీల్దార్ మురళి అధికారులు ఉన్నారు
