క్రిమిసంహారిక మందు తాగి.. యువకుడు మృతి
బాలానగర్ /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని జీడిగుడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలోని పంచాంగుల గడ్డ తండాలో వారం రోజుల క్రితం కేతావత్ విష్ణు (23) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవిస్తూ ఉండేవాడు. ఇటీవల ఇంట్లో ఆర్థిక భూ తగాదాలు జరిగాయని తాండావాసులు అన్నారు. క్షీణికావేశంలో గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంబటే స్పందించి హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం షాద్ నగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. శనివారం ఉదయం మరణించాడు. చిన్న వయస్సులోనే మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. విష్ణు అంత్యక్రియలకు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
