ప్రచారంలోఅనుమతి లేని వాహనాలనుసీజ్చేసిన అధికారులు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం బదనపల్లిటెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో రెండు ప్రచార వాహనాలను ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారు. సమాచారం ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఇందిరమ్మ కాలనీకి చెందిన గడ్డం మధుకర్ రచన. ఇందిరమ్మ గ్రామపంచాయతీ సర్పంచిగా పోటీ చేయుచున్నారు పోటీలో భాగంగా ప్రచార వాహనాలను తీసుకొని ప్రచారం నిర్వహిస్తుండగా ప్రభుత్వ అధికారులు. ఎన్నికలకు విరుద్ధంగాఎలాంటిపర్మిషన్ లేకుండా వాహనాలను ప్రచారంలో భాగంగా తిప్పుతూ ఉంటే అధికారులకు సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేసి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో సదురు వాహనాలను ఎన్నికల నియమాలిప్రకారంసీజ్ చేయడం జరిగిందని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు తమకు సంబంధించిన ప్రచార వాహనాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని గ్రామంలో ప్రచారాలు నిర్వహించేవారు ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేనియెడల ఎన్నికల నియమాలు ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు
