ఏపీకి బిల్ గేట్స్.. సీఎం చంద్రబాబు ట్వీట్
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఏపీకి రాక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వెల్కమ్ బ్యాక్ మిస్టర్ బిల్ గేట్స్ అని పోస్టు చేశారు సీఎం.
అమరావతి, ఫిబ్రవరి 16: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ (Bill Gates) అమరావతికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో, ఐటీ మంత్రి నారా లోకేశ్, పలువురు మంత్రులు.. ఆయన్ను ఘనంగా స్వాగతించారు. తర్వాత రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), ఇతర మంత్రులు బిల్ గేట్స్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (RTGS)ను బిల్ గేట్స్, ఆయన ప్రతినిధి బృందం సందర్శించింది.
ఏపీకి బిల్ గేట్స్ రాక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. బిల్ గేట్స్‌ను స్వాగిస్తూ సీఎం ట్వీట్ చేశారు. ‘వెల్కమ్ బ్యాక్ మిస్టర్ బిల్ గేట్స్’ అని సీఎం పేర్కొన్నారు. అలాగే #APWelcomesYou హ్యాష్‌ట్యాగ్‌తో ట్యాగ్ చేశారు సీఎం చంద్రబాబు. ఇక ఏపీకి బిల్ గేట్స్ రావడం ఇది మూడోసారి. మరోవైపు, సచివాలయానికి చేరుకున్న బిల్స్ గేట్స్, ఆయన ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
