జిల్లా పరిషత్,సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో మండలస్థాయి అవగాహన,శిక్షణ కార్యక్రమం
విద్యార్థులు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి
ఆర్డీఓ డాక్టర్.కన్నం నారాయణ

పరకాల నేటిధాత్రి
మండల పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉత్తీర్ణత మరియు వ్యక్తిత్వ వికాసం పై ఏర్పాటు చేసిన అవగాహనా మరియు శిక్షణ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ వీరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ డాక్టర్ కన్నం.నారాయణ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువు పై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లి తండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని అన్నారు.ప్రఖ్యాత మోటివేటర్ దిలీప్ కుమార్,మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు,తహసీల్దారు విజయలక్ష్మి మాట్లాడుతూ మాట్లాడుతూ విధ్యార్థులకు చదువడం జ్ఞాపక శక్తి పెంచుకోవడం మరియు పరీక్షలు రాయడంలో మెలకువల గురించి వివరించారు,ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం నిర్ణయించుకుని దాన్ని చేరుకునే విధంగా కృషి చేయాలని,విద్యార్థులు అందరూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే తల్లి తండ్రులు ఉపాధ్యాయులు సంతోషిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి యస్ రమాదేవి,జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పరకాల బాలుర గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సి. హెచ్ మధు,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.