వినాయక చవితి నీ అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలి
– ఉప్పల్ ఎమ్మెల్యే బండారి
కాప్రా నేటిధాత్రి 23:
కాప్రా సర్కిల్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమీషనర్ జగన్ అధ్యక్షతన గణేష్ నిమర్జనోత్సవ కార్యక్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తలెత్తబోయే సమస్యలు మరియూ చేయవలసిన ఏర్పాట్ల విషయమై జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్లో జిహెచ్ఎంసి, లా అండ్ ఆర్డర్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఆర్,అండ్, బి, ఆరోగ్య శాఖ మరియు టి జి ఎస్ పి డి సి ఎల్ సభ్యులతో మరియుగణేష్ ఉత్సవ కమిటీ మరియు వివిధ కాలనీల అసోసియేషన్ వారిచే సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సలహాలు సూచనలు స్వీకరించి సమస్యలకు పరిష్కరించవలసిన వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు, సమావేశంలో పాల్గొన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు ఇతర సభ్యులు, 14 రోజులు జరిగే గణేష్ నిమర్జన కార్యక్రమం కాప్రా చెరువు చర్లపల్లి చెరువు ప్రాంతాల్లో నిమర్జనం ఏర్పాట్లు ,
హైటెన్షన్ రోడ్లలో గుంతలు లేకుండా పూడ్చడం, పనులు త్వరగా పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవలసిందిగా అందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని తెలియజేశారు, ఏ ఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి, మీర్పేట్ కార్పొరేటర్ ప్రభుదాస్,చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి ,వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.