పద్మశాలి సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ప్రభాకర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గణపురం మండల కేంద్రానికి చెందిన కాంబత్తుల ప్రభాకర్ ను నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మొరలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత కొంతకాలంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం లో చురుగ్గా పనిచేస్తున్నందుకుగాను ప్రభాకర్ సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు. తనపై నమ్మకంతో సంఘంలో ప్రాతినిధ్యం కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి జిల్లా అధ్యక్షులు ఖ్యాతం సతీష్ కుమార్ , గౌరవ అధ్యక్షులు గోనె భాస్కర్ భీమనాథుని సత్యనారాయణ షేర్ కుమారస్వామి లకు ప్రభాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
