వర్కింగ్ జర్నలిస్టులు అందరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలి
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని పురుషోత్తం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలో యూనియన్ సభ్యత్వాలను ప్రారంభించారు.
కాకతీయ ప్రెస్ క్లబ్ లో జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్,ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవిందర్ లు కలిసి యూనియన్ సభ్యత్వ నమోదు చేసి రసీదు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పట్ల టి.ఎస్.జే.యూ యూనియన్ నిరంతరం పనిచేస్తుందాన్నారు.తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో సభ్యత్వం పొందిన ప్రతి సభ్యునికి రూ.5 లక్షల ప్రమాద భీమా ను రాష్ట్రం అంతటా అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్టు ఉపయోగించుకోవాలని,జిల్లాలోని అన్ని మండలాల జర్నలిస్టులందరూ సభ్యత్వం తీసుకొని దీనివల్ల వల్ల కలిగే ప్రయోజనాలను పొందాలని సూచించారు.
జర్నలిస్ట్ ల హక్కుల సాధనే లక్ష్యంగా అందరం కలిసి ఐకమత్యంగా పోరాడాలనేదే యూనియన్ లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో టి.ఎస్.జె.యూ జిల్లా ఉపాధ్యక్షుడు గట్టు రవీందర్ సంయుక్త కార్యదర్శి కడపాక రవి, పల్నాటి రాజు కోశాధికారి శేఖర్ నాని,జిల్లా సంయుక్త కార్యదర్శి,బొచ్చు భూపాల్,ఈసి మెంబెర్ కె.దేవేందర్, బొల్లపెల్లి జగన్,మారపెల్లి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు