సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ – కేసముద్రంలో ప్రత్యేక పూజలు

బిజెపి ఆధ్వర్యంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ – 2026

కేసముద్రం/ నేటి ధాత్రి

 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాదిని ‘సోమనాథ్ స్వాభిమాన పర్వం’గా ప్రకటించిన నేపథ్యంలో కేసముద్రం రామమందిరంలోని శివుణ్ణి దర్శించుకొని ఓంకార జపం మరియు విశేష పూజల్లో పాల్గొన్న బిజెపి కేసముద్రం మండల బిజేపి పార్టీ అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్, మండల ప్రధాన కార్యదర్శి బోగోజు నాగేశరచారి , జిల్లా నాయకులు ఓలం శ్రీనివాస్ మండల నాయకులు కంచు సురేందర్ శింగంశెట్టి మధుకర్ , వోలం వీరభద్రరావు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ మాట్లాడుతూ సోమనాథ్ ఆలయ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో భారతీయుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ, వారి త్యాగం భవిష్యత్ తరాల సాంస్కృతిక చేతనకు నిరంతర స్ఫూర్తినిస్తుందని అన్నారు.
మండల ప్రధాన కార్యదర్శి బోగోజు నాగేశరచారి , మాట్లాడుతూ మహాశివుడి 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొట్టమొదటిదైన గుజరాత్ సోమ్ నాథ్ పై దాడి జరిగి ఈ ఏడు వెయ్యేళ్లు అవుతుంది. వెయ్యేళ్లుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న ఈ మహిమాన్విత క్షేత్రం భారత అధ్యాత్మికత, నాగరికత, వారసత్వ వైభవోపేతానికి సజీవ సాక్షిగా నిలబడింది. అంతేకాదు, ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగి ఈ ఏడాది 75 సంవత్సరాలు అవుతుంది అని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version