-హరికృష్ణ ప్రభావం అంతంత మాత్రమే!
-తను ఊహించుకున్న ఆర్భాటం అంతా ఉత్తదే!

-సాగుతున్న ప్రచారం కూడా పరిమితంగానే.!
-ఎంత ప్రయాసపడినా గెలుపు తీరం కష్టమే
-ఎంత సాగిల పడినా గెలుపు భారమే
-నిరుద్యోగుల సమస్యల మీద గళం విప్పింది లేదు
-తెలంగాణ ఉద్యమ సమయంలో జై తెలంగాణ అన్నది లేదు
-ఉద్యమానికి సమయం కేటాయించింది లేదు
-ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఉద్యమాలు చేసింది లేదు
-నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసింది లేదు
-ఇంత కాలం తన రాజకీయ ప్రచారం మాత్రమే సాగించారు
-ముందు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేశాడు
-ఆ తర్వాత బిజేపి అగ్రనాయకులను కలిశాడు
-ఏ పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ అన్నాడు
-బిసి ఐక్యత ముసుగేసుకొని కొంత కాలం కథ నడిపించాడు
-ఆఖరుకు బిసి కండువా పక్కన పడేసి బిఎస్పీ అంటున్నాడు
-ఎన్నికలకు ముందే ఇన్ని జెండాలు మార్చిన హరికృష్ణ
-ప్రసన్న ఎజెండా ఎలాంటిదో చెప్పకనే చెప్పాడు
-కోచింగ్ సెంటర్ల కోసం తపన పడ్డాడు
-కాలేజీ వదిలేసి కోచింగ్ సెంటర్లకు పుస్తకాలు రాయడం మొదలు పెట్టాడు
-కోచింగ్ సెంటర్ల ముసుగులో కోట్లు సంపాదించుకున్నాడు?
-ఎన్నికలలో గెలిచి ఎమ్మెల్సీ కావాలనుకున్నాడు
-అసలు రంగు బైటపడడంతో ఉక్కిరి బిక్కిరౌతున్నాడు
హైదరాబాద్,నేటిధాత్రి:
కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ మీద బిసి. సంఘాలు మండిపడుతున్నాయి. తన స్వార్ధపూరిత రాజకీయాల కోసం బిసిలను ముందు ఎగదోసి, తర్వాత పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా ఆయనపై పట్టభద్రులలో పెద్దగా స్పందన కనిపించడం లేదు. ప్రసన్న హరికృష్ణ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాగిస్తూ, తన విద్యార్దుల కోసం చేసిందేమీ లేదు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పనిచేస్తూ ఆయన తన విద్యార్దులను ఉన్నత లక్ష్యాలతో తీర్చిదిద్దాల్సిన సమయంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్ల మేలు కోసమే పని చేశారన్న ఆరోపణలున్నాయి. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ, కోచింగ్ సెంటర్ల మేలు కోసం పనిచేశారు. తన విద్యార్ధులకు ఆ మెటీరియల్ అందించలేదు. కేవలం వ్యాపార లాభాపేక్షతోనే తన పుస్తక రచనను కొనసాగించారు. వాటిని కోచింగ్ సెంటర్లకు అమ్ముకోవడం కోసమే ప్రయత్నం చేశాడు. అలా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. విద్యార్దులకు తీరని అన్యాయంచేశారు. తన వల్ల కోచింగ్ సెంటర్ల ద్వారా వేల మంది నిరుద్యోగులకు ఉపయోగపడ్డానని చెబుతున్నారే, గాని జీతం తీసుకుంటూ తన కాలేజీ విద్యార్దుల భవిష్యత్తు తీర్చిదిద్దానని చెప్పుకునే పరిస్ధితి లేదు. నిజంగా ఆయన సమాజం కోసం, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తే తాను పనిచేసే కాలేజీ విద్యార్దులే కొన్ని వేల మంది వుంటారు. వారిని తీర్చిదిద్దితే ఎంతోమంది జీవితాలు బాగుపడేవి. కాని అలా చేయలేదు. కేవలం పుస్తకాలు రాసి, ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు అందజేయడం వల్ల వ్యక్తిగతంగా ఆయన లాభపడ్డాడు. ఆ మెటీరియల్‌తో కోచింగ్ సెంటర్లు బాగుపడ్డాయి. అందుకే పట్టభద్రులు ఇప్పుడు ఆయన వ్యవహారశైలిపై గళమెత్తుతున్నారు. హరికృష్ణ విద్యార్ధుల జీవితాలను గాలికి వదిలేసి, కోచింగ్ సెంటర్లకు అమ్ముడుపోయిన వ్యక్తి అంటున్నారు. అసలు కాలేజీకి హజరు కాకుండా, విద్యార్దులకు పాఠాలు చెప్పకుండా జీతాలు తీసుకొని ప్రభుత్వాన్ని మోసం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలేజీకి ఎగనామం పెట్టి, యూనివర్సీటీ పెద్దలను ప్రసన్నం చేసుకొని, కోచింగ్ సెంటర్లకు మెటీరియ్ అందించి, తన కాలేజీ విద్యార్దులకు తీరని అన్యాయం చేశాడంటున్నారు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ బిసిల మధ్య చీలికకు ప్రయత్నం చేస్తున్నాడన్న బిసి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్సీ కావాలన్న ఆశలతో ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. హరికృష్ణ అసలు స్వరూపం తెలిసిన తర్వాత ఆయనకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. దాంతో బిజేపి టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. బిజేపి పెద్దలను కలిసి వేడుకున్నాడు. కాని అక్కడా అవకాశం దొరకలేదు. తర్వాత బిఆర్‌ఎస్ పెద్దలను కలిశారు. అయితే హరికృష్ణ తన జీవితంలో ఏనాడు తెలంగాణ కోసం పనిచేసిన వ్యక్తికాదని తెలిసింది. ఓ వైపు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఆయన కోచింగ్ సెంటర్లకు మెటీరియల్ తయారు చేస్తూన సంపాదనలో మునిగితేలారంటున్నారు. ఏనాడు ఆయన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నది లేదు. తెలంగాణకు జైకొట్టింది లేదని బిసి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒక బిసిగా అంతటి స్ధాయికి ఎదిగినా ఏనాడు ఏ బిసి విద్యార్ధికి ఆయన సాయం చేసింది లేదు. కాని తనకు పదవి కావాల్సి రాగానే మాత్రం బిసిల జపం చేస్తున్నాడని అంటున్నారు. బిఆర్‌ఎస్ కూడా టికెట్ ఇవ్వమని తేల్చి చెప్పడంతో ఇక గత్యంతరం లేక , ఇండిపెండెంటుగా పోటీకి నిలబడ్డాడు. అక్కడ కూడా ఆయనకు సరైన ఆదరణ లభించలేదు. బిసి సంఘాలు ఆయనకు మద్దతు పలకలేదు. దాంతో ఏదొ ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే తప్ప లాభం లేదనుకున్నాడు. బిఎస్పీ పెద్దలను ప్రసన్నం చేసుకొని బిఫామ్ తెచ్చుకున్నాడు. అప్పుడు కూడా అటు బిఎస్పీని, ఇటు బిసిలను మభ్యపెడుతూనే వున్నాడు. ప్రచారంలో మోసంచేస్తూనే వున్నాడు. బిసి నాయకులను కలిసే సమయంలో బిసి కండువా కప్పుకుంటున్నాడు. బిఎస్పీ నేతలను కలిసే సమయంలో ఆ పార్టీ కండువా కప్పుకొని ప్రచారం చేయడాన్ని అందరూ గమనిస్తూనే వున్నారు. ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల్లో పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. ఆయనకు సహకరిస్తామని ఎవరూ చెప్పడం లేదు. ఆయన ప్రచారం అంతంత మాత్రంగానే సాగుతోంది. పట్టుమని ఆయన వెంట పది మంది తిరిగే పరిస్ధితి కనిపించడం లేదు. తనకు తానుగా గొప్పగా ఊహించుకొని హరికృష్ణ రంగంలోకి దిగారు. అయితే ఆయన వెనక కోచింగ్ సెంటర్లు వున్నాయంటున్నారు. హరికృష్ణకు ఎన్నికల పెట్టుబడి వాళ్లే ఏర్పాటు చేస్తున్నారంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు రావడం, కోచింగ్ సెంటర్లు ఆ నిరుద్యోగుల చేత వాయిదాలు కోరడం, ప్రభుత్వ ం వినకపోతే వారి చేత కోర్టులను ఆశ్రయించడం వంటివి చేస్తుంటారు. అలా ఏళ్ల తరబడి పరీక్షలను వాయిదా వేయిస్తూపోవడం వల్ల నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లను వదిలివెళ్లిపోరు. కొత్త కొత్త బ్యాచులు ఏర్పాటు చేసుకునేందుకు వీలౌతుంది. అలా కోచింగ్ సెంటర్ల వ్యాపారం మూడు పరీక్షలు, ఆరు వాయిదాలుగా నడిచేది. ఆయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోచింగ్ సెంటర్లు చేసే ఈ జిమ్మిక్కులు సాగడం లేదు. కోచింగ్ సెంటర్లు కొంత మంది విద్యార్దులను రెచ్చగొట్టి అశోక్‌నగర్‌లో, దిల్‌సుఖ్ నగర్‌లో పెద్దఎత్తున ఉద్యమాలు చేసేందుకు కుట్రులు పన్నారు. అయినా ప్రభుత్వం చెప్పిన సమయానికి పరీక్షలు నిర్వహిస్తూ, ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. ఇలా జరిగితే కోచింగ్ సెంటర్ల అవసరం ఎవరికీ రాదు. దాంతో కోచింగ్ సెంటర్లు దివాళా తీసే పరిస్ధితి వస్తుంది. ఇప్పటికే కోచింగ్ సెంటర్లు ఊగలుతోలుకునే పరిస్ధితి వచ్చింది. ఈ పరిస్ధితి మారాలంటే మళ్లీ కోచింగ్ సెంటర్లు కళకళలాడాలంటే తమకు అనుకూలమైన వ్యక్తిని ఎమ్మెల్సీ చేయాలని పెద్దఎత్తున ఖర్చుపెడుతున్నారు. ప్రసన్న హరికృష్ణనుముందు పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ కోచింగ్ సెంటర్ల మూలంగానే కోట్లు సంపాదిస్తున్నారు. వారికి మేలు చేయడానికి తప్ప రాష్ట్రంలోని పట్టభద్రులకు న్యాయం చేసేందుకు కాదని హరికృష్ణ వ్యవహారం తేలిపోయింది. అందుకే ఆయన వెంట పట్టభద్రులు ఎవరూ కనిపించడం లేదు. కేవలం కోచింగ్ సెంటర్లకు చెందిన వ్యక్తులు మాత్రమే ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. అది కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది. ప్రసన్న హరికృష్ణఎంత సాగిలపడినా వృధానే అనే టాక్ వినిపిస్తోంది. ఎంత సాగిలపడినా గెలుపు దారిలో ముందుకొచ్చే పరిస్ధితి కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన నిరుద్యోగుల విషయంలో గళం విప్పిందిలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన యువతకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించలేదు. కనీసం ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేసింది లేదు. నిరుద్యోగులను రెచ్చగొట్టి పరీక్ష వాయిదా కోసం ప్రయత్నం చేశాడే తప్ప, ఉద్యోగాలు నోటిఫికేషన్ కోసం ఏనాడు కృషి చేయలేదు. నిరుద్యోగుల పక్షాన పోరాటంచేసింది లేదు. ఎన్నికలకు ముందే ఇన్ని జెండాలుమార్చిన హరికృష్ణ నిరుద్యోగుల పక్షాన నిలుస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలను కలిసి టికెట్ కోసం ప్రయత్నం చేసిన హరికృష్ణ ఒక వేళ గెలిచినా, తనవ్యక్తిగత రాజకీయ ప్రతిష్ట కోసం పాకులాడుతాడే తప్ప నిరుద్యోగుల గళంకాలేడని అంటున్నారు. ఇంత కాలం కోచింగ్ సెంటర్లకోసం తపన పడ్డాడు. కోచింగ్ సెంటర్ల యజమానుల డబ్బులతో ఎన్నికల్లో నిలబడ్డాడు. కోచింగ్ సెంటర్లలో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికడతాడా? నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటాడు. ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసిన ప్రతి సందర్భంలోనూ వాటి వాయిదాల కోసమే హరికృష్ణ ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగుల నుంచి కోచింగ్ సెంటర్లు సొమ్ముచేసుకునేందుకే ఉపయోగపడతాడు. అని సాక్ష్యాత్తు బిసి సంఘాలు, పట్టభద్రులే అంటున్నారు. ఇంత మంది చెబుతున్న మాటలు వింటున్న జనం హరికృష్ణను ఆదరిస్తారని మాత్రం ఎవరూ అనుకోరు.