నితిష్ నిష్క్రమణ తర్వాత జేడీయూ విలీనానికి భాజపా ప్రణాళిక
వయసు, ఆరోగ్య సమస్యలతో నితిష్
నిశాంత్ అరంగేట్రాన్ని స్వాగతిస్తున్న పార్టీలు
నితిష్ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం
మరో ఇద్దరు సోషలిస్టు నాయకుల తనయులు ఇప్పటికే రాజకీయాల్లో…
పార్టీ మనుగడకోసం నితిష్ సర్దుకుపోతారా?
రాష్ట్రంలో తిరుగులేని బలంతో ఎన్డీఏ కూటమి
నేటిధాత్రి డెస్క్:
బిహార్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఢల్లీి పీఠం కైవసంతో, రాష్ట్రంలోని భాజపా వర్గాల్లో జోష్ నెలకొంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో 225 కైవసం చేసుకోవాలన్నది వీరి లక్ష్యం. అవసరమైతే ఒంటరిపోరుకూ సై అంటున్నప్పటికీ, బిహార్‌లో ఇప్పటికీ అత్యంత చరిష్మా కలిగిన నాయకుడు జెడీయూ అధినేత నితిష్‌కుమార్ మాత్రమే! ఈ నేపథ్యంలో పార్టీ కేంద్రనాయకత్వం మాత్రం నితిష్ నేతృత్వంలోనే ఈసారి ఎన్నికల్లో పోటీచేయాలన్న స్పష్టమైన ఉద్దేశంతో వుంది. ప్రస్తుతం భాజపా`జేడీయూ`ఎల్‌జేపీలు కాంబినేషన్‌ను ఆర్‌జేడీ`కాంగ్రెస్ కూటమి ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఆర్‌జేడీ నేత తేజస్వినీ యాదవ్‌కు నితిష్‌కుమార్‌పై దింపుడు కళ్లం ఆశలున్నాయి. చివరిదశలోనైనా బీజేపీకి థమ్కా ఇచ్చి తమ కూటమిలో చేరితే తిరుగుండదని భావిస్తున్నా, నితీష్ నిలకడలేని వైఖరి, ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా వుండటం వంటి ప్రతికూలతలు ఇబ్బందిగా మారాయి. అదీకాకుండా ప్రస్తుతానికి ఆయనకు కేంద్రంలోని భాజపాతో ఎటువంటి పొరపొచ్చాలు లేవు. కేంద్ర నాయకత్వం పటిష్టంగా వుండటం తో తోకజాడిరపు రాజకీయాలు ఇప్పుడు పనిచేయవన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. దీనికితోడు వయోభారం, అనారోగ్యంతో ఇబ్బందులు ఎలాగో వున్నాయి. ఇదిలావుండగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈసారి బడ్జెట్‌లో బిహార్‌కు ముఖ్యంగా యువత, స్త్రీలు మరియు పేదలను దృష్టిలో వుంచుకొని అనేక రాయితీలు ప్రకటించిన నేపథ్యంలో ఈసారి భాజపాకు తిరుగుండదన్న అభిప్రాయం కూడా రాష్ట్ర నాయకత్వంలో వుంది. రాష్ట్రంలోని మిథిలా ప్రాం తంలో మఖనా పంటను అధికంగా సాగుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో ఈ మఖ నా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ప్రకటించారు. అంతేకాదు పశ్చిమ కోశి కాల్వ ప్రాజెక్టు, నేషనల్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, పాట్నాలోని ఐఐటీ విస్తరణ వంటి వరాలను కూడా ప్రకటించడం గమనార్హం.
ఈనెల 24న ప్రధాని పర్యటన
ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్రమోదీ భాగల్పూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 18వ విడత ‘పి.ఎం. కిసాన్ సమ్మాన్ నిధి’ని దేశవ్యాప్తంగా రైతులకు వారివారి ఖాతాల్లో జమచేయనున్నారు. బిహార్‌కు చెందిన 83లక్షల మంది రైతులకు ఈ నిధులు అందుతాయి. ప్రధాని నరేంద్రమోదీ ఈ పంపిణీ కార్యక్రమాన్ని బిహార్‌లో చేపట్టడం, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే నన్న సంగతి స్పష్టమవుతోంది. ఇదే సమయంలో లబ్దిదారులో ప్రధాని వర్చువల్‌గా ముచ్చటిస్తా రు. అంతేకాకుండా రాష్ట్రంలో రూ.15వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేయనున్నారు. ప్రస్తుతం నితీష్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూకు చెందిన 12 మంది ఎంపీలు, కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ వర్గాల్లో ఒంటరిగా పోటీచేయాలన్న ఉద్దేశమున్నప్పటికీ, తిరుగులేని నితిష్‌కుమార్ చరిష్మాముందు ఎవరూ నిలబడటం కష్టమన్న సంగతి వారికి బాగా తెలుసు. నితిష్ తర్వాత జేడీయూలో ఎవరనేదానికి ప్రస్తు తానికి సమాధానం దొరకడం కష్టం. ప్రస్తుతం ఆయన పేరుమీదనే పార్టీ మనుగడ సాగుతోంది.
పోస్టర్ రాజకీయం
ఇదిలావుండగా ఫిబ్రవరి 12న బిహార్ రాజధాని పాట్నాలో వెలిసిన ఒక పోస్టర్ అందరిని ఒక్క సారి ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీన్ని కాంగ్రెస్ నాయకుడు రవికుమార్ గోల్డెన్ ఏర్పాటుచేశారు.నలంద జిల్లాలోని హర్నౌట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు ఆయన ఈ పోస్టర్‌లో పేర్కొనడమే అందరినీ ఆకర్షించడానికి ప్రధాన కారణం. నిజానికి ఈ స్థానం గత 20ఏళ్ళుగా జె.డి(యు)కు కంచుకోటగా కొనసాగుతోంది. జె.డి(యు) అధినేత, ముఖ్యమంత్రి నితిష్‌కుమార్ ఈ స్థానంనుంచే గెలుపొందారు. 2005కు ముందు ఈ స్థానంలో సమతాపార్టీ బలంగా వుండేది. ఈ పార్టీని నెలకొల్పింది ఎవరో కాదు. నితిష్‌కుమార్, మాజీ రక్షణశాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌తో కలిసి ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా రవికుమార్ గోల్డెన్ స్వగ్రా మం కూడా ఇదే నియోజకవర్గంలో వుంది. ఈ గ్రామం పేరు కళ్యాణ్ బిఘా. హరినారాయణ్ సింగ్ అనే సీనియర్ జేడీ(యూ) నాయకుడు 2010 నుంచి ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.2020లో హర్నౌట్ స్థానంనుంచి కాంగ్రెస్ తరపున టిక్కెట్ కోసం యత్నించిన రవికుమార్ గోల్డె న్ సక్సెస్ కాలేదు. ఈసారి తనకు పార్టీ టిక్కెట్ లభిస్తుందన్న ఆశ వున్నా, ఈ స్థానం లో నితిష్ కుమార్ తన కుమారుడు నిశాంత్‌కుమార్‌ను నిలబెడితే తన గెలుపు కష్టమన్న భయం కూడా ఆయన్ను వెన్నాడుతోంది. కాగా ఇదంతా టిక్కెట్ కోసం పోస్టర్ స్టంట్ అని భాజపా, జెడీ (యు)లు కొట్టిపారేస్తుండగా, కాంగ్రెస్ దీనిపై ఇప్పటివరకు ఏవిధమైన కామెంట్ చేయలేదు.
రాజకీయాలకు దూరంగా నిశాంత్
నిశాంత్ కుమార్ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పూర్తిచేసారు. ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఇంతవరకు ఉత్సాహం చూపడంలేదు. పుస్తకపఠం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు…ఇవీ ఆయన వ్యాపకం. నితిష్‌కుమార్‌కు నిబద్ధ రాజకీయవేత్తగా రాష్ట్రంలో పేరుంది. తన వారసులను తీసుకొచ్చేందుకే రాజకీయాలు నడపరన్న మంచిపేరును తెచ్చుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే, ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఆధ్యాత్మిక జీవనానికి ప్రాధాన్యమిస్తున్న నిశాంత్ ఇక రాజకీయాల్లోకి అడుగుపెడతారన్న వార్తలు రాష్ట్రంలో జోరుగా సాగుతున్నాయి. ఇందుకూ కారణం లేకపోలేదు. 2015లో ఆర్‌జేడీ`జేడీయూ అలయన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు నితిష్‌కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి నిశాంత్ హాజరయ్యాడు. ఇదే ఎన్నికల్లో ఆర్‌జేడీ అధినేత లల్లూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాజకీయ అరంగేట్రంచేశారు. సరిగ్గా ఏడాది తర్వాత రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ జాముయ్ లోక్‌సభ స్థానంనుంచి గెలుపొంది పార్ల మెంట్‌లోకి అడుగుపెట్టారు. ఈవిధంగా బిహార్‌లో ముగ్గురు సోషలిస్ట్ నాయకులు (నితిష్‌కుమార్, లాలూప్రసాద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్) తమ కింది తరాలకు అధికారాన్ని బదలీ చేస్తా రన్నది స్పష్టమైంది. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రావణ్‌కుమార్ (ఈయన నితిష్‌కు సన్నిహితులు) ఇటీవల మాట్లాడుతూ నిశాంత్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని వెల్లడిరచడం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది.
రెండోతరం నాయకుల కొరత
నితిష్‌కుమార్ నడిపిన అస్థిర రాజకీయాల నేపథ్యంలో అప్పటివరకు ‘సుశాసన్ బాబు’గా ప్రసిద్ధు డైన ఆయన్ను ‘‘పల్టు చాచా’’ బీహార్ ప్రజలు పిలవడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో నితిష్‌కుమార్ తన తర్వాత అధికారాన్ని అప్పగించడానికి రెండోతరం నాయకులను తయారు చేయలేదు. మరి ఇదే సమయంలో రామ్‌విలాస్ పాశ్వాన్ కేంద్రంలో, లలూప్రసాద్ యాదవ్ రాష్ట్రంలో సుస్థిరమైన రీతిలో రెండోతరానికి అధికారాన్ని అప్పగించగలిగారు. ఇదిలావుండగా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, నితిష్‌కుమార్ అప్పటిరకు కొనసాగాని ఇండీ కూటమి కాడి కిందపడేసి, ఎన్డీఏ కూటమిలో చేరిపోయారు. ఈ ఎన్నికలను 2025 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా పరిగణించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనే నితిష్‌కు తొలిసారి రెండోతరం నాయకులు లేని లోటుఅర్థమైంది. ముఖ్యంగా ఆయన స్టార్ కాంపెయినర్లుగా అశోక్ చౌదరి, విజయ్ చౌదరి, రాజీవ్ రంజన్‌సింగ్, సంజయ్ రaాలపై ఆధారపడ్డారు. వీరు ప్రచారంలో పాల్గనడమే కాదు, జెడీ (యు)లో నిర్ణయాలు తీసుకోవడంలో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు నితిష్ వారసుడి గా మనీష్‌వర్మ పేరు బాగా వినబడిరది. ఈయన నితిష్‌కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిం చాడు. కానీ క్రమంగా ఈయన తెరమరుగు కావడంతో, మరి నితిష్ స్థానాన్ని భర్తీ చేసేదెవరన్న దనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇటువంటి పరిస్థితిలో పైన పేర్కొన్న నలుగురు నాయకులే ఇకముందు పార్టీ వ్యూహాలను రచించడంతోపాటు, భాజపాతో సీట్ల ఒప్పందాలను చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కూడా చాలా ఓపిగ్గా జేడీయూ పరిణామాలను పరిశీలిస్తోంది. నితిష్ రాజకీయాలనుంచి తప్పుకున్నతర్వాత నాయకత్వలోటు ఎట్లాగూ ఏర్పడుతుంది కాబట్టి ఏకం గా జేడీయూను, తమ పార్టీలో విలీనం చేసుకునేందుకు కమల నాథులు వ్యూహాలు పన్నుతున్నా రు.
జేడీయూకు నష్టం
నితిష్‌కుమార్ రాజకీయాలనుంచి తప్పుకుంటే జేడీయూకు చాలా నష్టం. ఎందుకంటే బిహార్‌లోని 75శాతం దళిత ఓటర్లు ఆయనవైపే వుంటారు. నితిష్ ఏపార్టీలో ఉన్నాడనేది వారు పట్టించుకోరు. ఆయన్ను తమ నాయకుడిగా వారు చిత్తశుద్ధితో అంగీకరించడం వల్లనే నితిష్ తిరుగులేని నేతగా బిహార్ రాజకీయాల్లో వెలుగొందుతున్నారు. కుర్మి`కుశవహ వర్గాల ఓట్లు చీలకుండా గంప గుత్తగా జేడీయూకు పడేలా నితిష్ చేయగలుగుతున్నారు. వయసు, ఆరోగ్య కారణాల నేపథ్యంలో, ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటికప్పుడు వచ్చే చీలికను అరికట్టే సామర్థ్యం నితిష్‌లో సన్నగి ల్లుతోంది. ఈ నేపథ్యంలో పార్టీకి నితిష్ వంటి క్లీన్ ఇమేజ్ వున్న నాయకుడు అవసరం. ప్రస్తు తం నితిష్‌కు ఎంతటి క్లీన్ ఇమేజ్ వుందో తనయుడు నిశాంత్‌కు కూడా అంతే ఇమేజ్ వుంది. మేనరిజం, హావభావాలు, అభిప్రాయాలు కూడా ఇద్దరివీ ఒక్కలాగానే వున్నాయి. కానీ వచ్చిన సమస్యల్లా వంశపారంపర్య రాజకీయాలకు నితిష్ వ్యతిరేకం. ఈ విషయంలో రాంవిలాస్ పాశ్వాన్, లల్లూ ప్రసాద్ యాదవ్‌ను గతంలో తీవ్రంగా విమర్శించారు కూడా. 2024 ఎన్నికల ప్రచా రం సందర్భంగా లల్లూ ప్రసాద్ యాదవ్‌నుద్దేశించి ‘ఈయన పిల్లల్ని కన్నాడు కానీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని’ ఎద్దేవా చేశారు.
రాజీపడతారా?
ఇప్పుడు తనవరకు వచ్చేసరికి పార్టీని నిలబెట్టాలంటే తనయుడు నిశాంత్‌కుమార్‌కు పగ్గాలు అ ప్పగించక తప్పదు. ఈ విషయంలో నితిష్ రాజీపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం నిశాంత్‌కుమార్‌కు 50 ఏళ్లు. ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వస్తే, అంత చదువుకున్నా బయట ఏమీ అవకాశాలు లేక, మరోదారి కానరాక రాజకీయాల్లోకి ప్రవేశించాడని ప్రత్యర్థులు ప్రచారం చేయకమానరు! ఈవిధంగా నితిష్‌కు రెండువైపులా సమస్యలు పీడిస్తున్నాయి. నిజానికి గత ఏడాది నవంబర్ నుంచే నిశాంత్ రాజకీయాల్లోకి వస్తారన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా రాష్ట్రంలో నేరాల రేటు పెరగడం, నితిష్ అస్థిర మానసిక స్థితి ఇందుకు ప్రధాన కారణం. 2024 నవంబర్ 15వ తేదీన మొట్టమొదటిసారి తండ్రి తనయుడు ఒక పెళ్లి వేడుకలో దర్శనమిచ్చారు. నితిష్‌కుమార్ పర్సన ల్ సెక్యూరిటీ ఆఫీసర్ తనయుడి వివాహం హర్యానాలోని రివారి జిల్లా భుర్తాల్ గ్రామంలో జరిగింది. ఈ వేడుకకు తండ్రి తనయులు హాజరయ్యారు. అప్పటినుంచే నిశాంత్ రాజకీయ అరంగే ట్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి. 2025, జనవరి 8న భక్తియార్‌పూర్‌లో స్వాతంత్య్ర స మరయోధులకు నివాళులర్పించే కార్యక్రమంలో మళ్లీ ఇద్దరూ పాల్గన్నారు. ఈ సమరయోధుల్లో నిశాంత్ తాత కవిరాజ్ రామ్‌లఖన్ సింగ్ వైద్య కూడా వున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ రం గప్రవేశంపై అడిగిన ప్రశ్నలకు నిశాంత్ ‘‘మీరు మా నాన్నగారికి ఓటేయండి. మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రిని చేయండి’’ అనిమాత్రమే చెబుతున్నారు. మరోపక్క 2025 అసెంబ్లీ ఎన్నికల సీట్ల విషయంలో జేడీయూ, బీజేపీల మధ్య సుదీర్ఘ చర్చలు సాగుతుండటం గమనార్హం. ఇక మొత్తం మీద పార్టీ నాయకత్వం నిశాంత్‌కు బాధ్యతలు అప్పగించాలని కోరుతోంది. విచిత్రమేమంటే ఆర్‌జేడీ నాయకుడు తేజస్వీయాదవ్ కూడా నిశాంత్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. ఆర్జేడీ కూటమిలో ఉన్న కాంగ్రెస్ కూడా నిశాంత్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తోంది. విచిత్రంగా భాజపా కూడా నిశాంత్‌ను రాజకీయాల్లోకి స్వాగతిస్తోంది.
ఎవరి స్వార్థం వారిది
ఆర్జేడీ, కాంగ్రెస్‌లు నిశాంత్ ఆగమనాన్ని స్వాగతిస్తున్నా దీనికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఎందుకంటే నిశాంత్ రాజకీయాల్లోకి వస్తే, సామాజిక న్యాయ సమర్థక ఓటుబ్యాంకు, నిరుపేద అగ్రవర్ణాల ఓట్లు వీటికి పడవు. బీజేపీ వ్యూహాలు వేరు. పార్టీకి బలమైన క్యాడర్ వుంది కానీ, సుస్థిరమైన నాయకుడు లేడు. ఆలోటును నిశాంత్ తీరుస్తాడు. బీజేపీకి కేవలం అగ్రవర్ణ పార్టీగానే పేరుంది. నితీష్‌కుమార్ పుణ్యమాని, దళితులు, ఇతర వెనుకబడిన వర్గాల ఓట్లు కూటమికి పడటం వల్ల అధికారంలోకి రాగలిగింది. ఇక జేడీయూ ప్రధాన లోపం సంస్థాగత నిర్మాణం, బలమైన క్యాడర్ లేకపోవడం. ఈ లోటును బీజేపీ తీరుస్తోంది. ఇప్పుడు నితిష్ రాజకీయాలనుంచి ని ష్క్రమణ తర్వాత జేడీయూను విలీనం చేసుకుంటే, నాయకత్వలోటును భర్తీచేసుకోవచ్చుననేది బీజేపీ వ్యూహం. అయితే ముందుజాగ్రత్త చర్యగా గత ఆర్నెల్లనుంచి ఉపముఖ్యమంత్రి పదవిలో వు న్న సామ్రాట్ చౌదరిని నాయకుడిగా వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది! ఈ పరిస్థితుల్లో నిశాంత్ రాజకీయాల్లోకి వస్తే చౌదరికి ఇబ్బందికరం. ఆయనకు ఇదెంతమాత్రం ఆమోదయో గ్యం కాదు. కానీ ఓటుబ్యాంకు పరంగా చూస్తే సామ్రాట్ చౌదరికి కొయిరి`కుర్మి జాతి ప్రజల్లోనే ఓటుబ్యాంకు వుంది. అదే నిశాంత్‌కు తండ్రి వారసత్వంగా కొయిరి`కుర్మితో పాటు దళితుల్లో మంచి పలుకుబడి వుంది. అందువల్ల నిశాంత్ రాజకీయాల్లోకి వస్తే భాజపా, సామ్రాట్‌ను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేయగలదు. ఇందుకు బీజేపీకి కొన్ని అనుకూలాంశాలున్నాయి. మొదటిది నిశాంత్ మతపరమైన విశ్వాసాలు కలిగిన వ్యక్తి, అతని సిద్ధాంతాలు, బీజేపీకి అనుకూలంగా వుంటాయి. అందువల్ల ఆర్‌జేడీ విలీనమైతే నిశాంతే ముఖ్యమంత్రి అవుతాడు. ఒకవేళ నిశాంత్‌కు పాలనానుభవం లేదనుకుంటే, సా మ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిని చేసి, నిశాంత్‌ను ఉపముఖ్యమంత్రిగా చేయవచ్చు. ఆవిధంగా అతనికి అనుభవం వచ్చేవరకు వేచివుండి, ఈలోగా జేడీయూను వదలడానికి ఇష్టపడని వారిని కూడా క్రమంగా తమవైపు తిప్పుకోవచ్చు. ఇది బీజేపీ ప్రణాళిక.
భాజపాలో ఎల్‌జేపీ(ఆర్‌వీ) విలీనం తథ్యమా?
చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ (ఆర్‌వీ) కూడా భాజపాలో విలీనమవుతుందనేది బిహార్ రాజకీయాల్లో మరో కీలక ప్రచారం. చిరాగ్ పాశ్వాన్‌కు ముఖ్యమంత్రి పదవిపై మోజుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే ఆయన తన ఉద్దేశాన్ని భాజపా పెద్దలకు చెప్పారని వార్తలు వచ్చాయి. ఈ పార్టీకి పాసీ తెగల్లో మంచి పలుకుబడి వుంది. ప్రస్తుతం ఇతర దళిత తెగల్లోకి కూడాతన పలుకుబడిని విస్తరించడానికి ఎల్‌జేపీ(ఆర్‌వీ) ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇదే సమయంలో హిందూస్థానీ అవామీ మోర్చా (హెచ్‌ఏఎం) పార్టీ అధినేత జితన్‌రామ్ మంరీa కూడా తన పార్టీ బలాన్ని విస్తరించాలన్న యోచనలో వున్నారు. ప్రస్తుతం ఈ పార్టీకి ముసాహర్ కులం ప్రజల్లో గట్టి పట్టుంది. ఇదికూడా ఎన్డీఏలో భాగస్వామిగానే వుంది. ఈ నాయకులనుంచి ఎదురయ్యే అడ్డంకులు ప్రధానమైనవి కావు. నిశాంత్ రాజకీయాల్లోకి రావడం ఎన్డీఏ కూటమికి చాలా అవసరం. ఎందుకంటే నితిష్ లోపాన్ని నిశాంత్ మాత్రమే భర్తీ చేయగలడు!