చలి, పొగమంచుతో ప్రమాదాల ముప్పు: ఎస్ఐ హెచ్చరిక

చలి, పొగమంచుతో ప్రమాదాల ముప్పు: ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ హెచ్చరిక

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T154821.148.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ప్రజలకు ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ముఖ్య హెచ్చరికలు జారీ చేశారు. పెరుగుతున్న చలి, పొగమంచు కారణంగా ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉందని, రాత్రి, తెల్లవారుజామున అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం నిషేధమని తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ సూచనలు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ పేర్కొన్నారు.

వనపర్తి కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనకు సన్మానం

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేనను సన్మానము చేసిన సోషల్ మీడియా కోర్దినేటర్

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T153802.624-1.wav?_=2

 

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్త కాపు శివసేన రెడ్డిని వనపర్తి కాంగ్రెస్ సోషల్ మీడియా కోర్దినేటర్ డి వెంకటేష్ సన్మానము చేశారు ఈకార్యక్రమము జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేగారెడ్డి మేగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారని వెంకటేష్ ఒక ప్రకటన లో తెలిపారు

ఎస్సైను కలిసిన పెగడపల్లి నూతన సర్పంచ్

ఎస్సై ని కలిసిన పెగడపల్లి నూతన సర్పంచ్

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T152334.771-1.wav?_=3

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రామగిరి రామన్న తన గ్రామ నాయకులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీధర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రామంలోని శాంతి భద్రతలు, ప్రజల సమస్యలు,రానున్న రోజుల్లో గ్రామాభివృద్ధికి పోలీస్ శాఖ సహకారం వంటి అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు.గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడం యువతను సరైన దారిలో నడిపించడం మత్తు పదార్థాల నియంత్రణ అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సర్పంచ్ రామన్న,ఎస్సై దృష్టికి తీసుకెళ్లారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ వారు గ్రామపంచాయతీ సమన్వయంతో పని చేయాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తామని శాంతి భద్రతల పరిరక్షణలో గ్రామ ప్రజలు కూడా భాగస్వాములుగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచులు పడాల మల్లా గౌడ్,రాజా గౌడ్,రిక్కుల అంజిరెడ్డి,మద్దుల మల్లారెడ్డి,మద్దుల మనోహర్ రెడ్డి, ప్రభాకర్ చారి దుస్స భాస్కర్, బొప్ప రమేష్,పాలమాకుల రాజేందర్ రెడ్డి,రిక్కుల శేఖర్ రెడ్డి,నరెడ్

కరీంనగర్ లో సిపిఐ వందేళ్ల సంబరాలు

పెట్టుబడిదారుల,కార్పొరేట్ శక్తుల ఆగడాలకు కళ్ళెం వేసేది కమ్యూనిస్టులే

కరీంనగర్ లో ఘనంగా సిపిఐ వందేళ్ళ సంబరాలు

అంతరాలు లేని సమ,సమాజ నిర్మాణం కోసం,అణగారిన వర్గాల హక్కుల కోసం వందేళ్లుగా సిపిఐ పోరాడుతుంది- పంజాల శ్రీనివాస్

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T151617.880-1.wav?_=4

కరీంనగర్, నేటిధాత్రి:

 

భారతదేశ సంపదను దోచుకునే పెట్టుబడిదారుల, కార్పోరేట్ శక్తుల ఆగడాలకు ఎప్పటికప్పుడు కళ్ళెం వేసింది కమ్యూనిస్టులేనని, సమాజంలో జీవిస్తున్న వారందరి కోసం అంతరాలు లేని సమ సమాజ నిర్మాణం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం వందేళ్లుగా నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోంది భారత కమ్యూనిస్టు పార్టీయే నని సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. భారతదేశంలో సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శుక్రవారం కరీంనగర్ లోని సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటుచేసిన సిపిఐ జెండాను పంజాల శ్రీనివాస్ ఎగురవేశారు, సిపిఐ శ్రేణులంతా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈసందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ సోవియట్ రష్యా విప్లవ విజయం స్ఫూర్తితో భారత దేశ స్వాతంత్ర్యానికి పూర్వమే 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో సిపిఐ ఆవిర్భవించిందని, అంతరాలు లేని సమాజ నిర్మాణం వర్గ దోపిడీకి వ్యతిరేకంగా సిపిఐ పనిచేస్తుందన్నారు. బ్రిటిష్ పాలనలో మగ్గుతున్న భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని స్వాతంత్ర్య మహోద్యమంలో సిపిఐ పార్టీ పాల్గొన్నదని, వేలాది మంది కమ్యూనిస్టుల ప్రాణ త్యాగాలు కూడా జరిగాయని, స్వాతంత్ర్యం తీసుకురావడంలో సిపిఐ పాత్ర కీలకమైందన్నారు. స్వాతంత్ర్య అనంతరం దేశంలో కార్మిక కర్షక పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం వారి హక్కులను పరిరక్షించేందుకు ఎన్నో పోరాటాలు నిర్వహించిందని, దేశంలో ఆనాడు ఉన్న పరిస్థితుల్లో రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయికరణ, పద్దెనిమిది ఏండ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు చట్టం,భూ హక్కు చట్టం,అటవీ హక్కుల చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం లాంటి అనేక ప్రజా ఉపయోగకరమైన చట్టాలు తీసుకువచ్చిన ఘనత సిపిఐ దేనన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం నవాబ్ పరిపాలనకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి మగ్దూo మొహిద్దిన్ లు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని, ఆమహత్తర పోరాటములంగా నిజాం నవాబు భారత దేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేశాడని, ఆపోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది వీరమరణం పొందారని, పదిలక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచిన ఘనత సిపిఐకే దక్కిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను, రైతుల చట్టాలను మారుస్తూ చివరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల పొట్టను కొట్టే విధంగా పరిపాలన కొనసాగిస్తుందని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కాలవస్తుందని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ, దేశ సంపదను పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పజెప్తూ వనరులన్నింటినీ కొల్లగొడుతుందని, బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, వామపక్ష అభ్యుదయవాదులు మరిన్ని పోరాటాలను ఉదృతం చేయాలని అందుకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బామండ్లపెల్లి యుగేందర్, బూడిద సదాశివ, బోనగిరి మహేందర్,కొట్టే అంజలి, శాఖ కార్యదర్శులు ఎలిశెట్టి భారతి, గామినేని సత్యం,టి.రామారావు,చెంచల మురళి, కసిబోజుల సంతోష్ చారి, మాడిశెట్టి అరవింద్, బాకం అంజయ్య, తోడేటి శ్రీనివాస్, నగునూరి రమేష్, మామిడిపల్లి హేమంత్ కుమార్,సందీప్ రెడ్డి, సాంబయ్య, వెంకట్రాములు, సంపత్, తదితరులు పాల్గొన్నారు.

 

జీర్లపల్లిలో క్రిస్మస్ వేడుకలు

జీర్లపల్లిలో క్రిస్మస్ వేడుకలు: నూతన సర్పంచ్ శుభాకాంక్షలు

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T150916.937-1.wav?_=5

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ శాసన పరిధిలోని ఝారసంఘం మండలం జీర్లపల్లి గ్రామంలో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని చర్చి వద్ద నూతన సర్పంచ్ అమరేశ్వరి శివమణి కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరీ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి, ఉపసర్పంచ్ రాజశేఖర్, గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి, మాణిక్ రెడ్డి, పాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

వీణవంకలో సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పేదలకు అండగా… పోరాడే పార్టీ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ఇజ్గిరి రాంగోపాల్

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T150326.025.wav?_=6

వీణవంక, నేటి ధాత్రి:

 

వీణవంక మండల కేంద్రంలో శుక్రవారం సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేసి పార్టీ జెండాను మండల కార్యదర్శి రాంగోపాల్ ఆవిష్కరించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశంలో 100 సంవత్సరాలుగా
కార్మికుల, రైతుల, విద్యార్థి, యువజనుల పక్షాన మహాతరమైన పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించడం చరిత్ర సిపిఐ కి ఉందని
హైదరాబాద్ సంస్థానంలో రాచరిక పాలన అంతముందించి ప్రజాస్వామ్య పరిపాలనకు నడుం బిగించిన సిపిఐ పార్టీ అశేష త్యాగాలను చేసింది ఉరికొయాలను ముద్దాడింది. ప్రపంచం గర్వించే విధంగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచే విధంగా రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపింది
దున్నేవాడికి భూమి కావాలని ప్రభుత్వం ప్రజలందరికీ కనీస అవసరాలు అయిన కూడు, గూడు ,గుడ్డ ఏర్పాటు చేయాలనే కార్యక్రమ ఎజెండా నీ ప్రభుత్వాల ముందు పెట్టీ వాటిని సాధించడంలో క్రియాశీలకమైన పాత్ర సిపిఐ పార్టీ పోషించింది. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తామని, భవిష్యత్ భారతదేశ రాజకీయాలకు ఎర్రజెండానే ప్రత్యామ్నాయమని, రానున్న రోజుల్లో మండలంలో గ్రామ గ్రామాన సిపిఐ విస్తరిస్తామని ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రత్నాకర్, బుర్ర సతీష్, బాలగోని చిరంజీవి తాటి కంటి ప్రకాష్ ,పూదరి వినయ్ తదితరులు పాల్గొన్నారు.

దైవజనులకు ప్రత్యేక ధన్యవాదములు

దైవజనులకు ధన్యవాదములు

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T145644.307.wav?_=7

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం లో ప్రముఖ దైవజనులు అయిన పాస్టర్ ప్రశాంత్ బెంజిమెన్ గారిని ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిసిన సందర్బంగా పెన్ గన్ పత్రిక ఎడిటర్ రాయి కోటి నర్సిములు పత్రిక అయిన పెన్ గన్ పత్రిక యొక్క టైటిల్ పెన్ గన్ కావున అట్టి పెన్ గన్ ను బహుకరించిన దైవజనులు పాస్టర్ ప్రశాంత్ బెంజిమెన్ గారికి ప్రత్యేక ధన్యవాదములు

సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలిసిన సర్పంచ్ లక్ష్మి

సివిల్ ఆసుపత్రి సూపర్ డెంట్ ని కలిసిన సర్పంచ్ లక్ష్మి.

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T145000.221.wav?_=8

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని చిట్యాల గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా ఆసుపత్రి సూపర్ డెంట్ శ్రీకాంత్ సార్ గారిని మర్యాద పూర్వకముగా కలిసి సన్మానం చేసి ఆసుపత్రిలో నెలకొన్నటువంటి సమస్యల పైన చర్చించడం జరిగింది . ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తామని సమస్యలు ఉంటేతమ దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ కోరారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబెర్ నవీన్ పాల్గొన్నారు.

గోవింద్ పూర్ సర్పంచ్‌కు ఘన సన్మానం

గోవింద్ పూర్ సర్పంచ్ ను సన్మానించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T144223.670.wav?_=9

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ గ్రామం నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన కవిత వెంకట్ పార్టీ నాయకులతో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారిని మర్యాద పూర్వకంగా కలువగా గెలిచిన సర్పంచ్ కవిత వెంకట్ ను,వారి గెలుపుకు కృషి చేసి గెలిపించిన మాజీ సర్పంచ్ ల ను పార్టీ నాయకులను శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటు గ్రామ అభివృద్ధికి కృషి చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు నర్సింలు, రాజు,ఆర్.రాజ్ కుమార్, చెంద్రయ్య,మాజీ ఉపసర్పంచ్ ఖలీల్,గ్రామ పార్టీ అధ్యక్షులు వీర్ శెట్టి,రమేష్, సుభాష్,తిరుమల్,తదితరులు ఉన్నారు,

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : చల్లా ధర్మారెడ్డి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి చల్లా ధర్మారెడ్డి

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T143344.864.wav?_=10

 

నడికూడ,నేటిధాత్రి:

 

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని ఓడిన గెలిచిన ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓటమిపాలైన కంఠాత్మకూర్, సర్వాపూర్ గ్రామాల అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.ఈ సందర్భంగా వారు అభ్యర్థులకు మనోధైర్యం కల్పిస్తూ,ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఓటమితో పోరాటస్ఫూర్తి తగ్గదని స్పష్టం చేశారు.
గ్రామాల అభివృద్ధి,ప్రజల సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేయాలన్నారు.ఎన్నికల్లో ఫలితం ఎలా ఉన్నా,పార్టీ కోసం నిలబడి పోరాడిన ప్రతి నాయకుడికి,కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ ఎన్నికల ఫలితాలను పునఃసమీక్ష చేసుకొని, లోపాలను సరిదిద్దుకుంటూ రాబోయే ఎన్నికల్లో మరింత సన్నద్ధంగా ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గుంతల మయమైన శేఖాపూర్ రోడ్డును పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు

గుంతల మయమైన శేఖాపూర్ రోడ్డును పరిశీలించిన నాయకులు

◆-: జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T142126.440.wav?_=11

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నుండి వయా శేఖాపూర్ కర్ణాటక బార్డర్ బోనస్ పూర్ వరకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు గారు అప్పటి మంత్రి తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో నిధులను మంజూరు చేయించారు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పనులను చేయించడం లేదు నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తూ తమ ప్రయాణ గమ్యాన్ని చేరుకుంటు జహీరాబాద్ మండలంలోని హోతి కె గ్రామం మీదుగా ప్రయాణిస్తూ శేకపూర్ గ్రామం మీదుగా మల్చేల్మా, పర్శపల్లి, బడం పెట్, మనియార్ పల్లి, ఆనేగుంట, మల్చేల్మా, కుంచారం, తాండూర్ కు వెళ్లే వాహనదారులు నిత్యం గుంతలమాయమైన రోడ్డుపై ప్రయాణిస్తూ తరచు ప్రమాదాల బారిన పడటమే కాకుండా కొందరి ప్రాణాలను సైతం కోల్పోయారు అతికష్టమైన ప్రయాణాన్ని సాగిస్తూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయనిస్తున్నారు. గురువారం నాడు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, శేకపూర్ గ్రామ సర్పంచ్ మొహమ్మద్ చెష్మోద్దీన్ ,రేషన్ డీలర్స్ అసోసియేషన్ జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు గడ్డమీది విజేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ చిన్నా రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై పడ్డ గుంతలను పరిశీలించి పక్షం రోజుల్లో రోడ్డు నిర్మాణం పనులు మొదలు పెట్టకపోతే సమీప గ్రామాల ప్రజలతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని, అక్కడ కూడా స్పందన రాకపోతే శేకపూర్, మల్చేల్మా, అనేగుంట, పర్శపల్లి, గోటిగార్ పల్లి బడం పెట్ గ్రామ ప్రజలతో కలిసి శేఖాపూర్ రోడ్డుపై నిరాహార దీక్ష చేపడతామని తట్టు నారాయణ హెచ్చరించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు సైఫోద్దీన్ మొహమ్మద్ జాహిద్, మొహమ్మద్ పాష, సదర్ మైబ్ పాశ ,ఇసాక్ షాబొద్దీన్ ,పాష భాయ్ మాచి రెడ్డి పల్లి ,మాజీ ఎంపీటీసీ నారాయణ్ గౌడ్ ,ఖుర్షిద్ మాజి సర్పంచ్ జగదీష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి ఆలయంలో పూలమాల కైంకర్య సేవ

వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూలమాల కై oకరియా సేవలో భక్తులు

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T132339.214-1.wav?_=12

 

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల కై oకరియా సేవలో ఏరియా హాస్పిటల్ పాలకమండలి మాజీ సభ్యులు లగిశెట్టి సాయి ప్రసాద్ దంపతులు మార్కెట్ కమిషన్ కొండ రాజయ్య దంపతులు రాజశేఖర్ దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది శంకర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు . ఈసందర్భంగా ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం శర్మ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయని గోదాదేవి అమ్మవారికి పూలమాల కైoకరియా సేవ అర్చనలు పూజలు చేయించే భక్తులు ఆలయంలో సంప్రదించాలని భక్తులను కోరారు పూజల అనంతరం భక్తులకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు . పూలమాల కై oకరియా సేవలో పాల్గొనే భక్తులను ఆలయ చైర్మన్ ధర్మకర్త అయ్యలూరి రఘునాథం చార్యులు ఆశీర్వదించారు ధనుర్మాస ఉత్సవాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే పూజలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవి అమ్మ వారికి కృపకు పాత్రు లు .ఆలయ ప్రధాన పూజారి భక్తులకు విజ్ఞప్తి చేశారు

యాసంగికి ఎస్సారెస్పీ నీళ్లపై అనిశ్చితి

ఇంకా ఖరారు కానీ నీటి విడుదల షెడ్యూల్

యాసంగికి ఎస్సారెస్పీ నీళ్లు వచ్చేనా?

ఆందోళనలో రైతులు

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T131631.224.wav?_=13

 

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ఎస్సారెస్పీ నీరు వరప్రదాయని మారిన శ్రీరామ్ సాగర్ నీటి విడుదల ప్రశ్నార్ధకంగా మారిం ది ఈ ఖరీఫ్ సీజన్ లో నీటి విడుదల కోసం రైతులు ఎదు రుచూస్తున్నారు. నీటి విడు దల అనే విషయం ఎవరు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతు లు ఆందోళనలు చెందుతు న్నారు ముఖ్యంగా ఎస్సారెస్పీ నీటిపై రైతాంగం ఆధారపడి ఉంటుంది నీటి విడుదల షె డ్యూల్ కోసం ఎదురుచూ స్తున్న రైతులు ఈ యాసంగి శ్రీరాoసాగర్ ఎస్సారెస్పీ పరిధి లోని ఇప్పటివరకు షెడ్యూలు ఖరారు కాకపోవడం వల్ల రైతు లు అయోమయంలో ఉన్నారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో యాసంగి డిసెంబర్ తోలి వారంలోనే షెడ్యూల్ విడుదల చేయగా రైతులు విత్తనం నాటు కొన్నా రు కొంతమంది ఎస్సారెస్పీ నీటి కోసం ఎదురుచూస్తు న్నారు ఒకవేళ నీటిని విడుదల చేయదలుచుకుంటే షెడ్యూలు విడుదల చేయాలని లేని పక్షంలో నీటి విడుదల ఉండ దని ప్రకటించాలని రైతులు కోరుతున్నారు

 

గతేడాది యాసంగిలో నీళ్లు అందక నష్టపోయాం

గతేడాది యాసంగిలో 2.20 ఎకరాల వరి, మొక్కజొన్న సాగు చేసిన సకాలంలో నీళ్లు అందకపోవడంతో పంట మొ త్తం ఎండిపోయి తీవ్రంగా నష్ట పోయాం ఈసారైనా అధికా రులు స్పందించి సకాలంలో నీళ్లు అందించాలని రైతులు కోరుతున్నారు

సాగుకు ఎస్సారెస్పీ నీళ్లు అందించాలి

బేర్గుసతీష్ శాయంపేట మండల రైతు

ఎస్సారెస్పీ కాలువ నీళ్లపై ఆధారపడి వ్యవసాయ సాగు చేస్తున్న గతేడాది ఎస్సారెస్పీ నీళ్లు సకాలంలో రాలేదు 8 ఎకరాల్లో నాలుగు ఎకరాలు వరి నాలుగు ఎకరాలు మొక్కజొన్న విత్తుకోవడం జరిగింది నీళ్లు లేక ఎండిపో యి పశువులకు మేత పాలైం ది. రైతుకు 16 లక్షల పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోవడం కాబ ట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ముందస్తుగానే నీళ్లను అందిం చాలి.

పుస్తకాలు కొనండి… పఠనాన్ని పెంపొందించండి

పుస్తకాలు కొనండి….

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T130731.705.wav?_=14

 

జహీరాబాద్ నేటిధాత్రి:

 

ప్రతి సంవత్సరం 11 రోజులపాటు హైదరాబాద్ కేంద్రంగా ఎన్టీఆర్ స్టేడియం లో హైదరాబాద్ బుక్ ఫేయిర్ పేరుతో నిర్వాహకులు పుస్తకాల పండుగను నిర్వహిస్తున్నారు.పుస్తక ప్రియులకు దేశ ,ప్రపంచ గొప్ప గొప్ప రచయితల రచనలకు పరిచయం చేసి పుస్తక పఠనానికి దోహదం చేస్తున్నారు. దాదాపు 368 పైగా పుస్తకాల స్టాల్ లను ఏర్పాటు చేసి వివిధ రకాల పుస్తకాలను విభిన్న భాషల పుస్తకాలు పాఠకులకు అందుబాటులోకి తెచ్చారు.పుస్తక పఠనం తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఈ లాంటి బుక్ ఫేయిర్ లను ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం అని జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి, రచయిత డా.పెద్దగొల్ల నారాయణ అన్నారు. పుస్తకాలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదం చేస్తాయని, ఉన్నత,ఉత్తమ విలువలకు దోహదం చేస్తాయి కనుక ప్రతి ఇంటిలో తప్పకుండా కనీసం లో కనిసంగా 100 పుస్తకాలతో మినీ గ్రంథాలయం ఉండాలని సూచించారు. ఈనాటి యువ ప్రపంచానికి పుస్తకాల ప్రాముఖ్యతను తెలియపరుచడం చాలా ముఖ్య విషయం అన్నారు. ఈ సందర్భంగా తాను రాసిన పుస్తక విలాపం రచనను గుర్తు చేసుకున్నారు. అందులోని ఒక వాఖ్యాన్ని గుర్తు చేశారు. ఈ నెట్ వచ్చాక యువత నన్ను(పుస్తకం) నెట్టి వేస్తున్నారు అని పుస్తకం విలాపం చెందిన తీరును తెలియజేసారు.ఏ కార్యక్రమంలో తనకు మాట్లాడడానికి అవకాశం వచ్చినా విద్యా, పుస్తకాల గొప్ప తనం గురించి, ఎక్కడైనా యువకులు కనిపించిన పుస్తక గురించి ప్రస్తావించారు.హైదరాబాద్ బుక్ ఫేయిర్ అంటే తనకు కూడా చాలా ఇష్టం అన్నారు.ప్రతి సంవత్సరం ఆ పుస్తకాల పండుగలో పాల్గొని చాలా పుస్తకాలను కొనుగోలు చేస్తాను అన్నారు.వివిధ రచనలు చెయ్యడం తో పాటు, వివిధ రకాల పుస్తకాలను సేకరించి చదవడం అదృష్టం గా భావిస్తాను అని గుర్తు చేశారు..
జహీరాబాద్ ప్రాంతానికి చెందిన యువకులతో కలిసి బుక్ ఫేయిర్ ను సందర్శించి పలు పుస్తకాలను కొనుగోలు చేశారు..

బీఆర్ఎస్‌లో చేరిన కొత్తూరు (డి) సర్పంచ్

బీఆర్ఎస్ లో చేరిన కొత్తూరు (డి) సర్పంచ్

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T125846.019.wav?_=15

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మండలం కొత్తూర్ (డి)లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సర్పంచ్ మాణిక్ ప్రభు, ఐదుగురు వార్డు సభ్యులు మాజీ మంత్రి హరీశ్ రావు సమక్షంలో గురువారం బీఆర్ఎస్ లో చేరారు. హరీశ్ రావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజులు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు

పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T125108.610.wav?_=16

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఝరాసంగంలోని ఎనిమిదో వార్డులో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్ ఆధ్వర్యంలో బోరు బావిని తవ్వించడం జరిగింది. త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు కాలనీలో అందరి సహకారంతో బోరు ఏర్పాటు చేయడం జరిగింది. గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్ పాటిల్, చంద్రప్ప, పెంటయ్య, సంగమేశ్వర్, ఆనందం, రాజ్ కుమార్, నాగప్ప, తుకారం, ఇస్మాయిల్, మహమ్మద్ ఫక్రుద్దీన్, అనిల్ కుమార్, సాయిలు, నర్సింలు, లక్ష్మయ్య, సంగన్న, ఫక్రుద్దీన్, కృష్ణ, దత్తు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో మంటల్లో దగ్ధమైన కారు

ప్రమాదవశాత్తు మంటలు వవాహనం దగ్ధం

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T124237.102.wav?_=17

 

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్, గురువారం రాత్రి జహీరాబాద్ బీదర్ రోడ్డులో ఒక కారు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుని బూడిదైంది. వివరాల ప్రకారం, జహీరాబాద్ బీదర్ రోడ్డులోని రైల్వే గేట్ సమీపంలో మారుతి ఓమ్ని వ్యాన్ చెడిపోయి మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు బూడిదైంది. కారులో సిఎన్‌జి గ్యాస్ ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయి. మంటలు చెలరేగిన వెంటనే భయం నెలకొంది మరియు ప్రయాణీకులు పారిపోయారు, ఎవరికీ గాయాలు కాలేదు లేదా ఎటువంటి ప్రమాదం జరగలేదు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు

పాండురంగ స్వామి ఆలయంలో ధనుర్మాసo 10 వ రోజు ప్రత్యేక పూజలో భక్తులు..

పాండురంగ స్వామి ఆలయంలో ధనుర్మాసo 10 వ రోజు ప్రత్యేక పూజలో భక్తులు

వనపర్తి నేటిదాత్రి 

 

వనపర్తి పట్టణ ములో పాండురంగ ఆలయంలో ధనుర్మాసo సందర్భంగా 10 రోజు పూజలో భక్తులు పాల్గొన్నారు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు బండారు కృష్ణ వాకిటి శ్రీదర్ ఆలయ పురోహితులు రామకృష్ణ కమిటీ నిర్వహుకులు పూరి బాల్ రాజు పిన్నం వసంత నరేందర్ నుకల విజయ్ వెంకట్ రమణ ఎరువ శీరీష భక్తులు పాల్గొన్నారు

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్..

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్

కాప్రా నేటిధాత్రి

 

 

మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చర్చ్ నీ సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమా భావాన్ని, సేవాతత్పరతను , క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో క్రిస్మస్ వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు. యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికీ లభించాలని, అందరూ సంతోషంగా జీవించాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్ రెడ్డి, గొల్లురీ అంజయ్య , బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గుమ్మడి జంపాల్ రెడ్డి , పాస్టర్ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

కార్యక్రమానికి విచ్చేయుచున్న
భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ నేటి ధాత్రి తో మాట్లాడుతూ మండల గ్రామపంచాయతీ పరిధిలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారు ఉదయం 8 గంటలకు వచ్చి వారి వారి కల్యాణ లక్ష్మి చెక్కులను తీసుకోగలరని ,కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు, మహిళ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా
కోరారు
స్థలం : * గణపురం గ్రామపంచాయతీ కార్యాలయం *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version