-హరికృష్ణ త్యాగం ఒక మిధ్య!!
-రాజీనామా చేసినా ఉద్యోగం మళ్ళీ వస్తుంది?
-అలా ఉద్యోగాలు పొందిన వాళ్లు కోకొల్లలు!

-ప్రజలను మభ్యపెట్టి సానుభూతి కోసం ఆరాటం
-ఎన్నికలలో గెలవాలన్న ఆలోచనతో ప్రచారం
-కోచింగ్ సెంటర్ల మేలు కోసం సరికొత్త నాటకం
-కోచింగ్ సెంటర్ల నిర్వాహకులంతా ఏకమై సాగిస్తున్న రాజకీయం
-ఎమ్మెల్సీ ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి
-ఒక సామాన్యమైన ఉద్యోగికి అంత సొమ్మెక్కడిది!
-జీతంలో ముప్పై శాతం సామాజిక కార్యక్రమాలు గొప్పల కోసమే
-ప్రభుత్వాల మీద కోచింగ్ సెంటర్ల ఆధిపత్యం కోసం కొత్త ఎత్తుగడ
-విద్యార్థుల జీవితాలు ఫణంగా పెట్టి సంపాదనా మార్గాలకు రాచబాట
అబద్దమాడరాదు..సత్యమునే పలుకవలెను..అని చెప్పాల్సిన గురువులు కొందరు పచ్చి అబద్దాలు చెప్పి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ గౌడ్ మాటలు అలాగే వున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఆయన కొంత కాలం క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి తాను ప్రజా సేవ కోసం ప్రజల్లోకి వచ్చానని, ప్రజా సేవ కోసం తన ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా వదిలేశానని, కొలువుకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని ప్రచారం మొదలు పెట్టారు. సహజంగా ఇలాంటి మాటలు విన్నవారికి ఎవరికైనా సరే అవునా? చాలా గొప్ప వ్యక్తి అన్న భావనే ఏర్పడుంది. చాలా మందికి అసలు నిజం తెలియదు. అంతలోతుగా కూడా ఎవరూ ఆలోచించరు. ఉద్యోగాల విషయంలో ఎలాంటి వెసులు బాటు వుంటుందో కూడా ఇతరులకు పెద్దగా అవగాహన వుండదు. దాంతో ఉన్నతమైన ఉద్యోగం వదిలి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడేమో? అని జనం ఆలోచిస్తుంటారు. కాని అదంతా నిజంకాదు. ఇకపోతే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతోనే గత కొంత కాలంగా చిన్నా చితక సామాజిక కార్యాక్రమాలు చేపడుతూ వస్తున్నానని ఆయనే చెబుతున్నారు. తనకు వచ్చే జీతంలో కొంత శాతం సమాజ సేవ కోసం ఖర్చు చేస్తున్నానంటూ చెబుతుండడం విడ్డూరం. ఆయనకు వచ్చే జీతమెంత? అందులో చేసే ఖర్చెంత? ఎందుకంటే ఆసుపత్రుల్లో పది మంది రోగులకు పండ్లు పంచినా అది సామాజిక సేవే…కాని మన సమాజంలో ఎంతో మంది కొన్ని కోట్ల రూపాయలు సమాజం కోసం ఖర్చు చేస్తూ గుప్త దానాలు చేస్తున్న వారు అనేక మంది వున్నారు. వాళ్లెవరూ ఇలా ప్రచారం చేసుకోరు. అసలు పేదలను ఆదుకునేందుకు విద్యా, వైద్య సహాయ కార్యక్రమాలు చేస్తున్నట్లు కూడా తెలియదు. కాని రాజకీయ భవిష్యత్తుకోసం ఆరాటపడే వాళ్లే ఇలా చిన్నా చితక సాయాలు చేసి పెద్దగా ప్రచారం చేసుకుంటారు. మీడియాలో వార్తలు రాయించుకొని ప్రచారంలో దూసుకుపోతుంటారు. ఉద్యోగానికి రాజీనామా చేసిననాడు కూడా ఇలాగే తన త్యాగం గురించి చెప్పుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేసి, గొప్పలు చెప్పుకున్నారు. ఆ మరునాడు వచ్చిన మీడియా కథనాలను బ్రోచర్‌గా మార్చుకొని రాజకీయ పార్టీల వెంట ప్రసన్న హరికృష్ణ తిరిగారు. ముఖ్యంగా అదికార కాంగ్రెస్ పార్టీ చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. కాని కాంగ్రెస్ పార్టీ ప్రసన్న హరికృష్ణను నమ్మలేదు. ఎందుకంటే హరికృష్ణ ఉద్యోగ జీవితమే పట్టుమని పదిహేనేళ్లు లేదు. రిటైర్ మెంటుకు దగ్గరకూడా లేరు. కాని ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం అడుగులు వేశారు. అందులోనూ పెద్దల సభను ముందుగా ఎంచుకున్నాడు. ఇక్కడే ఆయనలోని అత్యాశ కనిపించింది. ఒక సాధారణ వ్యక్తి రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు చిన్న వయసు నుంచే కార్యకర్తగా మొదలై, అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. లేకుంటే రిటైర్ అయ్యే సమయంలో రాజీనామాలు చేసి రాజకీయాల్లోకి వస్తుంటారు. కాని ఇంకా ఎంతో ఉద్యగ భవిష్యత్తు వున్న వ్యక్తి రాజీనామా చేశానని చెప్పి, ప్రజలను నమ్మించి రాజకీయాల్లో వస్తున్నానంటే ఎవరూ నమ్మరు. కారణం ఆ ఉద్యోగం ఎటూ పోదు. ఇంకా రెండేళ్లకైనా సరే ఆ ఉద్యోగం మళ్లీ వస్తుంది. అవసరమైతే ఆ జీతమంతా కలుపుకొని కొలువొస్తుంది. ఈ జిమ్మిక్కులు సామాన్యులకు తెలియవు. ఏదొ కారణం చెప్పి కోర్టును ఆశ్రయిస్తారు. ఇలా రాజీనామాలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్లీ కొలువులు తెచ్చుకున్నవారు అనేక మంది వున్నారు. ఇలా ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయడం త్యాగం కాదు. ప్రజలను మోసం చేయడం. అద్యాపక వృత్తిలో వుంటూ నీతి, నిజాయితీని సమాజానికి పంచాల్సిన వ్యక్తి అబద్దాల పునాదుల మీద, అసత్యాలతో రాజకీయాలు చేయాలనుకోవడం తప్పు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ తన కొలువు తిరిగి తెచ్చుకోవడం కోసం న్యాయ స్దానాలను కూడా మోసం చేస్తారు. ఇలా కోర్టులను కూడా మోసం చేయగలిగిన వాళ్లు ప్రజలను మోసం చేయకుండా వుండగలరా? నల్లగొండ ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధికూడా ఇలాగే తన ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకొని, వారు కోరినంత ముట్ట జెప్పి, కోర్టును కూడా ప్రబావితం చేసి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అందువల్ల హరికృష్ణ చెబుతున్నది అబద్దమని, త్యాగం అసలే కాదని ఇక్కడే తేలిపోయింది. ఇంకా ఆయనను ప్రజలు నమ్ముతారని అనుకోవడం విచిత్రం. ఇక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంటుగా పోటీకి నామినేషన్ వేసిన హరికృష్ణ కొంతకాలంగా తాను బిసినంటూ బిసీ వాదం వినిపిస్తూ వచ్చారు. బిసిలను సంఘటితం చేసి విజయం సాధిస్తాననుకున్నారు. కాని అటు వంటి దారి ఎక్కడా కనిపించలేదు. దాంతో రాత్రికి రాత్రి బిఎస్పీ కండువా కప్పుకున్నారు. బిఎస్పీ కార్యకర్తలైన పట్టుబద్రుల వద్దకు వెళ్లినప్పుడు బిఎస్పీ కండువా కప్పుకుంటున్నారు. ఇతర బిసి పట్టభద్రుల వద్దకు వెళ్లినప్పుడు బిసి కండువాతో ప్రచారం సాగిస్తున్నారు. తాను ఎంత ఊసరవెళ్లి రాజకీయాలను చేయగలనో ఇక్కడే ఆయన చూపించుకుంటున్నారు. ఈ రెండిరటికన్నా మరో భయంకరమైన నిజం హరికృష్ణ రాజకీయంలో దాగి వుంది. గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగాలు లేకున్నా, అప్పటి ప్రభుత్వం చెప్పే మాటలతో కోచింగ్ సెంటర్లన్నీ కళకళలాడుతుండేవి. కోచింగ్ సెంటర్లు కూడా ఇదిలో ఈ నోటిఫికెషన్ వచ్చే, ఆ నోటిఫికేషన్ వచ్చే అని ప్రచారం చేసుకోవడానికి వీలుండేది. ప్రభుత్వం నుంచి ఉద్యోగాల కల్పన ప్రకటన వచ్చిన నాటి నుంచి కోచింగ్ సెంటర్లప్రచాం మొదలు పెట్టేవి.తెలంగాణ వచ్చిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఇస్తామని గత బిఆర్‌ఎస్‌పాలకులు చెప్పడంతో గ్రామీణ ప్రాంతాల పట్టభద్రులు పెద్దఎత్తున నగరాలకు చేరుకుంటూ వుండేవారు. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఉమ్మడిజిల్లాల కేంద్రాలలో పెద్దఎత్తున వెలసిన కోచింగ్ సెంటర్లలో చేరేవారు. దాంతో కోచింగ్ సెంటర్లకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. కాని ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు వేయడం నిర్ణీత గడువు ప్రకటించడం, పరీక్షలు నిర్వహించడం కోచింగ్ సెంటర్లబొచ్చేలో రాయి వేసినట్లైంది. కోచింగ్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా ఏటా కిటకిటలాడే కోచింగ్ సెంటర్లు మూసుకోవాల్సిన పరిస్ధితి విచ్చింది. ఆ మధ్య డిఎస్సీ, గ్రూప్ వన్ ల మీద పెద్దఎత్తున సొమ్ము చేసుకోవాలని చూసిన కోచింగ్ సెంటర్లు, అభ్యర్ధులను రెచ్చగొట్టి రోడ్లమీదకుతెచ్చింది. పరీక్షలు వాయిదా వేయాలని ఉద్యమాలు చేయించింది. అయినా ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఉద్యోగ పరీక్షలు నిర్వహించింది. దాంతో కోచింగ్ సెంటర్ల గొంతులో వెలక్కాయ పడినట్లైంది. ఇకపై ప్రభుత్వం తమ చెఫ్పుచేతుల్లో వుండాలన్న ఆలోచనతో కోచింగ్ సెంటర్లన్నీ ఏకమై ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చి, హరికృష్ణను రంగంలోకి దింపాయి. గుట్టు చప్పుడు కాకుండా కాంగ్రెస్ పార్టీనుంచి టికెట్ తెచ్చుకునేలా హరికృష్ణ కూడా వ్యూహం పన్నారు. ఎందుకంటే ఆయన ఓ వైపు కాంపిటీటివ్ పరీక్షల కోసం పుస్తకాలు రాస్తూ , అదనపు ఆదాయం సమకూర్చుకుంటుంటారు. కోచింగ్ సెంటర్లకు ద్వారా వాటిని అమ్ముకుంటుంటారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ప్రభుత్వం కోచింగ్ సెంటర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. పట్టభద్రుల నుంచి కోచింగ్‌ల పేరిట కోట్లు సంపాదించుకోవాలని చూశారు. కాని హరికృష్ణ ఆశలు కాంగ్రెస్ పార్టీ ద్వారా తీరలేదు. ఆయనకు టికెట్ రాలేదు. అయినా సరే కొండంత అండగా కోచింగ్ సెంటర్లు వుండడంతో ఆయన ఇండిపెండెంటుగా నామినేషన్ వేశారు. బిఎస్పీ కండువా కంప్పుకొని తిరుగుతున్నారు. ఈ విషయాలు పట్టభద్రులు తెలుసుకుంటే ఆయన అసలు నిజస్వరూపం తెలిసిపోతుంది. చైతన్య వంతులైన పట్టభద్రులను మోసం చేయడం ఎవరి వల్ల కాదన్నది ప్రజల అభిప్రాయం. ఎన్నికలంటేనే ఎన్నెన్నో లెక్కలు..విద్యలు..ఎత్తులు..జిత్తులు…కథలు…నటనలు..సానుబూతి పవనాలు. .ఇన్ని దాగి వుంటాయి. కాని కొన్ని ఎన్నికలు అలా వుండకూడదు. ముఖ్యంగా పెద్దల సభకు జరిగే ఎన్నికలైనా నీతిగా, నిజాయితీ వుండాలని రాజ్యాంగ పెద్దలు కొన్ని నియమనిబంధనలు ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలు వాటిని కూడా తుంగలో తొక్కడం అలవాటు చేసుకున్నారు. ఎన్నికల వ్యవస్దలో వున్న లొసుగులను ఆసరాగా చేసుకుంటున్నారు. ఇక తీర్పునివ్వాల్సింది పట్టభద్రులే…