జాగ్రత్త.. ఈ 3 తప్పులు మిమ్మల్ని నవ్వులపాలు చేస్తాయి…

 జాగ్రత్త.. ఈ 3 తప్పులు మిమ్మల్ని నవ్వులపాలు చేస్తాయి

సమాజంలో గౌరవం, గుర్తింపు పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కొన్ని చిన్న తప్పులు మనల్ని ఇతరుల ముందు నవ్వులపాలు చేసి, మన విలువను తగ్గిస్తాయి. ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఏ తప్పులు మన గౌరవాన్ని దెబ్బతీస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: సమాజంలో గౌరవం పొందాలంటే కొన్ని అలవాట్లు తప్పనిసరిగా మానుకోవాలని ఆచార్య చాణక్యుడు సూచించారు. ఎందుకంటే.. కొన్ని చిన్న తప్పులే మనల్ని ఇతరుల ముందు నవ్వులపాలు చేసి, మన విలువను తగ్గిస్తాయి. ఇప్పుడు అలాంటి మూడు ముఖ్యమైన తప్పుల గురించి తెలుసుకుందాం..
ఆలోచించకుండా వాదించడం..

ప్రతి చిన్న విషయానికీ వెంటనే వాదనకు దిగే వాళ్లను సమాజం సీరియస్‌గా తీసుకోదని చాణక్యుడు తెలిపారు. కోపంతో లేదా సరైన సమాచారం లేకుండా మాట్లాడితే మన మాటలకు విలువ ఉండదు. అలాంటి వాళ్లను ఇతరులు తేలికగా తీసుకుంటారు, ఎగతాళి కూడా చేస్తారు. కాబట్టి మన అభిప్రాయాన్ని చెప్పేముందు ఆలోచించాలి, విషయం పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి. అలా చేస్తేనే మన మాటలకు గౌరవం ఉంటుంది..
ఇతరులను అనుసరించడం..

ఇతరుల నడవడి, మాట్లాడే శైలి, జీవన విధానాన్ని అనుసరించడం మంచిది కాదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పారు. అలా చేస్తే మనకు ప్రత్యేక గుర్తింపు ఉండదు. ఎప్పుడూ ఇతరుల్ని అనుసరించే వ్యక్తి.. జీవితంలో ముందుకు సాగలేడు. ప్రతి ఒక్కరికీ తనకంటూ ప్రత్యేకత ఉంటుంది. మన సామర్థ్యాన్ని గుర్తించి, మనదైన మార్గంలో ముందుకు వెళ్లాలి. అప్పుడే సమాజంలో మనకు గుర్తింపు వస్తుంది.

అతిగా మాట్లాడటం..

తమకు లేని గుణాలను ఉన్నట్టు చూపించడం, ప్రతి దానిలోనూ గొప్పగా మాట్లాడటం, అవసరం లేని చోట్ల జోక్యం చేసుకోవడం వంటివి చేస్తే ఇతరులు నవ్వుతారని చాణక్యుడు వివరించారు. ఇలా చేయడం వల్ల మన ఆత్మవిశ్వాసం కూడా బలహీనంగా కనిపిస్తుంది. మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి, మౌనంగా ఉండాల్సిన చోట మౌనంగా ఉండాలి. అవసరమైనప్పుడు ఆలోచించి మాట్లాడితేనే మన మాటలకు విలువ ఉంటుంది, గౌరవం పెరుగుతుంది.

యువకుడి దారుణం.. కోరిక తీర్చలేదని యువతిని..

యువకుడి దారుణం.. కోరిక తీర్చలేదని యువతిని..

 

కర్ణాటకలో దారుణం జరిగింది. రాత్రి వేళ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఇంట్లోకి ప్రవేశించిన ఓ యువకుడు.. తన కోరిక తీర్చమని ఆమెను బలవంతపెట్టాడు. ఆమె నిరాకరించడంతో గొంతు నులిమి చంపేశాడు.

ఇంటర్నెట్ డెస్క్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. రాత్రి వేళ ఆమె ఇంట్లోకి ప్రవేశించిన అతడు.. తన కోరిక తీర్చమని బలవంతపెట్టాడు. ఆమె కాదనటంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన 34 ఏళ్ల డీకే షర్మిళ అనే యువతి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోంది. రామమూర్తి నగర్‌, సుబ్రమణి లేఅవుట్‌లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటోంది. షర్మిళ పక్క ఫ్లాట్‌లో కర్నల్ కురయ్ అనే యువకుడు ఉంటున్నాడు. కర్నల్ కన్ను షర్మిళపైన పడింది. ఎలాగైనా ఆమెతో తన కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు.
సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. జనవరి 3న రాత్రి 9 గంటలకు షర్మిళ ఇంట్లోకి ప్రవేశించాడు. కిటికీ ద్వారా అతడు ఇంట్లోకి చొరబడ్డాడు. నేరుగా షర్మిళ దగ్గరకు వెళ్లి తన కోరిక తీర్చమని అడిగాడు. ఆమె ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కర్నల్ ఆమె నోరు, గొంతు గట్టిగా నొక్కిపట్టాడు. ఊపిరి ఆడకపోవటంతో ఆమె స్పృహకోల్పోయింది. అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమెకు గాయాలు కూడా అయ్యాయి. షర్మిళ చనిపోయిందని భావించిన కర్నల్ ఆధారాలను నాశనం చేయాలని అనుకున్నాడు. షర్మిళ బట్టలు, ఇతర వస్తువుల్ని బెడ్‌పై పడేసి నిప్పుపెట్టాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత షర్మిళ చనిపోయింది.ఇంట్లోంచి పొగలు రావటం గుర్తించిన పొరిగింటి వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పారు. బెడ్‌రూములో షర్మిళ విగతజీవిగా కనిపించింది. అగ్నిమాసక సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు షర్మిళ శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పొగ కారణంగా ఆమె ఊపిరి ఆడక చనిపోయి ఉంటుందని పోలీసులు మొదట భావించారు. సైంటిఫిక్ పద్దతులు, టెక్నికల్ ఆధారాలతో కర్నల్ ఈ హత్యకు పాల్పడినట్లు కనుగొన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.

మేడ్చల్‌లో గర్భిణీ భార్యను దారుణంగా హత్య చేశారు.

 గర్భవతని చూడకుండా.. రంపంతో ముక్కలు ముక్కలుగా నరికి.. మేడిపల్లిలో భర్త దారుణం..

 

నువ్వే నా ప్రాణం.. సర్వస్వమని మాయమాటలు పెళ్లి చేసుకున్న అతడు.. కొన్నేళ్లకే అసలు రూపం బయటపెట్టుకున్నాడు. గర్భిణీ అని కూడా చూడకుండా భార్యను అతి కిరాతకంగా రంపంతో ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన అందరి హృదయాలనూ కలచి వేస్తోంది.

మేడ్చల్ జిల్లా, మేడిపల్లి: మేడ్చల్ జిల్లా జరిగిన అమానవీయ ఘటన అంతటా కలకలం రేపుతోంది. మేడిపల్లి పరిధిలోని బాలాజీహిల్స్ కాలనీలో నివసిస్తున్న ఓ వ్యక్తి గర్భిణీ అయిన భార్యను అతి క్రూరంగా హతమార్చిన ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది. రంపంతో భార్యను ముక్కలు ముక్కలుగా కోసి శరీర భాగాలను మూసీ నదిలో పడేశాడు. ఇరువురి మధ్య కొన్నాళ్లుగా చెలరేగుతున్న కలహాలే హత్య దారి తీశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన ఈ దంపతులు కొన్నాళ్ల కిందటే హైదరాబాద్‌లోని బోడుప్పల్ ప్రాంతానికి వలస వచ్చారు.

వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి (వయస్సు 25), మహేందర్ రెడ్డి ఇరువురూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌ వచ్చి నెల కూడా అవలేదు. మహేందర్ ర్యాపిడో నడుపుతుంటాడు. అయితే, కొంతకాలంగా దంపతులు ఇరువురూ తరచూ గొడవపడుతున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం (ఆగస్ట్ 22) మధ్యాహ్న సమయంలో ఐదు నెలల గర్భవతిగా స్వాతిని ఆమె భర్త మహేందర్ రెడ్డి అత్యంత దారుణంగా హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి కవర్లలో పెట్టి వాటిని మూసీ నదిలో పడేసే ప్రయత్నం చేశాడు. తల, చేతులు, కాళ్లు వేరు చేసి విభిన్న ప్రాంతాల్లో వదిలిపెట్టినట్లు అతడు అంగీకరించినట్టు తెలుస్తోంది. మొండాన్ని మాత్రం ఇంట్లోనే ఉంచడంతో దుర్వాసన వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కవర్లను పరిశీలించగా మహేందర్ ఇంట్లో స్వాతి మొండెం కనిపించింది. దీంతో నిందితుడు మహేందర్ రెడ్డి పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.

స్వాతి తల్లి మీడియాతో మాట్లాడుతూ, తమ కూతురు డిగ్రీ చదువుతున్న సమయంలో మాయమాటలతో ఆకర్షించి మహేందర్ ఇంట్లోంచి తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నాడని తెలిపింది. మాట వినకుండా పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్నాళ్ల తర్వాత బంగారం కూడా ఇచ్చామంది. కానీ పెళ్లి తర్వాత మహేందర్ పూర్తిగా మారిపోయాడని.. నా కూతుర్ని చిత్రహింసలు పెట్టేవాడని.. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడనిచ్చేవాడు కాదంటూ కన్నీటిపర్యంతమైంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ హత్య పూర్తిగా ప్రణాళికాబద్ధంగానే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మిగిలిన శరీర భాగాల కోసం మూసీ నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనతో ప్రేమ వివాహాలు, గృహహింస, మహిళల భద్రత అంశాలపై మళ్లీ చర్చ మొదలైంది. ప్రేమ పేరుతో జరిగే పెళ్లిళ్లు, అనంతరం వెలుగు చూస్తున్న హింసాత్మక సంఘటనలు సమాజాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version