శివ నామస్మరణంతో మారుమోగే రోజు రేపు మహా శివరాత్రి.
నేటి నుండి ప్రారంభం కానున్న శివరాత్రి ఉత్సవాలు.
మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన కాళేశ్వరం.
నేటి నుండి మూడు రోజుల వరకు శివరాత్రి ఉత్సవాలు
జిల్లా మరియు రాష్ట్ర రాజధాని నుండి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. అధికారులు పోలీసుల ప్రత్యేక బందోబస్తు.
శివ భక్తుల కొరకు నేటిధాత్రి ప్రత్యేక కథనం.
మహాదేవపూర్-నేటిధాత్రి:
చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో తెలపడం జరిగింది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం, శివరాత్రి ఫిబ్రవరి నెలలో రావడం జరిగుతుంది .సనాతన మాసం ప్రకారం మాఘ మాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో ఒకటి మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించడం తో ఈ బుధవారం రాత్రిని మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. మహాశివరాత్రి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధి గాంచిన ఆలయం కాలేశ్వర ముక్తేశ్