Headlines

ప్రజా రక్షణే…మా ధ్యేయం

ప్రజా రక్షణే…మా ధ్యేయం వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలో పోలీసులు ప్రజలకు భరోసాను కల్పించడమే కాకుండా నిత్యం నగరంలో శాంతిభద్రతలకై కంటిమీదకునుకు లేకుండా ప్రశాంత వాతావరణం కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నాము. నగరంలో నేరాలను నియంత్రించడం కోసం వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ డి.వి రవీందర్‌ ఆదేశాల మేరకు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటూ మా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాము. పోలీసులంటే బయపెట్టేవారు కాదు..పోలీసులంటే ప్రజాసేవకులమని నిరూపించుకుంటున్నామని, ఫ్రెండ్లీ పోలీసుతో ప్రజలకు మేము మరింత చేరువయ్యామని, ప్రజలకు పోలీసులపై అపారనమ్మకం ఏర్పడిందని…

Read More

‘షాని’కెళ్లద్దు…బిడ్డో….!

‘షాని’కెళ్లద్దు…బిడ్డో….! వద్దు బిడ్డా..లేనిదానికి కానిదానికి వెళ్లద్దు…ఉన్నంతలోనే వుండాలి. అందేకాడికే అందుకోవాలి, ఉన్నంతలోనే సర్దుకోవాలి. బయటికి కనిపించేదంతా అద్భుతం కాదు..మెరిసేదంతా బంగారం కాదు..ఇలాంటి మాటలు మన పెద్దోళ్లు చాలా మందికి చెబుతుంటారు. అయినా పెడచెవిన పెడుతూ కొందరు మెరిసేదంతా బంగారమే అన్నట్లు ఊహలలో తేలిపోతుంటారు. అసలు విషయం తెలుసుకునేలోపే జరగాల్సి నష్టం, సమయం అన్ని జరిగిపోతాయి. తీరా తలలు పట్టుకుంటే ఏం లాభం..? ఇది జగమెరిగిన సత్యం.నగరంలో పేద, మద్యతరగతి కుటుంబాల్లో తమ పిల్లలను ఓ ప్రైవేటు స్కూల్‌కు…

Read More

ఇంటింటికి బడిబాట

ఇంటింటికి బడిబాట మండలంలోని కొండాపురం గ్రామంలో అంగన్‌వాడీ కార్యక్రమంలో భాగంగా బడిబాట నిర్వహించారు. ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమంలో 5సంవత్సరాలలోపు పిల్లలందరిని అంగన్‌వాడీకి పంపాలని పిల్లల తల్లిదండ్రులకు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నపిల్లల మేథో వికాసాభివృద్దికి ఎంతోగానో తోడ్పడుతాయని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నపిల్లలను చేర్పిస్తే పోషకాహారంతోపాటు ఉచితవిద్య, ఆరోగ్యం, భాష అభివద్ధి గురించి పిల్లల తల్లిదండ్రులలో అవగాహన కలిగించారు. అనంతరం చిన్నపిల్లలకు ఆక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో గ్రామంలోని చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ…

Read More

కార్పొరేటర్‌ తండ్రి కావరం

కార్పొరేటర్‌ తండ్రి కావరం ఆయనో కార్పొరేటర్‌ తండ్రి. కొడుకు ఆవేశానికి గురైతే అలా కాదు…ఇలా అని సర్థిచెప్పాల్సినోడు రాజకీయం అంటే ఏంటో చెప్పి కొడుకు జనం తరుపు నాయకుడిగా ఎదిగేలా చేయాల్సినోడు కానీ కొడుకు కంటే ముందు తండ్రికే ఓపిక లేకుండాపోయింది. తనయుడి కార్పొరేటర్‌ పెత్తనాన్ని తనకు ఉన్న కావరాన్ని కలగలిపి డివిజన్‌ ప్రజలపై విరుచుకుపడ్డాడు. నా కొడుకునే నల్లా నీళ్లు కావాలని అడుగుతారా…డివిజన్‌లో నీటి కొరత ఉందని ఫిర్యాదు చేస్తారా…? కార్పొరేటర్‌ అయిన నా కొడుకు…

Read More

గుట్కాల పట్టివేత

గుట్కాల పట్టివేత వరంగల్‌ క్రైమ్‌, నేటిధాత్రి : మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శంభునిపేట ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన 27వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు బుధవారం స్వాదీనం చేసుకున్నామని మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు. శంభునిపేటకు చెందిన ధర్మపురి రమేష్‌ ఇంట్లో తనిఖీ చేయగా గుట్కాలు లభించాయని, రమేష్‌పై కేసు నమోదు చేశామని మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు.

Read More

నేనే మేయర్‌…నేనే ఎమ్మెల్యే నేనంటే నేనే

నేనే మేయర్‌…నేనే ఎమ్మెల్యే నేనంటే నేనే కార్పొరేటర్‌ నుంచి మేయర్‌గా, ఆ తరువాతి సమీకరణలతో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నన్నపనేని నరేందర్‌ వరంగల్‌ తూర్పుతో సహా గ్రేటర్‌ వరంగల్‌ అంతా తన పెత్తనం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పెత్తనం ఎక్కడి వరకు వెళ్లిందంటే గ్రేటర్‌ కాకుండా వరంగల్‌ ఉమ్మడి జిల్లా మొత్తంగా తన పరపతి ఏంటో చూపించుకునే స్థాయికి నరేందర్‌ గూర్చి ఆ పార్టీ నాయకులే కొంతమంది ఎమ్మెల్యేకు ముందు, ఎమ్మెల్యే తరువాత…

Read More

కార్మిక చట్టాలు అమలు చేయాలి

కార్మిక చట్టాలు అమలు చేయాలి నర్సంపేట పట్టణంలో వివిధ దుకాణాలలో పనిచేస్తున్న గుమస్తాలకు కార్మికచట్టాలు అమలుచేయాలని కోరుతూ జిల్లా లేబర్‌ అధికారి రమేష్‌బాబుకు టీఆర్‌ఎస్‌ కెవి ఆద్వర్యంలో అవినీతిపత్రాన్ని అందజేశారు. టిఆర్‌ఎస్‌ కేవి రాష్ట్ర నాయకురాలు నల్లా భారతి, జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజులు మాట్లాడుతూ గుమస్తాలకు ఎనిమిదిగంటల పని విధానం అమలుకావడం లేదని, రోజుకు 12గంటలు పనిచేయడం వల్ల మహిళా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారాంతపు సెలవులు అమలుకావడం లేదని, కార్మికులు పనిచేసే…

Read More

అంగన్‌వాడి టీచర్ల బడిబాట

అంగన్‌వాడి టీచర్ల బడిబాట హసన్‌పర్తి మండలంలోని జయగిరి గ్రామంలో అంగన్‌వాడి టీచర్లు బడిబాట కార్యక్రమం చేపట్టారు. ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపేయాలని, 5సంవత్సరాలకు పైబడి ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్పించాలని అంగన్‌వాడీ టీచర్లు గ్రామంలో ర్యాలీ చేపట్టారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. ప్రతి గ్రామంలోని తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ప్రతి పిల్లవాడికి పౌష్టికాహారం, కోడిగుడ్లు, పాలు, విటమిన్లతో కూడిన ఆహారాన్ని పిల్లలకు అంగన్‌వాడీ టీచర్లు పెడుతున్నారని ఈ కార్యక్రమంలో…

Read More

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య మండలంలోని అన్నారం షరీఫ్‌లోని యుపిఎస్‌ పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోమేశ్వర్‌ మాట్లాడుతూ నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని అన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, 2జతల దుస్తువులు, అన్ని రకాల సౌకర్యాలు గల ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ విద్యాసంవత్సరం నుండి 1వ తరగతి నుండి ఇంగ్లీష్‌ మీడియంలో బోధన చేస్తున్నామన్నారు….

Read More

పోతరాజు విగ్రహం ధ్వంసం

పోతరాజు విగ్రహం ధ్వంసం మండలంలోని అన్నారం షరీఫ్‌ గ్రామ చెరువుకట్టపై గల పెద్దమ్మతల్లి గుడిలోని పోతరాజు విగ్రహాన్ని బుధవారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని ముదిరాజ్‌ కులసంఘము నేతలు ఘటనాస్థలికి చేరుకుని ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారినుండి ఫిర్యాదును స్వీకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read More

దుండగుల దాడిలో వ్యక్తి మృతి

దుండగుల దాడిలో వ్యక్తి మృతి జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్‌ సెంటర్‌లోని శ్రీరామ సంతోష్‌లాడ్జ్‌లో గుర్తుతెలియని దుండగుల దాడిలో వ్యక్తి మృతిచెందాడు. అంబెడ్కర్‌ సెంటర్‌లోని టీ స్టాల్‌ యజమాని నాగరబోయిన కనకరాజు(50)ని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.

Read More

గ్రామ అభివద్ధిపై సమీక్షా సమావేశం

గ్రామ అభివద్ధిపై సమీక్షా సమావేశం గ్రామంలోని పలు సమస్యల పట్ల, గ్రామాబివద్ధి లక్ష్యంగా సమీక్ష సన్నివేశాన్ని సర్పంచ్‌ బరిగెల లావణ్య అధ్యక్షతన గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. గ్రామంలోని అంతర్గతరోడ్లు, మంచినీటి సౌకర్యం, గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని పనుల పట్ల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కెసిఆర్‌ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అన్నిరకాల వర్గాల ప్రజలకు అందేవిధంగా ప్రతి ఒక్కరు సహకరించుకోవాలని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రుతి, ఉపసర్పంచ్‌ బాషబోయిన శ్రీనివాస్‌, వార్డుసభ్యులు…

Read More

ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు

ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు మా ఊరికి ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు, ప్రభుత్వ పాఠశాలల విద్యాబోధనే మాకు ముఖ్యమని మందపల్లి గ్రామస్తులు ప్రైవేటు పాఠశాల బస్సును అడ్డుకున్నారు. నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలం మందపల్లి గ్రామంలో గురువారం నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులోని న్యూవిజన్‌ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు రావడంతో ఆ గ్రామానికి చెందిన గ్రామస్తులు, గ్రామసర్పంచ్‌, పంచాయతీ వార్డుసభ్యులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మొగ్గం మహేందర్‌, గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే…

Read More

బడి బస్సులు భద్రమేనా…?

బడి బస్సులు భద్రమేనా…? పాఠశాలలు మొదలయ్యాయి…పిల్లల ఫీజులు, పుస్తకాలు కొనటంలో విద్యార్థుల తల్లితండ్రులు తలమునకలు అవుతున్నారు. పుస్తకాల రేట్లు ఎమ్మార్పీ రేటుకు ఎక్కువ ఉన్నా, అసలు పుస్తకాలపై రేటు లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులుచేసి కొనవలసి వస్తుందని తల్లితండ్రుల వాదన. దూరప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు పాఠశాల యాజామాన్యం బస్సులు ఏర్పాటు చేస్తుంది. కానీ వాటికి ఫిట్‌నెస్‌ పరీక్షల నిమిత్తం ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సిన బస్సులు నేటివరకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకునేందుకు కార్యాలయం మొహం చూసిన పాపానపోలేదు. ఫిట్‌నెస్‌…

Read More

తహసీల్దార్‌ తీరుపై రైతుల ఆందోళన…,

తహసీల్దార్‌ తీరుపై రైతుల ఆందోళన… వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలకేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో సకాలంలో పనులు చేయకుండా అధికారులు జాప్యం చేస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఐనవోలు మండలం ఏర్పాటైన నాటి నుండి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని, అయినప్పటికీ పట్టాదారు పాసు పుస్తకాలు కాలేదంటూ ఒకరి తరువాత ఒకరుగా బదిలీపై వెళ్తున్నారన్నారు. ఈ విషయంపై ఆర్డీవోకి మొరపెట్టుకున్న పనులు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మా…

Read More

పట్టుబడిన భామ, బాస్‌…?

పట్టుబడిన భామ, బాస్‌…? చెట్టాపట్టాలేసుకుని వయసును, హోదాను, వృత్తిధర్మాన్ని మరచిపోయి ఏకంగా ప్రభుత్వ వాహనాన్ని తన సొంత వాహనంలా వాడుకుంటూ పిల్లలకు బుద్దులు నేర్పాల్సిన ఆ అధికారి ఓ భామతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటాన్ని బాస్‌ కుటుంబసభ్యులతో సహా కార్యాలయ సిబ్బంది, తోటి అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటూ ఛీకొడుతున్నారు. ‘నవ్విపోదురుకాక…నాకేంటి అన్నట్లు’ అతను భామతో తిరుగుతున్న వ్యవహారం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. బయట ప్రపంచంలోనే కాదు, ఏకంగా తాను విధులు నిర్వహించే ప్రభుత్వ కార్యాలయంలోనే వీరు…

Read More

తృటిలో తప్పిన పెను ప్రమాదం

తృటిలో తప్పిన పెను ప్రమాదం జనగాం జిల్లా రఘునాథపల్లి మండలకేంద్రంలో కారు ఎదురుగా రావడంతో ఆర్టీసి బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. భూపాలపల్లి డిపోకు చెందిన ఎపి 29 జడ్‌ 3750 నంబర్‌ గల బస్సు హన్మకొండ నుంచి ఉప్పల్‌ ఎక్స్‌రోడ్డు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండడంతో వాహనాలను ఒకవైపునకు మళ్లించారు. కారు రాంగ్‌ రూట్లో వేగంగా రావడంతో బస్సును పక్కన…

Read More

మంత్రి చుట్టూ జర్నలిస్ట్‌ భజన బందం

యదార్థవాధి లోకవిరోధి-1 మంత్రి చుట్టూ జర్నలిస్ట్‌ భజన బందం ఇటీవల పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రైవేట్‌ పీఎల వ్యవహారంపై ‘నేటిధాత్రి’ కథనాలను ప్రచురించింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే పీఎల విషయంలో జాగ్రత్త, ప్రైవేట్‌ పీఎల నియామకానికి స్వస్తి పలకండి అని చెప్పి, ప్రభుత్వం కేటాయించే పీఎలను తానే నియమిస్తానని మంత్రుల ఇష్టా, ఇష్టాలకు సీఎం చెక్‌ పెడితే, అది కాదని చెప్పి ఎర్రబెల్లి ఏకంగా 20మంది పీఎలను నియమించుకున్నట్లు అందిన సమాచారంతో ఆ అంశాన్ని…

Read More

టిఎస్‌ మీడియా అకాడమీ కార్యదర్శిగా డిఎస్‌.జగన్‌

టిఎస్‌ మీడియా అకాడమీ కార్యదర్శిగా డిఎస్‌.జగన్‌ తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శిగా డి.ఎస్‌.జగన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం మసాబ్‌ట్యాంక్‌లోని సమాచార భవన్‌, మీడియా అకాడమీ కార్యాలయంలో కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వరంగల్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడిగా పనిచేస్తున్న డి.ఎస్‌.జగన్‌కు మీడియా అకాడమీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్‌ అరవింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు….

Read More

ఉమా బుక్‌స్టాల్‌పై దాడులు

ఉమా బుక్‌స్టాల్‌పై దాడులు వరంగల్‌ నగరంలో ప్రైవేటు పాఠశాలలకు సంబందించిన నోట్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాలను ఉమాబుక్‌ స్టాల్‌ నిర్వాహకులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరంగల నగరంలోని దేశాయిపేట రోడ్‌లో నిర్వహిస్తున్న ఉమా బుక్‌స్టాల్‌పై సొమవారం తూనికలు, కొలతల అధికారలు దాడులు నిర్వహించి బుక్‌స్టాల్‌ నిర్వాహకులు అమ్ముతున్న నోట్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాలను పరిశీలించారు. వాటిపై ఉన్న రేట్లను క్షణ్ణంగా పరిశీలించారు. ఎమార్పి రేట్ల కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని తూనికల, కొలతల…

Read More