యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సెన్సేషన్ – మోతె రాజిరెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
యువగళం పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో ఒక సెన్సేషన్స్ అని టిడిపి వేములవాడ కమిటీ సభ్యులు, టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు మోతె రాజిరెడ్డి అన్నారు. రాష్ట్ర ఐటి,విద్య శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చేసి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని,తెలుగుజాతిని కాపాడడానికి చేసిన పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బడుగులు, బలహీనులు, పేదలు, మహిళలు, యువకులు, రైతులు వారి కష్టాలను, కన్నీళ్లను తెలుసుకుంటూ రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడువేల ముఫ్ఫైరెండు కిలోమీటర్లు తోంభైఏడు నియోజకవర్గాలు రెండువేల తోంభైనాలుగు గ్రామాలు ఒకటిన్నర కోట్ల మంది గుండె తలుపులను తడుతూ ఆనాడు మంత్రి నారా లోకేష్ యువగళం సాగిందని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి రావడానికి యువగళం గేమ్ చెంజర్ గా పని చేసిందన్నారు.
