వనపర్తిలో ఇండోరా స్టేడియంలో పనులను తనిఖీ చేసిన కలెక్టర్
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రజల ఆరోగ్యం కోసం అందుబాటులోకి రానున్న ఇండోర్ స్టేడియాన్ని ప్రజలు సద్వినియోగించుకునేలా అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్థవంతంగా స్టేడియాన్ని ఉపయోగించుకునేలా అన్ని సదుపాయాలను కల్పించాలని కోరారు క్రీడాకారుల సౌకర్యార్థం సరైన మెయింటెనెన్స్, సీటింగ్, లైటింగ్‌తో పాటు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు ఇంజినీరింగ్, క్రీడా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. వీలైనంత త్వరగా అన్ని అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి ప్రారంభానికి సిద్ధం చేస్తామని అధికారులు బదులిచ్చారు.
పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లయ్య, అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.