హసన్ పర్తి నేటిధాత్రి:
తేది 23/11/2024 రోజున వంగపహాడ్ గ్రామంలో, ఎన్నికల సందర్బంగా కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలో భాగంగా సన్న వడ్లకు క్వింటాలుకు 500/-బోనస్ ప్రతీ రైతుకు తమ బ్యాంకు ఖాతాలో జమచేయడం జరుగుతున్న సందర్బంగా మన గౌ. ముఖ్యమంత్రి గారు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి సంబురాలు చేసుకోవడం జరిగింది. మాజీ DCCB డైరెక్టర్ శ్రీ పొలం అనిల్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టు కొన్న రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటుందని రేవంత్ సర్కారే రైతుల పక్షం అండగా ఉంటుందని ఈ సందర్భంగా అనడం జరిగింది కార్యక్రమం కిసాన్ సెల్ అధ్యక్షులు ఇంజపూరి రాము. సముద్రాల సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో.గ్రామ పార్టీ అధ్యక్షులు నలుబోల రవీందర్, డివిజన్ అధ్యక్షులు పొన్నాల రఘు , మాజీ DCCB డైరెక్టర్ పోలం అనిల్ రెడ్డి, మాజీ MPTC మార్త రవీందర్, PACS అధ్యక్షులు మేరుగు రాజేష్, గండు అశోక్, దోమ కుమార్, వాసాల వంశీ, అరికిల లెనిన్, గ్రామ రైతులు మరియు పార్టీ సీనియర్ నాయకులు తదితర కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
ఎన్నికల సందర్బంగా కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలో భాగంగా సన్న వడ్లకు క్వింటాలుకు 500/-బోనస్
