విద్యుత్ అంతరయంపై ప్రజావాణిలో ఫిర్యాదు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా భీమరం మండలం మద్దికల్ లో విద్యుత్ అంతరాయంపై స్థానిక మండల బిజెపి నాయకులు ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. తరచు విద్యుత్ లైన్లలో సమస్యలు ఏర్పడి విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామంలోని వివిధ పనులకు విద్యుత్ అంతరాయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.విద్యుత్ సమస్య ఎదురైనప్పుడు సంబంధిత సిబ్బంది స్పందించడం లేదని గ్రామ ప్రజలు ఆరోపించారని తెలిపారు.సబ్ స్టేషన్ కి ఎన్ని సార్లు ఫోన్ చేసి సమస్యను తెలిపిన ఫలితం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మాడెం శ్రీనివాస్,బిజెపి పార్టీ మండల అధ్యక్షులు బోర్లకుంట శేఖర్,ఉపాధ్యక్షులు సెగ్గం మల్లేష్ పాల్గొన్నారు.
