అలంపూర్ వాసవి సత్రానికి మాజీ ఎంపీ టి.జి. వెంకటేష్ ఆర్థిక సహాయం

మాజీ ఎంపీ టి. జి.వెంకటేష్ అలంపూర్ ఆర్యవైశ్య సత్రనికి ఆర్థిక సహాయం
వనపర్తి నేటిధాత్రి .

 

జోగులాంబ దేవి సమేత శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి సన్నిధి అల oపుర్ శ్రీ వాసవి నిత్యాన్న సత్రమునకు మాజీ ఎంపీ టి జి వెంకటేష్ ఆయన సతీమణి రాజ్యా లక్ష్మి సత్రంలో 2 ఫ్లోర్ లో కళ్యాణమంటపము నిర్మాణం కొరకు దాదాపు 55 లక్ష ల విలువ గల చెక్కును సత్రము కమిటీ కి ఇచ్చారని శ్రీ వాసవి ఆర్యవైశ్య సత్రం కమిటీ సభ్యులు తెలిపారు మాజీ ఎంపీ టిజి వెంకటేష్ కుటుంబ సబ్యులకు ఎపి మంత్రి టి జి భరత్ కు శ్రీ జోగులాంబ దేవి సమేత శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి శ్రీ వాసవి మాత గోమాత కృపా ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు ప్రసాదించాలని కోరారు ఈకార్యక్రమంలో సత్రం అధ్యక్షులు చిలుకూరు రమేష్ గుప్తా కోశాధికారి ఇల్లూరు వెంకట రామయ్య శెట్టి ఉపాధ్యక్షులు మారం బాలేశ్వరయ్య లగిశెట్టి గోపాలయ్యగారు వేముల కృష్ణమూర్తి పూరి బాలరాజు ఇటుకూరి బుచ్చయ్య బిలకంటి రాము మేడిశెట్టి బాలస్వామి ఆర్యవైశ్య లు పాల్గొన్నారు

తండ్రి జ్ఞాపకార్థం చర్చిలో కూర్చు టేబుళ్ల ఏర్పాటు

*తన తండ్రి జ్ఞాపక చర్చిలో కూర్చు టేబుల్*

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

 

ఝరాసంగం మండల కేంద్రంలో రుద్రప్ప సజ్జన్ శట్టి వారి తండ్రి బసన్న సజ్జన్ శట్టి గారి కీర్తిశేషులు బసన్న దొర గారి జ్ఞాపకార్థం ఝరాసంగం గ్రామ యొక్క చర్చిలోపలి బాగానా వచ్చిన భక్తులకు కూర్చోడానికి రెండు కూర్చు టేబుల్ లను వేయించడం జరిగింది ఏసుప్రభు దేవుడు రుద్రప్ప సజ్జన్ శట్టి దొరగారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆ యొక్క భగవంతునికి ప్రార్ధన అని భగవంతుని కోరిన భక్తులు తన తండ్రి జ్ఞాపకని దృష్టిలో పెట్టుకొని గ్రామానికి మరింత సేవా చేయాలని గ్రామ ప్రజలు కోరారు

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ప్రసాదాలు

°శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో
శ్రీవారి ధనుర్మాస ప్రసాదాలు..

*భక్తులకు ప్రతి శనివారం భోజనాలు…

తిరుపతి(నేటిధాత్రి:

 

ధనుర్మాసోత్సవాలలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఇచ్చేటువంటి ధనుర్మాస ప్రసాదాలను శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం శ్రీవారి భక్తులు జగన్నాథం మిత్ర బృందం ప్రసాదాలను పంచిపెట్టారు. శనివారం శ్రీ కోదండరాముల వారి గుడి వెనక ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భజన మందిరం వద్ద ప్రతి శనివారం శ్రీవారి భక్తులు జగన్నాథం దూడల జయగోపాల్ ఆధ్వర్యంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి ఈ శనివారం దాతగా డాక్టర్ రామబాన రమేష్ స్వామి అన్న ప్రసాదాలను పంచిపెట్టారు . ఈ సందర్భంగా టిడిపి బీసీ నాయకులు సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు మరియు శ్రీవారి భక్తులు జగన్నాథం మాట్లాడుతూ తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతి పదమైన రోజున శనివారం రోజున శ్రీవారి ఆలయం నుంచి ధనుర్మాస ప్రసాదాలను తెప్పించి భక్తులకు పంచిపెట్టామని శ్రీవారి పాదాల చెంత ఉన్న భక్తులందరూ ఆకలితో ఉండకూడదని ఈ ఒక్క రోజైనా అందరికీ భోజనాలు అందించడం ఆ దేవుని అనుగ్రహంగా భావిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా భక్తులందరూ గోవింద నామాలను జపిస్తూ ఆనందంగా అన్న ప్రసాదాలను స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జగన్నాథం మిత్రబృందం ప్రముఖ కళాకారులు శ్యాంబోల హరి, వారాహి డెవలపర్స్ ఏ.సునీల్ కుమార్ , శివాజీ , తదితరులు పాల్గొన్నారు .

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version