కల్వకుర్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ముందు ఉద్రిక్తత.
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
కల్వకుర్తి పట్టణానికి చెందిన సాబేర్ చాతి నొప్పి భరించలేక వెంకటరమణ ఆసుపత్రికి రాత్రి వెళ్లగా డ్యూటీ డాక్టర్లు పరీక్షించి ఈసీజీ తీసి,కొన్ని మందులు ఇచ్చి ఇంటికి పంపించారు, ఇంటికి వెళ్లిన కాసేపటికి సాబేర్(46) కుప్పకూలిపోవడంతో మళ్లీ అతన్ని ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన డ్యూటీ డాక్టర్ అప్పటికే సాబేర్ గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు, ఈసీజీ తీసినప్పుడే సమస్య చెప్పి ఉంటే మేము మెరుగైన వైద్యం కోసం వెళ్లే వాళ్ళమని వైద్యుల నిర్లక్ష్యం వల్లే సాబేర్ మృతి చెందాడంటూ, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆసుపత్రిలో మృతుడి బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు.
వెంకట రమణ ఆసుపత్రి లో అనుభవం లేని డాక్టర్ లు ఎంబీబీఎస్ చదవకున్న వైద్యం చేస్తున్నారు అని ఇలాంటి ఆసుపత్రిని సీజ్ చేసి మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు.