చౌటుప్పల్: చౌటుప్పల్ కేంద్రం విద్యుత్ ఏడి కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో అధికారుల దాడులు….. ఓ రైతు నుండి 70000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏడి శ్యాం ప్రసాద్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు…..పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
కోహిర్ మండల్లో మట్టి అక్రమ తరలింపు. పనులు నిలిపివేయడంతో మాఫియా దాడి
జహీరాబాద్. నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాల వ్యాపారం రోజురోజుకూ ఊపందుకుంటోంది. మరియు రెవెన్యూ శాఖ మరియు మన్నింగ్ శాఖ అధికారుల మౌనం అక్రమ గని కార్మికుల మనోధైర్యాన్ని పెంచింది. ఇటీవల, శుక్రవారం రాత్రి, మాద్రిలోని కోహిర్ మండల్ గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాల సమయంలో, మాద్రి గ్రామ ప్రజలపై మట్టి మాఫియా కర్రలతో దాడి చేసి, అక్రమ మట్టి తవ్వకాన్ని అడ్డుకున్నప్పుడు వారిని గాయపరిచింది. గాయపడిన వారిలో ముహమ్మద్ వసీం పటేల్, ముహమ్మద్ అజీం మరియు ఇతరులు ఉన్నారు. మరియు ఈ దాడిలో ముహమ్మద్ వసీం పటేల్ తీవ్రంగా గాయపడ్డాడు మరియు వెంటనే చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరియు మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరియు గాయపడిన వారి వివరాల ప్రకారం, వక్ఫ్ భూమిలో అక్రమంగా పంట కోతలు జరుగుతున్నాయని, అదే సమయంలో, పంట కోస్తున్న వారిని వివరాలు అడిగినప్పుడు, వారిపై కర్రలతో దాడి చేశారని తెలుస్తోంది. మరియు ఈ అక్రమ మైనింగ్ రెండు వైపుల నుండి కొనసాగుతోంది. మరియు దాడిలో గాయపడిన వారు శనివారం కోహిర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరియు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు ఈ అక్రమ మైనింగ్‌ను ఆపాలని గ్రామస్తులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
నర్సంపేట డివిజన్లోని దుగ్గొండి, నల్లబెల్లి, మండలాల్లోని పలు గ్రామాల్లో సోలార్ లైట్లు సంబంధించిన బ్యాటరీలను దొంగలిస్తున్న ముఠా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై వి గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం నల్లబెల్లి క్రాస్ జాతీయ రహదారి 365 పై ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా మల్లంపల్లి వైపుగా వెళ్తున్న ఒక బజాజ్ ఆటోలో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా అనుమానం వచ్చి ఆటోను పరిశీలించగా సదరు వ్యక్తులు ఆటో వదిలి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని ఆటోని పరిశీలించగా అందులో 10 సోలార్ బ్యాటరీలు లభ్యం అయ్యాయి. పట్టుబడిన నిందితులను వారితో ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించారు పట్టుబడిన వారిలో పర్వతగిరి మండలానికి చెందిన భూక్య నవీన్, అల్లాడి దుర్గ స్వామి, సంగెం మండలం తీగరాజు పల్లి కి చెందిన గూడూరు అరవింద్, కర్నే అఖిలాష్ గా పోలీసులు గుర్తించారు. వీరి నుండి 10 బ్యాటరీలు సహా ఒక ఆటో స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు .
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదుగురుపై కేసు నమోదు చేసిన పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం గుంపుల భారత్ పెట్రోలియం బంక్ పక్కనగల రైస్ మిల్లు స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిల్వ చేసి హైదరాబాద్ కు తరలించడానికి లోడ్ చేస్తుండగా పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ కంటైనర్ లారీని మరియు లోడర్ని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ నిల్వ చేసిన దాదాపు 20 ట్రాక్టర్ల ఇసుక గూర్చి ఓదెల తాసిల్దార్ కు సమాచారం ఇవ్వడం జరిగిందని నేరస్తులైన పెద్దిరెడ్డి జనార్దన్ రెడ్డి, మణిదీప్, పొన్నగంటి సురేష్, కోర్రి భాస్కర్, రాజన్ కుమార్ లు ఉనుకమరియు ఇసుక ను కలిపి కంటైనర్ లో తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు.ఇసుకను అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిలువచేసి హైదరాబాదుకు తరలించడానికి సిద్దం చేస్తున్న నేరస్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిలువ చేసిన, తరలించిన చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకోబడును అని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన ఖిలాడి భార్య
భార్యే ప్రధాన నిందితురాలు, ప్రియుడు సామ్యూల్ తో కలిసి భర్తను లేపేసేందుకు పన్నాగం పన్నిన భార్య. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకారం
కొంపముంచిన జిమ్ ట్రైనింగ్.., జిమ్ లో సుమంత్ భార్య ఫ్లోరా, జిమ్ ట్రైనర్ సామ్యూల్ ల ప్రేమాయణం
ఫిబ్రవరి 20న వరంగల్ భట్టుపల్లి రోడ్డులో వెళ్తున్న కారును అడ్డగించి, సుమంత్ పై ఐరన్ రాడ్లతో దాడి చేసిన దుండగులు
నేటిధాత్రి వరంగల్.
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన భార్య, వారికి సహకరించిన ప్రియుడి స్నేహితుడు రాజ్ కుమార్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్. భట్టుపల్లి రోడ్డులో డాక్టర్ పై దాడి సంచలనం కలిగించిన కేసులో, వారం రోజుల్లోనే చేదించిన మిల్స్ కాలనీ పోలీసులు. వరంగల్ లో యువ వైద్యుడు డాక్టర్ సుమంత్ రెడ్డిపై ఇటీవల జరిగిన హత్యాయత్నం ఘటనలో నిందితులను అరెస్టు చేశారు వరంగల్ మిల్స్ కాలని పోలీసులు. డాక్టర్ పై దాడి ఘటనలో సెన్సేషనల్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో అక్రమ సంబంధమే డాక్టర్ ప్రాణాలను తీయాలని వేసిన పన్నాగం బయటపడింది. కట్టుకున్న భార్యే సుమంత్ రెడ్డి మర్డర్ కోసం ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా తన ప్రియుడు సామ్యూల్ తో కలిసి భర్తను అడ్డు తొలగించుకునేందుకు స్కెచ్ వేయగా, దీనికి ఏఆర్ కానిస్టేబుల్ రాజు సహకరించినట్లు పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ముగ్గురు నిందితులను ఆరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు మిల్స్ కాలని పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ భార్య పెట్టుకున్న అక్రమ సంబంధం కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలిపారు.
అసలేం జరిగింది?
crime
ఫిబ్రవరి 20న వరంగల్ బట్టుపల్లి ప్రధాన రహదారిపై దాక్టర్ సుమంత్ పై దాడి జరిగింది. కారులో వెళ్తున్న డాక్టర్ సుమంత్ రెడ్డి కారుకు గుర్తు తెలియని వ్యక్తులు కారుకు అడ్డు వచ్చి.. కారును ఆపారు. ఆయనను కారులో నుంచి కిందకు లాగి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని స్థానికుల సహాయంతో కొన ఊపిరితో ఉన్న బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి చంపడానికి ప్రయత్నించినారని బాధితుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మిల్స్ కాలని పోలీసులు. దాడికి పాల్పడిన వారు ఎవరు.? వైద్యుడు సిద్దార్థ్ ను ఎందుకు చంపాలనుకున్నారు? వ్యక్తిగత కక్ష్యలు ఏమైనా ఉన్నాయా? లేక గంజాయి బ్యాచ్ ఏమైనా డాక్టర్ పై దాడికి పాల్పడిందా అన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేశారు. అయితే.. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన ఖిలాడి భార్య
హంటర్ రోడ్డులో నివాసం ఉంటున్న డాక్టర్ సుమంత్ రెడ్డి కి, వరంగల్ షిరిడీ సాయి నగర్ కి చెందిన ఫ్లోరా మరియా అను ఆమెతో 2016 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత 2018 సంవత్సరంలో సంగారెడ్డిలో డాక్టర్ సుమంత్ రెడ్డి బందువుల విద్యాసంస్థలు ఉండగా, వాటిని చూసుకోవడం కోసం భార్య భర్త లు సంగారెడ్డి కి షిఫ్ట్ అయితారు. అక్కడ డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డి పి.ఎచ్.సి లో, కాంట్రాక్టు పద్ధతిన మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తుండగా, తన భార్య ఫ్లోరా మరియా వారి బంధువుల స్కూల్లో టీచర్ గా పనిచేస్తుండేది.
కొంపముంచిన జిమ్ ట్రైనింగ్.., జిమ్ లో సుమంత్ భార్య ఫ్లోరా, జిమ్ ట్రైనర్ సామ్యూల్ ల ప్రేమాయణం
ఫ్లోరా బరువు తగ్గడానికి సంగారెడ్డి లోని సిద్దు జిమ్ సెంటర్ కి వెళ్తుండేది. ఆ జిమ్ సెంటర్లో కోచ్ గా పని చేస్తున్న ఏర్రోల్ల శామ్యూల్ అనే అతనితో పరిచయం ఏర్పడుతుంది. జిమ్ ట్రైనింగ్ పేరిట అయినా పరిచయం కాస్త వారిద్దరి మధ్య అక్రమ సంబంధంనకు దారితీసింది. వీరి అక్రమ సంబంధం గురించి డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలవగానే, భార్యా భర్తలకు గొడవలు జరిగాయి. ఈ గొడవల వలన డాక్టర్ సుమంత్ రెడ్డి అక్కడి నుండి తన ఫ్యామిలీని వరంగల్ కి షిఫ్ట్ చేసినారు. తరువాత 2019 సంవత్సరంలో సదరు ఫ్లోరా మరియా, ప్రభుత్వ లెక్చరర్ ఉద్యోగం పొంది, జనగాం జిల్లాలోని పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం చేసుకుంటూ అక్కడ వుండేవారు. తర్వాత ఆ కాలేజ్ వరంగల్ లోని రంగశాయిపేట్ కు మారడంతో, డాక్టర్ సుమంత్ రెడ్డి కూడా వరంగల్ లోని వాసవి కాలనీలో ఉంటూ, కాజీపేటలో ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటూ, ఉదయం వెళ్లి రాత్రి తన ఇంటికి వస్తుండేవాడు. సదరు ఫ్లోరా మరియా మాత్రం సంగారెడ్డిలో పరిచయమై వివాహేతర సంబంధం పెట్టుకున్న శామ్యూల్ తో తరచుగా ఫోన్లు మాట్లాడడం, వీడియో కాల్స్ మాట్లాడడం, డాక్టర్ సుమంత్ రెడ్డి లేని సమయంలో సదరు శామ్యూల్ నీ ఇంటికి పిలిపించుకొని అతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అది తెలుసుకున్న డాక్టర్ సుమంత్ రెడ్డి ఆమెను మందలించేవారు. ఈ విషయంలో వారిద్దరికీ తరుచుగా గొడవలు జరుగుతుండేవి. దానితో సదరు ఫ్లోరా మరియా, ప్రియుడు శామ్యూల్ లు కలిసి, డాక్టర్ సుమంత్ రెడ్డిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. తరువాత శామ్యూల్ ఈ విషయాన్ని తన స్నేహితుడైన రాజ్ కుమార్ అనే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కి తమ మర్డర్ ప్లాన్ విషయం చెప్పి, డాక్టర్ సుమంత్ రెడ్డి హత్య కి సహకరిస్తే నీకు సంగారెడ్డిలో ఇంటిని నిర్మించి ఇస్తానని చెప్తాడు. దానికి సదరు ఆ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ఒప్పుకొన్నాడు. తరువాత అందాదా 15 రోజుల క్రితం ఒక్క లక్ష రూపాయలు ఫ్లోరా మరియా, తన ప్రియుడు శామ్యూల్ కి ట్రాన్స్ఫర్ చెయ్యగా, అందులో నుండి ఖర్చులకు 50వేల రూపాయలు శామ్యూల్ తీసుకోని, మిగిలిన 50 వేల రూపాయలు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ కి ఇస్తాడు.
crime
భట్టుపల్లి రోడ్డులో మర్డర్ ప్లాన్
నిందితులు వారి మర్డర్ ప్లాన్ లో భాగంగా తేదీ20.02.2025 రోజున మధ్యాహ్నం సంగారెడ్డిలో ఒక సుత్తిని కొనుగోలు చేసి, హెడ్ కానిస్టేబుల్ రాజకుమార్ యొక్క రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ పై బయలుదేరి, కాజీపేటకు వచ్చి ముందుగా వారు అనుకున్న ప్రకారం, డాక్టర్ సుమంత్ రెడ్డిని సీసీ కెమెరాలు, జనసంచారం లేని చీకటి ప్రదేశాన్ని ఎంచుకొని, రెక్కీ చేసుకుని వాళ్లు అనుకున్న పథకం ప్రకారం డాక్టర్ సుమంత్ రెడ్డి రాత్రి వేళ, తన క్లినిక్ ముగించుకొని కారులో బట్టుపల్లి రోడ్డు నుండి రంగాశాయపేట కు, వెళ్తున్న క్రమంలో తన వెనుక ఫాలో అయ్యి బట్టుపల్లి శివారులో ఎస్ఆర్ స్కూల్ దాటిన తరువాత ఉన్న, చిన్న బ్రిడ్జి వద్ద డాక్టర్ తన కారు వేగాన్ని తగ్గించగా, అట్టి చీకటి ప్రదేశంలో అదే అదునుగా భావించిన శామ్యూల్ తనతో తెచుకున్న సుత్తితో కారు వెనుక ఇండికేటర్ ను కొడుతాడు. ఆ శబ్దానికి డాక్టర్ సుమంత్ రెడ్డి తన కారును పక్కకు ఆపి ఇండికేటర్ వద్దకు వచ్చి చూస్తుండగా, శామ్యూల్ అతని స్నేహితడు రాజ్ కుమార్ లు, సదరు డాక్టర్ సుమంత్ రెడ్డిని విచక్షణారహితంగా కొట్టి, గాయపర్చి, అతడు చనిపోయాడు అని భావించి అక్కడి నుండి వారు పారిపోతారు.
వారం రోజుల్లో కేసును ఛేదించిన వరంగల్ పోలీసులు
బాధితుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఈ కేసును వరంగల్ ఏసిపి నంది రామ్ ఆధ్వర్యంలో, మిల్స్ కాలనీ సిఐ వెంకటరత్నం, టాస్క్ ఫోర్స్ సీఐ రంజిత్ కుమార్, మిల్స్ కాలనీ ఎస్సై సురేష్, కానిస్టేబుల్ లు బావ్ సింగ్, చంద్రశేఖర్, వెంకన్న, రాజు, జెలెందర్, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎండి గౌస్, సల్మాన్ ఐటీ కోర్ టీం కానిస్టేబుల్ నగేష్ లు నిందితుల కోసం ప్రత్యక బృందాలుగా ఏర్పడి, సంచలనం సృష్టించిన కేసులోని నిందితులైన సంగారెడ్డి కి చెందిన ఏర్రోల్ల శామ్యూల్ (ఏ1), డాక్టర్ భార్య గాదె ఫ్లోరా మరియా (ఏ2), వీరికి సహకరించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మంచుకురి రాజ్ కుమార్ (ఏ3) లను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనభరిచిన పోలీస్ అధికారులను వరంగల్ ఏసిపి నందిరామ్ నాయక్ అభినందించారు.
మంటలను ఆర్పి వేసిన అటవీ సిబ్బంది-తప్పిన పెను ప్రమాదం
నిర్లక్ష్యం వద్దని అటవీశాఖ విన్నప
జైపూర్,నేటి ధాత్రి:
fire accident
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని వేలాల గుట్ట పై అడవిలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకొని మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన అటవీ సిబ్బంది వెంటనే ఫైర్ బ్లోయర్ సహాయం తో అర్పివేశారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని వేలాల గుట్ట పై అటవీ ప్రాంతంలో గట్టు మల్లన్న జాతర జరుగుతోంది. ఈ సందర్బంగా ఇక్కడ గుట్ట పై నిద్రించడానికి చాలా మంది భక్తులు విచ్చేసారు.రాత్రి ఇక్కడికి విచ్చేసిన వారిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నిర్లక్ష్యం వల్ల అడవిలో మంటలు చెలరేగాయి.రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వేలాల బీట్ అధికారి శ్రీధర్ మంటలను గమనించి తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ) వాచర్ సాయికిరణ్ ను ఫైర్ బ్లోయర్ తీసుకు రమ్మని చెప్పారు. వెంటనే ఫైర్ బ్లోయర్ తీసుకు వచ్చి మంటలు విస్తరించ కుండా వాటిని అర్పివేశారు.ప్రమాద స్థలాన్ని రాత్రి ఎఫ్ ఎస్ ఓ భగవంత్ రావు పరిశీలించారు.ఒక వేళ ఈ మంటలను ఆర్పక పోతే అడవికి చాలా నష్టం తో పాటు వేలాల జాతరకు వచ్చిన భక్తులకు ప్రమాదకరంగా ఉండేది.సకాలంలో అప్రమత్త మైన బీట్అధికారి శ్రీధర్ ను, అడవిలో మంటలను ఫైర్ బ్లోయర్ తో అర్పివేసిన టీజీ ఎఫ్ డీసీ వాచర్ సాయికిరణ్ ను మంచిర్యాల రేంజ్ ఎఫ్ఆర్ఓ రత్నాకర్ రావు,టీజీ ఎఫ్ డీసీ ప్లాంటేషన్ మేనేజర్ జి.సురేష్ కుమార్ లు అభినందించారు.జాతరకు విచ్చేసే భక్తులు అడవిలో వంట చేసుకున్న తర్వాత ఆ మంటలను ఆర్పివేయాలన్నారు.బీడీలు, చుట్టలు తాగే అలవాటు ఉన్నవారు వాటిని తాగి నిర్లక్ష్యంగా అడవిలో పడేయవద్దని కోరారు.అడవి కాలిపోతే ఎంతో నష్టమని, దీనిని అందరూ గమనించి అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు.
వరంగల్ ములుగు రోడ్ లోని పైడిపల్లి వద్ద గల వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలోని వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. కళాశాలలోని ఓ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. మృతురాలి స్వస్థలం నల్గొండ జిల్లా. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఇక్కడ నడుస్తున్న వ్యవసాయ కళాశాలలో కొంతకాలంగా ర్యాంగింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్లు ర్యాంగింగ్కు పాల్పడుతున్నారని గతంలోనే విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పగా వారు నచ్చజెప్పి తిరిగి కాలేజీకి పంపినట్లు సమాచారం. ఈక్రమంలోనే ఇవాళ బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. మరోపక్క ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు కూడా కారణమని తెలుస్తుంది. ఏనుమాముల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహా శివరాత్రి వేళ రాష్ట్రంలో ఘోర ప్రమాదం.. గర్భిణీ సహా ఇద్దరు స్పాట్ డెడ్
జహీరాబాద్. నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేర లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా అంతారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. భార్య శోభన గర్భిణి కావడంతో తల్లి లక్ష్మితో కలిసి రవి అనే వ్యక్తి బైకుపై ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా ఘటన జరిగిందని పోలీసులు నిర్ధారించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఇటీవలే సంగారెడ్డికి చెందిన జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి కుటుంబం కుంభమేళాకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. వారణాసి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురూ అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మరువక ముందే సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడం కలకలం రేపుతోంది.
రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకులకు.. ఎమ్మెల్యే నివాళి
దేవరకద్ర/ నేటి ధాత్రి.
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన యువకులు చరణ్ రెడ్డి, అనిల్ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మంగళవారం చరణ్ రెడ్డి, అనిల్ భౌతిక దేహాలకు ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడం బాధాకరం అన్నారు. నివాళులర్పించిన వారిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
-చిట్ ఎత్తినా నెలల తరబడి తిప్పించుకుంటాం..ఇది పాత మాట.
-చిట్టేసిన వాళ్లకు ఫ్లాట్లే ఇస్తాం..ఇది కొత్త మాట.
-ఇలా కూడా చీట్ చేస్తాం!
-హైడ్రా నుంచి తప్పించుకునేందుకు నయా వ్యాపారం!
-అమాయక కస్టమర్లను ఇలా కూడా ముంచేస్తాం.
-కస్టమర్లకు అమ్మేసి చేతులు దులిపేసుకుందాం.
-కేసుల నుంచి తప్పించుకుందాం..
-చిట్ అమౌంట్ ఇవ్వలేం…
-కావాలంటే ఫ్లాట్లు ఇస్తాం..
-చిట్ ఫండ్ వెంచర్ ఫ్లాట్లు అంటకడతాం?
-ఆలోచించుకోండి…మీ ఇష్టం!
-ఎలాగైనా వదిలించుకునేందుకు కొత్త ఎత్తుగడలు.
-అడ్డికి పావుసేరుకైనా అంటగట్టడమే!
హైదరాబాద్,నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా దెబ్బకు కొన్ని చిట్‌ఫండ్ కంపనీలు విలవిలలాడిపోతున్నాయి. చిట్ ఫండ్ సంస్ధల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హైడ్రాకు చిట్‌పండ్ కంపనీలకు సంబంధం ఏమిటా? అన్న అనుమానం కల్గుతోందా? ఇక్కడే వుంది అసలు తిరకాసు. హైడ్రా తెరమీదకు రావడంతో చిట్‌ఫండ్ సంస్ధల మోసాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణలో చాల వరకు చిట్ ఫండ్ కంపనీలు రియల్ వ్యాపారం పెద్దఎత్తున చేశాయి. కొన్ని సంస్ధలు సంయుక్తంగా చేస్తే, కొన్ని పెద్ద సంస్ధలు సొంతంగా పెద్దఎత్తున రియల్ వ్యాపారం సాగించాయి. అయితే చిట్ ఫండ్ సంస్థలు పెట్టిన పెట్టుబడి మొత్తం చిట్ దారుల నుంచి వసూలు చేసిన డబ్బులే కావడం గమనార్హం. అయితే లోగుట్టులో కొన్ని ఆసక్తికరమైన అంశాలుంటాయి. గతంలో చిట్‌ఫండ్‌లు చిట్ వేసిన వారికాల పరిమిత పూర్తయిన తర్వాత వచ్చే ఎక మొత్తం సొమ్మును వారికి ఇవ్వకుండా వారిని ఒప్పించి, మెప్పించి, లేని పోని ఆశలు కల్పించి, అధిక వడ్డీ ఎర వేసి, ఆ సొమ్మును డిపాజిట్లు తిరిగి అవే సంస్ధలు తీసుకునేవి. చిట్స్ అండ్ ఫైనాన్స్ అనే లెక్కతో చిట్లు వేసిన వారిని పెద్దఎత్తున ప్రజల సొమ్మును డిపాజిట్లుగా మల్చుకునేవారు. అయితే కాల క్రమేనా ప్రజల్లో కొంత చైతన్యం వచ్చి డిపాజిట్లకు అంగీకరించడం మానుకున్నారు. చిట్స్ అండ్ ఫైనాన్స్‌ల పేరుతో డిపాజిట్లు సేకరించడాన్ని ఆర్బీఐ తప్పుపట్టింది. వాటికి ఆ అర్హత లేదని తేల్చిచెప్పింది. దాంతో చిట్స్ కంపనీలు రియల్ వ్యాపారం బాట పట్టాయి. ఒక వేళ చిట్స్ నిబందనలు అతిక్రమిస్తే క్రిమినల్ చర్యలుంటాయని హెచ్చరించింది. దాంతో కొత్త మార్గం వెతుకున్నారు. ఇంతలో తెలంగాణలోనే దేశ వ్యాప్తంగా రియల్ వ్యాపారం పెరిగింది. ఒక దశలో ఉచ్చ దశకు చేరుకున్నది. ఆ సందర్భంలో ఇదే చిట్టి దారుల నుంచి చిట్స్‌కు చేరే సొమ్ముతో నగర శివారుల్లో వుండే రైతుల భూములను తక్కువ ధరకు పెద్దఎత్తున సేకరించుకొని పెట్టుకున్నారు. ప్రజల సొమ్మంతా అక్కడ పెట్టుబడి పెట్టారు. భూమి మీద పెడితే ఎప్పటికైనా మేలుతోపాటు, మరింత లాభమే తప్ప నష్టం వుండదు. రూపాయికి వేయి రూపాయలు లాభం వస్తుందన్న బలమైన నమ్మకం కూడా వుంది. అందుకే తెలంగాణలో అసలు సాగుకు కూడా పనికి రావనుకున్న భూమలన్నీ నివాస యోగ్యాలుగా మార్చే వ్యాపారం పెద్దఎత్తున మొదలైంది. దాంతో అత్యాశకు పోయిన కొన్ని చిట్ ఫండ్ కంపనీలు భూములు కొనుగోలు చేయడం, ఖాతాదారులకు సొమ్ము ఇవ్వకుండా, స్ధిరాస్ధుల పేరుతో వారి వెంచర్లలో ప్లాట్లు అంటగట్టడం మొదలు పెట్టారు. డబ్బులు అత్యవసరమైన వాళ్లు తప్ప, మిగతా వాళ్లంతా ప్లాట్లకు చిట్స్‌నుంచి వచ్చే సొమ్ముకు అదనంగా మరింత జత చేసి మరీ ప్లాట్లు కొన్నవాళ్లు కొన్ని లక్షల మంది వున్నారు. అలా మూడు చిట్లు, ఆరు ప్లాట్లుగా సాగుతున్న వ్యాపారాన్ని మరింత మరింత విస్తరించుకోవాలన్న ఆశతో చిట్స్ కంపనీలు విచ్చలవిడిగా భూములు కొనుగోలు చేశారు. అందులో చెరువు భూములున్నాయి. శిఖం భూములున్నాయి. అసైండ్ భూములు కూడ వున్నాయి. చిట్స్ కంపనీలు రైతులనుంచి నేరుగా సేకరించిన భూములతోపాటు వాటికి ఆనుకొని వున్న అసైండ్ భూములు, శిఖం భూములును కూడా మింగేశారు. రెవిన్యూ అధికారులతో కలిసి, రిజిస్ట్రార్ల్‌ను మేనేజ్ చేసుకొని ఎకరాల కొద్ది భూములను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప్లాట్లు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. అయితే ఇలా అమ్మగా చిట్స్ ఆస్ధులుగా భవిష్యత్తులో కూడా ఖాతాదారులు ముడిపెట్టేందుకు ఇంకా కొన్ని వేల ఎకరాల భూములు చిట్స్ కంపనీల చేతుల్లో వున్నాయి.
ఇప్పుడు అనుకోకుండా హైడ్రా వచ్చి పడిరది. ఏం చేయాలో పాలుపోని చిట్స్ కంపనీలు ఆ భూములను ఎలాగైనా వదిలించుకొని,ఖాతాదారులకు కట్టబెడుతున్నారు. ఒకప్పుడు రూపాయి కూడా తక్కువ ఇచ్చేది లేదంటూ చిట్స్ సొమ్ముకు తోడు లక్షలకు లక్షలు వసూలు చేసిన కంపనీలు ఇప్పుడు ఆ ప్లాట్లను అడ్డికిపావుసేరుకు అమ్మకాలు సాగిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఈ తతంగాలు సాగిస్తున్నారు. హైడ్రా వచ్చిన తర్వాత నిజానికి రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయని అందరూ అనుకున్నారు. కాని రిజిస్ట్రేషన్లు ఆగిపోలేదు. కారణం అమాయకులైన ప్రజలను ఇలా చిట్స్ కంపనీలు మోసం చేస్తున్నాయి. సహజంగా చిట్టి ఎత్తుకున్న తర్వాత ఏ ఖాతాదారుడికైన కంపనీలు మూడు నెలలలోపు ఆ సొమ్ము ఇవ్వదు. కొన్ని కంపనీలైతే అన్ని సక్రమంగా వున్నా ఆరు నెలలకు కూడా సొమ్ములు ఇవ్వవు. ఇలాంటి సమయంలో చిట్స్ కంపనీలు ఖాతాదారులను రకరకాల ప్రలోభాలకు గురి చేస్తాదు. అందులో ప్లాట్ల దందా ఒకటి. అయితే ఇటీవల చిట్టిలు ఎత్తుకున్న వారికి సొమ్ము ఇవ్వడం కుదరని కంపనీలు తెల్చి చెబుతున్నాయి. కంపనీల్లో సొమ్ములేదని, ఆసొమ్మంతా ఖాతాదారుల మేలు కోసమే భూమి మీద పెట్టుబడి పెట్టామని నమ్మిస్తున్నారు. చిట్టిని బట్టి భూమిని కేటాయిస్తామే తప్ప, సొమ్ములు చేతుల్లో లేవని తేల్చిచెబుతున్నారు. దాంతో ఖాతాదారులు తప్పని పరిస్దితుల్లో ప్లాట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఆ భూములన్నీ అన్ని సక్రమంగానే వున్నట్లు మాయ చేస్తున్నారు. ఖాతాదారులను మభ్యపెడుతున్నారు. రిజిస్ట్రేషన్లు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అలా చకచకా సాగుతున్న రిజిస్ట్రేషన్లలో అన్నీ ఇలాంటివే అన్న నిజాలు వెలుగు చూస్తున్నాయి. కంపనీల్లో సొమ్ము లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి! అని తెల్చి చెబుతుండడంతో, దిక్కు తోచక ఖాతాదారులు ప్లాట్లు తీసుకుంటున్నారు. కాని కొంత కాలానికి తాము పూర్తిగా మోసపోయామని తెలిస్తే వారి పరిస్ధితి ఏమిటన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఏటా కొన్ని వందల చిట్ కంపనీలు బోర్డులు తిప్పేస్తూనే వున్నా, ప్రజల బలహీనతలను ఆసరా చేసుకొని కొత్త కొత్త కంపనీలు పుట్టుకొస్తూనే వున్నాయి. వ్యాపారం విస్తరించుకుంటూనే వున్నాయి. ఖాతాదారులు సొమ్ముతో రియల్ వ్యాపారం సాగిస్తూనే వున్నాయి. అయితే గతం వేరు. ఇప్పుడు వేరు. గతంలో ఖాతాదారులకు చిట్స్ కంపనీలు అంట గట్టిన ప్లాట్లలో కూడా ఏవి నిజమైనవి? ఏవి చెరువుల్లో వున్నవి అన్నవి కూడా కొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఇప్పటికే మోసపోయిన వాళ్లు తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది వున్నారు. ఇంత జరుగుతున్నా చిట్స్ కంపనీలు ఇంకా మోసం చేస్తూనే వున్నాయి. ప్రభుత్వం వెంటనే మేలుకొని ఇలాంటి మోసాలపై ప్రజలను అప్రమత్తంగా వుండాలని హెచ్చరించాల్సిన అవసరం వుంది. ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత వుంది. లేకుంటే ప్రజలు ఇంకా నష్టపోవాల్సివుంటుంది. తర్వాత బుల్లోజర్లు వచ్చి, ప్లాట్లు స్వాదీనం చేసుకుంటే ప్రజలు లబోదిబోమనక తప్పదు. అయితే వున్న భూములను ఇప్పుడే అమ్మేస్తే తమకు చేతులకు మట్టి అంట కుండా వుంటుంది. కేసుల బారిన పడుకుండా జాగ్రత్తపడొచ్చని చిట్స్ కంపనీలు ఈ ఎత్తుగడ వేశాయి. ఒక వేళ హైడ్రా ఆ భూములను ఇప్పుడే స్వాధీనం చేసుకుంటే చిట్స్ వ్యాపారాలు కుప్పకూలిపోతాయి.
పైగా భూమ్మీద పెట్టిన సొమ్ముంతా చెరువు పాలౌతుంది. ప్రజలకు ఇవ్వాల్సిన సొమ్ములేదని చేతులెత్తేయాల్సి వస్తుంది. అయితే ప్రజల సొమ్ముతో అక్రమ వ్యాపారం చేసినందుకు కేసులు ఎదుర్కొవాల్సి వస్తుంది. చిట్స్ వ్యాపారంలో మోసపోయామంటే చెల్లుతుంది. కాని ఖాతాదారుల అనుమతి లేకుండా వారి సొమ్ము వారికి తెలియకుండా భూ వ్యాపారం చేసి లాభాలు గడిరచి, ఇప్పుడు నష్టపోయామని చెబితే చట్టం నమ్మదు. న్యాయస్ధానం ఒప్పుకోదు. ఇలాంటి కేసుల్లో ఐపి పెట్టడానికి కూడా అవకాశం వుండదు. అక్రమంగా అసైండ్ భూములు కొనుగోలు చేయడం నేరమని తెలిసి ఎలా కొనుగోలు చేశారన్నది తెరమీదకు వస్తుంది. ఏ రకంగా చూసినా చిట్స్ వ్యాపారులకు ముందునుయ్యి, వెనకు గొయ్యిగా మారుతుంది. ఆ ఉప ద్రవం నుంచి తప్పించుకోవడానికి గుట్టు చప్పుడు కాకుండా, అమాయకులైన ఖాతాదారులకు చిట్స్ కంపనీలు కుచ్చు టోపి పెడుతున్నారు. హైడ్రా వచ్చినప్పుడు వాళ్లే ఎదురుతిరుగుతారు. అంతే కాకుండా హైడ్రాకు ఎదురు తిరిగితే కేసులు నమోదు చేస్తారని భయపడి సైలెంటుగా వుంటారు. ఏది జరిగినా మళ్లీ చిట్ కంపనీలకే లాభం… అందుకే చిట్స్ కంపనీలు ఈ దురాగతానికి ఒడిగట్టాయి. ప్రజలారా..తొందరపడి చిట్ కంపనీలు అగ్గువకు ప్లాట్లు ఇస్తున్నారని మోసం పోకండి. వాటిని తీసుకోకండి.
`ఇలాంటి మోసగాళ్ల వల్ల కుల వృత్తి వదలి కూలీ చేసుకుంటున్నారు.
`బంగారం దుకాణాల పేరుతో తెలంగాణ కులవృత్తి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు.
`కంసాలీలంతా ఏకమైతే ఇలాంటి మోసగాళ్లను తరిమేడం పెద్ద లెక్క కాదు!
`ప్రజలారా! తస్మాత్ జాగ్రత్త!
హైదరాబాద్,నేటిధాత్రి:
తియ్యని మాటల వెనుక చేదుగుళికలుంటాయి. నవ్వుతూ మాట్లాడే మాటల వెనుక గోతులుంటాయంటారు. లలిత జ్యూవెర్లర్ అధినేత చెప్పే మాటల్లో కూడా నిజం ఆవగింజంత కూడా లేదని తెలుస్తోంది? డబ్బులు ఊరికే రావు అంటూ ఆయన ఇచ్చే బంగారంలో స్వచ్ఛత ఎంత అన్నదానిపై స్పష్టత ఎవరివ్వాలి? ప్రకటనలు ఇస్తున్నారు కదా? అని మీడియా కూడా నిజనిజాలు నిగ్గు లేల్చకపోవడం బాదాకరం. ప్రభుత్వాలు కూడా వ్యాపార వేత్తలను ప్రోత్సహించే పేరుతో దోపిడీ దారులకు కొమ్ము కాయడం కూడా సరైంది కాదు. సామాన్యుడి దగ్గర నుంచి ఉన్నత స్ధాయి వరకు ప్రతి వ్యక్తి ప్రతి వస్తువుకు జిఎస్టీ చెల్లిస్తున్నారు. సంపన్నులు, ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయంకు పైబడి వున్న వారంతా ఇన్‌కమ్ టాక్స్ కడుతున్నారు. అయితే ఎంత మంది వ్యాపారులు డబ్బులు ఎగవేత దారుల్లో వున్నారో తెలియంది కాదు. వ్యాపారం పేరుతో ఏ వ్యక్తి తన సొంత సంపాదనలను పెట్టుబడులుగా పెట్టరు. అది చిన్న వ్యాపారమైనా, పెద్ద వ్యాపారమైన సరే బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటారు. దాంతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంటారు. సహజంగా బ్యాంకులో పది లక్షలు వుంటేనే ఇన్‌కమ్ ట్యాక్స్ అదికారులు నోటీసులు ఇస్తున్న ఈ సమయంలో వేల కోట్ల ఆదాయాలున్నవారు, పన్నులు ఎగ్గొడుతుంటే చూస్తూ వుంటున్నారని చెప్పడానికి లలిత జెవెల్లరీ షాపులే నిదర్శనం. ప్రజల నుంచి జీఎస్టీ రూపంలో వసూలు చేసిన సొమ్మును ప్రభుత్వానికి చెల్లించకుండా, మోసం చేయడం, వాటిని తిరిగి పెట్టుబడిగా పెట్టి, వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం అలవాటు చేసుకుంటున్నారు. మాటలు మాత్రం ఈ అదినేత చాలా గొప్పగా చెబుతుంటారు. అయితే ఇటీవల విజయవాడ నీట మునిగింది. ప్రజలకు సహాయసహాకారాల కోసం లలిత జెవెల్లర్స్ అధినేత కిరణ్‌కుమార్ కోటి రూపాయలు ప్రభుత్వానికి అందజేశారు. కాని అందులో టాక్స్ బెనిఫిట్స్ దాగి వుంటాయన్న సంగతి సామాన్యులకు తెలియదు. కాని విరాళం ఇస్తూనే మరో వైపు ప్రచారాస్త్రంగా దానిని వాడుకున్నాడు.. ప్రజల మీద అత్యంత ప్రేమను చూపించినట్లు నటిస్తుంటాడు. సహజంగా ఏ బంగారం దుకాణంలోనైనా ఇంతకు ముందు ప్రజలు కొనుగోలు చేస్తే దానిపై సదరు ప్రాంత వ్యక్తులపై అత్యంత నమ్మకం వుండేది. ఆ బంగారం అవసరం మేరకు అమ్మకాలు చేసుకున్నా, తిరిగి డబ్బు చేతికి వచ్చేది. ఎప్పుడైతే లలిత జెవెల్లర్స్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో బంగారు నగల వ్యాపారం మొదలు పెట్టారో అప్పటి నుంచి కంసాలి వృత్తి దారులకు తీరని నష్టం ఎదురౌతోంది. ఇలాంటి సంస్ధల మూలంగా తెలంగాణలో కంసాలి కుల వృత్తిని తరరాలుగా నమ్ముకున్న వాళ్లంతా కూలీలుగా మారిపోయారు. వారి వృత్తిని కోల్పోయి రోడ్డున పడ్డారు. బంగారు నగల వ్యాపారుల ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల మోడళ్ల పేరుతో తయారు చేసే నగలలో ఎంత నాణ్యత అన్నది చెప్పడం కష్టం. గతంలో సోమాజిగూడ లలిత షోరూంలో నాణ్యత లేని బంగారం విక్రయించినట్లు కూడా పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. కాని ఆ కేసు ఏమైందన్నది ఎవరికీ తెలియదు. పెద్ద పెద్ద వ్యాపార సంస్ధలు ఇలా మోసాలు చేసినా, బైటకు రావు.
తాను మాత్రం చేతిలో కనీసం గ్రాము బంగారు వస్తువు కూడా ధరించరు. కాని ప్రజల చేత బంగారం కొనుగోలు చేయండి. అంటూ నిత్యం వ్యాపార ప్రకటనలతో కిరణ్‌కుమార్ ఊదరగొడుతుంటాడు. బంగారాన్ని ప్రజలకు పెట్టుబడిగా ప్రచారం చేస్తాడు. బంగారం ధర తగ్గిందని కొనుగోలు చేయంటాడు. బంగారం కిలో కోటి రూపాయలకు చేరుతుందని భయపెడుతుంటాడు. బంగారం ధర నిర్ణయించేది ప్రభుత్వం. కాని ఎప్పటిప్పుడు యూట్యూట్ ఛానళ్లకు వచ్చి, బంగారం ఎందుకు కొనాలి? బంగారం మీద ప్రజలు ఎలా పెట్టుబడి పెట్టాలి? బంగారం భవిష్యత్తులో ఎలా పెరుగుతుంది? అంటూ చెప్పి ప్రజలకు ఆశలు కల్పిసాడు. సహజంగా ఇంట్లో రూపాయి వుంటే దానిని పొదుపు చేసుకువారిని బంగారం కొనుగోలు వైపు ఆలోచనలు మళ్లిస్తాడు. గతంలో కూడా అనేక బంగారు దుకాణాలు వున్నాయి. కాని వాటి యజమానులు ఇలా ప్రజలను మభ్యపెట్టేలా స్వయంగా వాళ్లే ప్రచారం చేసుకోలేదు. తమ సంస్దల ప్రకటనలు మాత్రమే చేసుకుంటారు. కాని ఒక్క లలిత జెవెల్లర్స్ అధినేత మాత్రమే బంగారంపై నిత్యం ప్రజల్లో భ్రమలు కల్పిస్తారు. ప్రజలను బురిడీ కొట్టిస్తాడు. బంగారంపై లేని పోని ప్రకనటలు చేస్తుంటాడు. కేవలం తన వ్యాపారం కోసం ప్రజలకు మాయ మాటలు చెబుతుంటాడు. వ్యాపార పరంగా తన సంస్ధలో బంగారం కొనుగోలు చేయమని చెప్పడం ఒక పద్దతి. కాని ఆయన మాత్రం మా షాపులో మాత్రమే ఎందుకు కొనాలో అంటూ లేని పోని అపోహలు సృష్టిస్తాడు. నిజానికి బంగారంలో ఎంత ఇతర ఇతర లోహాలు కలుపుతారో అందరికీ తెలుసు. కాని వన్ గ్రామ్ బంగారు నగల పేరుతో లలిత జువెల్లర్స్ చేస్తున్న మోసాలపై ప్రజలు అప్పట్లో బాగానే నిలదీశారు. పేరుకు వన్ గ్రామ్ అంటూ అమ్మే వస్తువులు భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి ఉపయోగం వుండదు.
సంపన్నులు ఒకేసారి ఎంత బంగారం కొన్నా వ్యాపారులకు లాభాలు వుండవు. కాని వన్ గ్రామ్ పేరుతో పెద్దఎత్తున బంగారు నగలపై ఆశలు కల్పించి అమ్మకాలు సాగించడం వ్యాపారంలో పెద్ద మోసం. మహిళలకు సహజంగా బంగారం అంటే ఎంతో ఇష్టం. అయితే సామాన్యులు తులం బంగారం కొనుగోలు చేయాలంటే ఈ రోజుల్లో సాద్యం కాదు. దాంతో వారికి బంగారం మీద ఆశలు తీరక జీవితంలో ఏదో వెలితితో వుంటారు. అలాంటి వారిని పెద్దఎత్తున ఆకర్షించి వన్ గ్రామ్ బంగారం పేరుతో నగల తయారు చేయించి, అమ్మకాలు సాగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తులం బంగారు నగలనే కరిగిస్తే వచ్చేది ఎంతో ప్రజలందకీ తెలుసు. నగల్లో తరుగు ఎంత పోతుందో తెలియంది కాదు. పెద్దపెద్ద షాపులు ఏర్పాటు చేసుకొని, రంగురంగుల లైట్లు, అంతస్ధుల మేడల్లో బంగారుదుకాణాలు పెట్టుకునేవారు వన్ గ్రామ్ బంగారు నగలు ఎందుకు అమ్ముతున్నారన్నది ఎవరూ ఆలోచించడం లేదు. పది వేలు పెట్టి వన్ గ్రామ్ బంగారు నగ కొనుగోలు చేస్తే వచ్చే లాభం ఏమీవుండదు. ఏదైనా అసరం కోసం ఆ నగ తాకట్టు పెడదామన్నా ఎవరూ తీసుకోరు. అదే సంస్ద ఆ నగను తీసుకొని డబ్బులు ఇవ్వదు. అంటే డబ్బులు ఊరికే రావంటూ ఊదరగొట్టి జనం సొమ్మును లూటీ చేయడం తప్ప ఏమీ వుండదు. ఇందులో వున్న మర్మం తెలియన వాళ్లు చాలా మంది మోస పోతున్నారు. ఇది వరకు రోల్డ్ గోల్డ్ నగలు తక్కువ ధరకు ఖరీదు చేసుకునే మహిళలు వన్ గ్రామ్ బంగారం కోసం అప్పులు చేసి మరీ కొనుగోలు చేసుకుంటున్నారు. బంగారం ధరలు పెరుగుతున్నాయంటే ఎగబడి కొంటున్నారు. అసలు సిసలైన బంగారం షాపుల్లో వన్ గ్రామ్ బంగారు నగలు అందుబాటులో వుండవు. సామాన్యులకు సైతం బంగారు నగలు అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రచారం చేసుకునే షాపుల్లో మాత్రమే ఇలాంటి మోసాలు పెద్దఎత్తున జరుగుతుంటాయి. బంగారం పేరుతో షాపులోకి వచ్చిన వారెవరూ తిరిగి డబ్బులతో ఇంటికి వెళ్లకుండా వారి జేబులు ఖాళీ చేయించడంలో లలిత జువెల్లరీ ఆరితేరిపోయింది. అందుకే ఊరికో షాపు వెలుస్తోంది. కొన్ని దశాబ్థాలుగా బం గారం వ్యాపారం చేస్తున్న పెద్ద సెద్ద సంస్థలు కూడా ఇన్నిన్ని షాపులను ఎందుకు ఏర్పాటు చేయలేపోతున్నాయి. ఒకసారి బంగారు వస్తువు వన్ గ్రామ్‌పేరతో కొనుగోలు చేసిన వాళ్లు మోసపోయామని షాపుకు వచ్చి చెప్పుకున్నా, ఇంత కాలం పెట్టుకోవడం వల్ల అరిగిపోయింది. తరిగిపోయిందని సమాదానం చెప్పే అవకాశం లతిత జెవెల్లర్స్‌లో వుంటుంది. అందుకే ప్రజలను డబ్బులు ఊరికే రావంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాడు. షాపుల మీద షాపులు పెంచుకుంటూ పోతున్నాడు. మరో వైపు ప్రభుత్వానికి జిఎస్సీలు ఎగ్గొడుతున్నాడు. ఏ వ్యాపారం చేసినా సామాన్యులే టార్గెట్‌గా సంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. సరిగ్గా ఓ రెండు దశాబ్దాల క్రితం వరకు కూడా ఇలాంటి బరితెగించిన వ్యాపారం ఎక్కడా లేదు. మరి ప్రజలు ఇప్పటికన్నా పాత కాలంలోనే ఎక్కువ బంగారు నగలు విరివిగా వాడుకునేవారు. ప్రతి మహిళ మెడలో బంగారుగుండ్లు వుండేవి. కాని ఇలాంటి వ్యాపారుల మూలంగా కంసాలిలు మునిగిపోయారు. ప్రజలు మోసపోతున్నారు. వ్యాపారులు వేల కోట్లు సంపాదిస్తున్నారు. అందర్ని బురిడీ కొట్టిస్తున్నారు.
మంగళవారం రాత్రి మెట్‌పల్లి పట్టణంలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. తన సోదరితో కలిసి కిరాణా దుకాణానికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దినసరి కూలీలు రాజు, లక్ష్మి తమ పిల్లలు అమ్ములు, శివతో కలిసి దుబ్బవాడలో ఉంటున్నారు.
అమ్ములు, శివ కిరాణా దుకాణానికి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి వారిని ఆపి చాక్లెట్లు కొనివ్వమని యువతికి రూ.20 ఇచ్చాడు. ఆమె దుకాణానికి వెళ్లగా అతడు బాలుడితో కలిసి పారిపోయాడు.
బాలుడి కోసం స్థానికులు వెతకగా, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
5 ఇల్లు, 6 ఓపెన్ ప్లాట్స్, 3 ఎకరాల వ్యవసాయ భూమి ప్రభుత్వ విలువ ప్రకారమే సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఆస్తులు రూ. 2.94 కోట్ల రూపాయలు గా గుర్తించిన ఏసీబీ అధికారులు. మార్కెట్ విలువ వీటికి 10 రెట్లు ఎక్కువ.
నాసిరకం తో అంతా పగుళ్లు నేటికీ డిగ్రీ కళాశాల పరిస్థితి.
అవినీతితో కూర్కపోయి అసంపూర్తి లో డిగ్రీ కళాశాల భవనం,
పనులు పూర్తికాకముందే ఇంజనీరింగ్ అధికారి సంతకం లేకుండానే హ్యాండ్ ఓవర్ చేసిన కాంట్రాక్టర్.
భవన నిర్మాణానికి విద్యుత్ హైవే లైన్ ఆటంకం ఉందని హైవే లైన్ పక్కకు అమర్చడంలో ఆరు లక్షల ఖర్చు చూపెట్టి చేతులు దులుపుకున్న కాంట్రాక్టర్.
పనుల అసంపూర్తి నాసిరకం పై 2019 లొ కలెక్టర్ మరియు కమిషనర్లకు దరఖాస్తు పెట్టిన ఫలితం శూన్యం.
రాష్ట్ర ప్రభుత్వం ఐటీ మంత్రి తక్షణమే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని డిగ్రీ కళాశాలకు నిధులు మంజూరు చేయాల్సిన అవసరం.
మహాదేవపూర్ -నేటి ధాత్రి;
మారుమూల ప్రాంతంలో డిగ్రీ కళాశాల అనేక సంవత్సరాలు విద్యార్థుల కలగావుండి ఇంటర్ విద్యాభ్యాసం అనంతరం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించిన విద్యార్థులు పట్టణ ప్రాంతాలకు పరిమితం కావడం ఇలాంటి పరిస్థితులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008 నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన విద్యార్థులకు డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అనుమతులంది అదే సంవత్సరం డిగ్రీ విద్యాభ్యాసం ప్రారంభించడం జరిగింది. ఇలా 2008 నుండి ప్రభుత్వ ఇంటర్ జూనియర్ కళాశాలలో అనేక సంవత్సరాలు విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ మండలాలకు సంబంధించిన డిగ్రీ విద్యార్థులు ప్రారంభ దశలో 500కు పైగా అడ్మిషన్లు పొంది విద్యాభ్యాసం కొనసాగిస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలకు గాను కొత్త డిగ్రీ కళాశాల భవనాలకు నిర్మాణం చేపట్టుటకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్న మహదేపూర్ నువ్వు కూడా డిగ్రీ కళాశాల జి ప్లస్ వన్ భవన నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా రెండు కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నూతన జి ప్లస్ భవనాన్ని డిగ్రీ కళాశాలకు మంజూరు చేసిన విషయాన్ని తెలుసుకున్న ఐదు మండలాలకు సంబంధించిన విద్యార్థినీ విద్యార్థులు తమకు కొత్త కళాశాల భవనము మంజూరై కొద్ది రోజుల్లో తాము నూతన జి ప్లస్ వసతులతో కలిగిన కళాశాలలో విద్యాభ్యాసిస్తామని ఎంతో సంతోష పడడం జరిగింది. కానీ జి ప్లస్ కళాశాల కేవలం పేరుకి పరిమితమై నేటికి అసంపూర్తి నాసిరకంతో 30% కళాశాల గదులను నిర్మాణం చేయకుండానే వదిలివేసిన దుస్థితి నేడు.
రెండు కోట్ల కళాశాల భవనం,మూడు రోజుల ముచ్చటగా మారిన వైనం.
2016లో తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా డిగ్రీ కళాశాల భవనాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇదే క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న మహాదేవపూర్ మండల కేంద్రంలో గత తొమ్మిది సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల విద్యార్థులు తరగతి గదుల లేక అనేక ఇబ్బందులకు గురవుతూ స్థానికంగా ఉన్న జూనియర్ కళాశాలలో డిగ్రీ తరగతులు నిర్వహిస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల 25 లక్షలు మంజూరు చేస్తూ జి ప్లస్ భవనానికి నిధులు కేటాయించి టి ఎస్ ఈ డబ్ల్యూ డి సి విభాగానికి అందించడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ శాఖ అది సంవత్సరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేటాయించిన ఐదు ఎకరాల భూమిలో జి ప్లస్ వన్ భవనానికి నిర్మాణం కొరకు టెండర్ పిలిచి కాంట్రాక్టర్కు అప్పజెప్పడం జరిగింది. 2016లో ప్రారంభమైన డిగ్రీ జి ప్లస్ వన్ భవనం నేటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అసంపూర్తిగానే మిగిలిపోయి ఉంది. నాలుగు సంవత్సరాలు భవన నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ ఇప్పటికీ ప్రధాన ల్యాబ్ లాంటి భూములను నిర్మించకుండానే కాంట్రాక్టర్ బిల్లులు దండుకోవడం నేటికీ విద్యార్థులకు జి ప్లస్ వన్ కలగానే మిగిలిపోయింది. అసంపూర్తి భవనమే కాకుండా నాలుగు సంవత్సరాల పాటు కాంట్రాక్టర్ చేపట్టిన పనులన్నీ నాసిరకంగా చేయడం వలన ప్రస్తుత మాదాపూర్ డిగ్రీ కళాశాల భవనం గడిని తలపిస్తుంది. కానీ కాంట్రాక్టర్ మాత్రం పనులు పూర్తి చేసినట్లు హ్యాండ్ ఓవర్ ఇచ్చి చేతులు దులుపుకోవడం విశేషం.
నాసిరకం తో అంతా పగుళ్లు నేటికీ డిగ్రీ కళాశాల పరిస్థితి.
2.25 కోట్లతో నిర్మించిన డిగ్రీ కళాశాల జి ప్లస్ భవనం బలవంతంగా నిర్మాణంలో సంవత్సరాలుగా జాప్యం మరోవైపు విద్యార్థులకు తరగతి గదులు అందుబాటులో లేక అనేక ఇబ్బందులు మంచినీరు మలవిసర్జన లాంటి సమస్యలు తలెత్తుతున్న క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ 2019 జూన్ 26వ తేదీన కళాశాల నూతన భవనంలో ప్రముఖులు చేయకుండానే గత్యంతరం లేక సాదాసీదాగా అప్పటినుంచి పాల్ విద్యార్థులచే నూతన భవనంలో ప్రవేశించి తరగతులను ప్రారంభించడం జరిగింది. ఇక గత ఐదు సంవత్సరాల నుండి డిగ్రీ కళాశాల జి ప్లస్ వన్ నూతన భవనంలో కొనసాగుతున్నప్పటికీ నేటికీ సంపూర్ణ తరగతి గదులు లేకపోవడం ఇప్పటికీ విద్యార్థులకు పరిశోధన కంప్యూటర్ లాంటి ల్యాబ్ లకు ఇబ్బంది పడక తప్పడం లేదు. మరో ప్రధాన విషయం ఏమిటంటే నిర్మించిన కళాశాల పూర్తిస్థాయి నాసిరకం పనులు చేపట్టడానికి ప్రస్తుత కళాశాలలో అనేక సాక్షాలు దర్శనమిచ్చే పరిస్థితి ఒకవైపు అసంపూర్తిగా ఉన్న తరగతి గదులతో పాటు కళాశాల లోని తరగతి గదులు గోడలు వరండాలు పరిచిన శభాష్ బండ పగుళ్ళతో బయటికి రావడం కళాశాల తరగతి గదుల ముందు కార్పెట్ లేదా శభాష్ బండకు బదులు సిమెంట్ తో ఫినిషింగ్ చేయడం వలన పూర్తిగా సిమెంట్ ఫినిషింగ్ చెడిపోయి బయటికి వచ్చి నడిచే పరిస్థితి లేకుండా ఉంది. వర్షాకాలంలో పై కప్పు కూడా పదులు వచ్చి గోడల వరకు నీళ్లు రావడం తో విద్యార్థులు కాస్త గందరగోళ పరిస్థితి కూడా ఎదురుకోవడం జరుగుతుంది. మారుమూల ప్రాంతంలో పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో రెండు కోట్ల 25 లక్షల రూపాయల నిధులను కేటాయించి అన్ని వసతులతో విద్యార్థులకు కళాశాల అందుబాటులోకి తీసుకు వచ్చే విధంగా నిధులు మంజూరు చేస్తే తూతూ మంత్రంగా నిర్మాణం చేపట్టి నాసిరకం పనులు నిర్వహించి నిధులు సరిపోలేదని అర్ధాంతరంగా నిర్మాణం పూర్తి చేయకుండానే వదిలివేసి కాంట్రాక్టర్ చేతులు దులుపుకోవడం జరిగింది.
అవినీతితో కూర్కపోయి అసంపూర్తి లో డిగ్రీ కళాశాల భవనం,
2016 17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మహదేవ్పూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రెండు కోట్ల 25 లక్షల రూపాయల నిధులను జి ప్లస్ వన్ భవనా నిర్మాణానికి మంజూరు చేసి జిల్లా కలెక్టర్ సత్వర పనులకు పూర్తి చేసి విద్యార్థుల కు తక్షణ మే విద్యాభ్యాసం కొరకు అలవాటులోకి తీసుకురావాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. వండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ 2016 17 ఆర్థిక సంవత్సరంలో పనులను ప్రారంభించిన సదురు కాంట్రాక్టర్ 9 సంవత్సరాల కాలం పూర్తి అయినప్పటికీ కూడా డిగ్రీ కళాశాల నేటికీ అసంపూర్తిగానే వదిలేయడం జరిగింది. నేడు సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న క్రమంలో జి ప్లస్ వన్ డిగ్రీ కళాశాల భవనంలో కంప్యూటర్ ల్యాబ్ ఎన్సిసి తోపాటు స్పోర్ట్స్ తరగతి గదులను ఇప్పటికీ పూర్తి చేయలేదు. సంవత్సరాల కాలం గడుపుతూ పెద్ద మొత్తంలో ఉన్న నిధులను నాసిరకం పనులతో చేపట్టి ప్రశ్నించేవారు ఎవరు లేకుండా నేడు జి ప్లస్ వన్ కళాశాల వేల సంవత్సరాల గడిని తలపిస్తుంది. ఇక నాసిరకం పనుల విషయానికొస్తే జి ప్లస్ వన్ నిర్మాణం ప్రత్యక్షంగా కళాశాలను సందర్శించిన వారందరికీ కార్ ఫీట్ కి బదులు శాబాష్ బండ అది కూడా పైకి రావడం అన్ని తరగతి గదుల్లో పెద్ద మొత్తంలో పగుళ్లు ఇక్కడ కూడా మార్బల్ లాంటి బండను ఉపయోగించకుండా గ్రౌండ్ లెవెల్ అంత సిమెంట్ రుద్ది నిధులు దండుకోవడం జరిగింది.
పనులు పూర్తికాకముందే ఇంజనీరింగ్ అధికారి సంతకం లేకుండానే హ్యాండ్ ఓవర్ చేసిన కాంట్రాక్టర్.
రెండు కోట్ల 25 లక్షల జి ప్లస్ వన్ భవనము 2016లో ప్రారంభమైతే 2019 వరకు పనులు అసంపూర్తి కావడం ఇక పనులు ముందుకు సాగకపోవడంతో మరోవైపు విద్యార్థులకు తరగతి గదులు లేక ఇబ్బంది పడుతున్న క్రమంలో 2019 జూన్ లో నూతన భవనంలో ప్రవేశం చేయడం జరిగింది. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అదునుగా భావించిన కాంట్రాక్టర్ పెద్ద మొత్తంలో పలును ఉన్నప్పటికీ కళాశాలలో క్లాసులు ప్రారంభించడం కాంట్రాక్టర్కు కలిసి వచ్చింది. ఇదే సందని భావించిన కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ విభాగం సంతకం లేకుండానే ప్రిన్సిపాల్ కు బిల్డింగ్ పూర్తయిందని హైండవర్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ ప్రిన్సిపల్ కు హైందవర్ చేసిన కాగితంలో మాత్రం ఫ్రంట్ వింగ్, రైట్ విన్, రేర్ వింగ్, కారీ డోర్, తోపాటు ఇతర పనులకు సంబంధించి పూర్తి చేయడం జరిగిందని నాణ్యత పరిమాణాలతో ప్రతి పనికి సంబంధించిన మెటీరియల్ వివరాలు అందించడం జరిగింది. హ్యాండ్ ఓవర్ కాగితాన్ని చూస్తే మాత్రం జి ప్లస్ వన్ భవనానికి అన్ని అంగుళాలతో సంపూర్ణంగా ఏలాంటి నాణ్యత లోపాలు లేకుండా నిర్మించి అందజేస్తున్నట్లు కాగితంలో అందించడం జరిగింది. కానీ నిర్మాణంలో మాత్రం హ్యాండ్ ఓవర్ రిపోర్టుకు భిన్నంగా సంపూర్తిగా ఉన్న వివరాలు కాలేజ్ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా నాణ్యతలేని పనులు చేపట్టి కాంట్రాక్టర్ నిధులు దోచుకోవడం జరిగిందని కండ్లకు కట్టినట్టుగా కనబడుతుంది. మరో వింత విషయం ఏమిటంటే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అధికారులు ఎవరూ కూడా హ్యాండ్ ఓవర్ చేసే రిపోర్టులో క్వాలిటీ కంట్రోల్ భవనానికి పర్యవేక్షించిన ఇంజనీరింగ్ అధికారి ఆమోదం లేకుండానే హ్యాండ్ ఓవర్ లెటర్ ను అందించడం జరిగింది.
భవన నిర్మాణానికి విద్యుత్ హైవే లైన్ ఆటంకం ఉందని హైవే లైన్ పక్కకు అమర్చడంలో ఆరు లక్షల ఖర్చు చూపెట్టి చేతులు దులుపుకున్న కాంట్రాక్టర్.
మహాదేవపూర్ డిగ్రీ కళాశాల ప్రాంగణము సుమారు 5 ఎకరాలకు మించి ఒక విశాలమైన అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా భూమి కలిగి ఉంది. కానీ కాంట్రాక్టర్ మాత్రం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన ప్రదేశంలో ప్లే గ్రౌండ్ తో పాటు ఒకవైపు కళాశాల సంపూర్ణ భవనాన్ని నిర్మించుటకు ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ కాలేజ్ ప్రాంతంలో ఉన్న 33 కెవి తోపాటు 11 కెవి 63 కెవి డీటీఆర్ ఎల్ టి లైన్లను తొలగించి నిర్మాణ పనులు చేపట్టుటకు ఇంజనీరింగ్ మ్యాపులో భవన నిర్మాణానికి విద్యుత్ తీగల అంతరాయం అని దానికి తొలగించిన అనంతరం నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని కాలేజ్ భవన నిర్మాణానికి కేటాయించిన రెండు పాయింట్ 25 కోట్ల రూపాయల గూగుల్ లో నుండి ఆరు లక్షల 85 వేల రూపాయలను వెచ్చించి విద్యుత్ తీగలను తొలగించడం జరిగిందని చెప్పుకు రావడం జరిగింది. విద్యుత్ తీగలు భవన నిర్మాణానికి ఆటంకం కలుగుతే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వాటిని వేరే చోటు నుండి లైను తీసేలా లేదా నిర్మాణానికి విద్యుత్ తీగల దూరంగా ఇంజనీరింగ్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టర్ ఇలాంటి పనులు ఏమీ చేయకుండా సుమారు ప్రస్తుతం నాలుగు ఎకరాల భూమి విశాలవంతమైన మరో రెండు నుండి మూడు జి ప్లస్ భవనాలు ఇలాంటి ఆటంకాలు లేకుండా కట్టే పరిస్థితి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ విద్యుత్ లైన్ పై దృష్టి ఎందుకు వెళ్లిందో అర్థం కావడం లేదు. భవన నిర్మాణ పనులు చేపట్టిన తర్వాత నైనా ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువస్తే విద్యుత్ శాఖ 33 కెవి లైవ్ ఇతర ప్రాంతానికి మార్చేది, కానీ భవన నిర్మాణానికి కేటాయించిన నిధులను విద్యుత్ లైన్ మార్చడానికి ఉపయోగించడం కొరకు నిధులు వాడుకోవచ్చా కాంట్రాక్టర్ కావాలని విద్యుత్ లైన్ పేరుతో నిధులను పక్కదారి పట్టించడానికి కొరకే ఈ ప్రయత్నం చేయడం జరిగిందని ప్రస్తుత కాలేజీ పరిస్థితి చూస్తే వాస్తవమే కాంట్రాక్టర్ విద్యుత్ పేరుతో నిధులను పక్కదారి పట్టించడం జరిగిందని స్పష్టమవుతుంది.
పనుల అసంపూర్తి నాసిరకం పై 2019 లొ కలెక్టర్ మరియు కమిషనర్లకు దరఖాస్తు పెట్టిన ఫలితం శూన్యం.
ఒకవైపు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం జి ప్లస్ వన్ కోట్ల రూపాయలతో విద్యార్థుల నాణ్యమైన విద్యను అందించే క్రమంలో వసతులు లేక ఇబ్బంది పడుతున్న క్రమంలో జి ప్లస్ వన్ భావన నిర్మాణానికి నిధులు అందించి భావన నిర్మాణం చేసినప్పటికీ నేటికీ భవనం అసంపూర్తిగా విద్యార్థులకు అనేక ఇబ్బందులు కలుగుతున్న దృశ్య 2019లో కమిషనర్ ఆఫ్ కాలేజ్ అయ్యర్ ఎడ్యుకేషన్ తోపాటు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కు డిగ్రీ కళాశాల నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయిందని మరో నలభై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేస్తే జి ప్లస్ భవన పనులు పూర్తి అవుతాయని కమిషనర్ ఆఫ్ ఇయర్ ఎడ్యుకేషన్ మరియు జిల్లా కలెక్టర్లకు విన్నపం కూడా చేయడం జరిగింది. కానీ నాటి నుండి నేటి వరకు కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుండి అసంపూర్తిగా ఉన్న డిగ్రీ కళాశాల భవనానికి నిధులు మంజూరు కాకపోవడం, మరోవైపు కాంట్రాక్టర్ చేసిన నిర్లక్ష్యానికి పేరుకే ఉన్న జి ప్లస్ భవనంలో కళాశాల కొనసాగడం జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఐటీ మంత్రి తక్షణమే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని డిగ్రీ కళాశాలకు నిధులు మంజూరు చేయాల్సిన అవసరం.
మహదేవ్పూర్ డిగ్రీ కళాశాల 2008లో ప్రస్తుతం రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కళాశాల మంజూరు చేయడం జరిగింది. కొన్ని రోజులు జూనియర్ కళాశాలలో కొనసాగిన డిగ్రీ కళాశాల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మూడు రూములు కేటాయిస్తూ ప్రత్యేకంగా డిగ్రీ కళాశాల భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల్లో 33 డిగ్రీ కళాశాలలకు జి ప్లస్ వన్ భవనాల ఏర్పాటుకు రెండు కోట్ల 25 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఐటి మంత్రి శ్రీధర్ బాబు నాలుగు మండలాల విద్యార్థులకు డిగ్రీ కళాశాల సదుపాయం కలిగించినప్పటికీ పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు కేటాయించి అన్ని వసతులతో కూడిన భవనాన్ని ఏర్పాటు చేయాల్సిన కాంట్రాక్టర్ నిధులను దుర్వినియోగం చేస్తూ భవనాన్ని అసంపూర్తిగా వదిలేసి కట్టిన భవనాన్ని కూడా నాసిరకం పనులతో చేపట్టి నేడు వందల సంవత్సరాల భవనానికి కల్పించేలా చేసిన కాంట్రాక్టర్ అలాగే టి ఈ డబ్ల్యూ ఐ డి సి ఇంజనీరింగ్ అధికారులపై తక్షణమే రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి చర్యలకు ఆదేశించి పూర్తిస్థాయి జి ప్లస్ వన్ డిగ్రీ కళాశాల భవనానికి అవసరమయ్యే 46 లక్షల నిధులను మంజూరు చేయాల్సిన అవసరం ఉంది.
వనపర్తి నేటిదాత్రి వనపర్తి జిల్లా అమర్ చింత పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల కోడ్ ఉన్నందున జిల్లా ఎస్పీశ్రీమతి కె రక్షితమూర్తి ఆదేశానుసారం మస్తీపూర్ దగ్గర వాహనాల తనిఖీలలో భాగంగా3 8 0 000 రూపాయలకు ఎలాంటి రసీదులు కానీ ఆధారాలు కానీ లేనందువల్ల సీజ్ చేశామనిజిల్లా పోలీసు ఉన్నతాధికారి ఒక ప్రకటనలో thu తెలిపారు సీజ్ చేసిన డబ్బును ఎన్నికల గ్రీవెన్స్ వారికి అప్పగించామని ఆయన తెలిపారు
హసన్ పర్తి, నేటిధాత్రి: గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ లో అక్రమ మట్టి దందాకు అడ్డుకట్ట పడటం లేదు. దేవన్నపేట చుట్టుపక్కలా ఉన్న గుట్టలపై కన్నేసిన కొంతమంది అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండానే గుట్టుగా మట్టి దందా చేస్తున్నారు. రెండు రోజుల కిందట దేవన్నపేటలోని ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల గురుకులం ముందున్న గుట్టపై మైనింగ్ ప్రారంభించిన కొందరు వ్యక్తులు రాత్రికిరాత్రే లక్షల విలువైన మట్టిని తవ్వేసి, టిప్పర్ల సహాయంతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో బుధవారం మధ్యాహ్నం స్థానికులు మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. వెంటనే డయల్ 100 కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు సకాలంలో చేరుకోకపోవడంతో గ్రామస్థులు పర్మిషన్ లేకుండా మట్టిని ఎలా తవ్వుతారని నిలదీయడంతో సరైన సమాధానం చెప్పకుండా దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు.
రూ.లక్షల విలువైన మట్టి దందా దేవన్నపేటలో ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలం కేటాయించింది. కానీ ఆ సమీపంలో ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలం లేకపోవడంతో గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల వెనుకాల ఉన్న గుట్ట స్థలాన్ని కొంత తవ్వి చదును చేశారు. అదే స్థలంలో హాస్టల్ కట్టేశారు. కాగా హాస్టల్ ముందు గ్రౌండ్ నిర్మాణం మాటున ఎస్టీ వెల్ఫేర్ హాస్టళ్లకు చెందిన కొందరు అధికారులు మట్టి దందాకు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా ఓసారి ఇలాగే గుట్టుచప్పుడు కాకుండా కాంట్రాక్టర్‌ను మాట్లాడుకుని మట్టిని అమ్ముకోవడం ప్రారంభించి, రూ.లక్షల విలువైన మట్టిని అమ్ముకున్నారనే ఆరోపణలున్నాయి. యథేచ్చగా దందా సాగిస్తుంండటం, లారీల అతివేగంతో ప్రమాదాలు పొంచి ఉండటంతో గ్రామస్థులు అడ్డుకోవడంతో మట్టి తవ్వకాలు ఆపేశారు. ఇన్నిరోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు మళ్లీ దందా ప్రారంభించారు. రెండు రోజుల కిందట మళ్లీ తవ్వకాలు ప్రారంభించి లక్షల విలువైన మట్టిని అమ్ముకున్నారు.
అనుమతి లేకుండానే తవ్వకాలు వాస్తవానికి ఎలాంటి మట్టి తవ్వకాలు జరపాలన్నా స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు మైనింగ్ శాఖ అధికారుల నుంచి కూడా అనుమతి పత్రాలు తీసుకోవాలి. కానీ దేవన్నపేట శివారు 217 సర్వే నెంబర్ లోని గుట్ట ప్రాంతంలో మట్టిని తవ్వుతున్న కాంట్రాక్టర్ అలాంటిదేమీ లేకుండానే అధికారులను మేనేజ్ చేసుకుని దందా చేస్తున్నట్లు తెలిసింది. పర్మిషన్ ఎవరు ఇచ్చారని గ్రామస్థులు ప్రశ్నించడంతో ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అనుమతి ఇచ్చారని ఒకసారి, మరోసారి హాస్టల్ ప్రిన్సిపల్ ఇచ్చారని మరోసారి చెప్పడం గమనార్హం. ఇదే విషయమై హాస్టల్ ప్రిన్సిపల్ ను వివరణ కోరేందుకు ఫోన్ లో సంప్రదించగా.. ఆమె స్పందించకపోవడం గమనార్హం.
విశేషాలన్నీ మాయం దేవన్నపేట గుట్టపై హిందువులు, క్రైస్తవులకు సంబంధించిన ఆలయ ఆనవాళ్లున్నాయి. గుట్టపై వెంకటేశ్వరస్వామి, నాగమయ్య స్వామికి సంబంధించిన చిన్నపాటి గుడులు ఉండగా.. పైభాగంలో క్రైస్తవులు పూజించే శిలువ కూడా ఉంది. ఆయా ఆలయాలకు పండుగలు వచ్చిన ప్రతిసారి గ్రామానికి చెందిన భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా మైనింగ్ దందా వల్ల వెంకటేశ్వరస్వామి, నాగమయ్య స్వామి గుడితో పాటు క్రైస్తవ శిలువ కు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటివరకు జరిపిన తవ్వకాలతో నాగమయ్య, వెంకటేశ్వరస్వామి గుడులు కూడా దెబ్బతినే స్థితికి చేరాయి. ఇప్పటికే గ్రామంలో మట్టి దందా ఎక్కువవుతుండగా.. అనుమతులు లేని తవ్వకాలతో గ్రామంలో ఆచార వ్యవహారాలకు సంబంధించిన ఆనవాళ్లకు కూడా ముప్పు పొంచి ఉంది. ఇకనైనా అక్రమ దందాకు అడ్డుకట్ట వేసి, దందాకు సహకరిస్తున్న వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.