కలెక్టరేట్‌లో 24×7 హెల్ప్‌డెస్క్ ఏర్పాటు

కలెక్టరేట్‌లో 24×7 హెల్ప్‌డెస్క్ ఏర్పాటు

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లాలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు – 2026 నిర్వహణ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో 24×7 హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఈ హెల్ప్‌డెస్క్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, సందేహాలు, సూచనలు స్వీకరించబడతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా యంత్రాంగానికి వచ్చే ఫిర్యాదులను మూడు రోజులలోపు పరిష్కరించి, వాటి నివేదికలను ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలిపారు.
ఈ హెల్ప్‌డెస్క్‌కు సంబంధించిన సెల్ నంబర్: 9030632608 కాగా, ఇది 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
హెల్ప్‌డెస్క్ నిర్వహణకు కింది సిబ్బందిని నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
ఎస్.కే. అమ్జద్ అహ్మద్ అబ్బాస్, నాయబ్ తహసీల్దార్ (ఎన్నికలు) & హెచ్ సూపరింటెండెంట్
ఎస్. సువర్ణ – ఐటీ సెల్ (ఎన్నికలు)
పి. నవీన్ – సీనియర్ అసిస్టెంట్,
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సిరిసిల్లలో వాహన తనిఖీల్లో రూ.20 లక్షల నగదు పట్టివేత

వాహనాల తనిఖీలో అనుమానాస్పదమైన నగదు పట్టివేత
– సిరిసిల్ల టౌన్ రగుడు ఎస్.ఎస్.టి చెక్‌పోస్ట్ వద్ద
– మున్సిపల్ ఎలక్షన్స్ నేపథ్యంలో
– ఎస్ ఎస్ టి, ఏపీవో సమక్షంలో స్వాధీనం
– సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే.కృష్ణ

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

శుక్రవారం 30-01-2026 ఉదయం సుమారు 07:45 గంటలకు కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల మండలం, రగుడు వద్ద ఉన్న ఎస్.ఎస్.టి చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించబడినవి.
ఈ సందర్భంగా టి.జి 23 ఎ 1524 నంబర్ గల కారును పోలీస్ బృందం ఆపి తనిఖీ చేయగా, కార్ డ్రైవర్/యజమాని గణాచారి సంభాషివ్, తండ్రి శంకరయ్య, నివాసం ఇంటి నం. 6-3-65, మార్కెట్ రోడ్, వేములవాడ పట్టణం, రాజన్న సిరిసిల్ల జిల్లా గల వ్యక్తి, తన కారులో లెక్కలలో లేని మరియు అనుమానాస్పదమైన నగదు రూ. 20,00,000/- (రూపాయలు ఇరవై లక్షలు మాత్రమే) తీసుకెళ్తున్నట్లు గుర్తించబడినది.
ఆ నగదు మొత్తాన్ని ఎన్నికల నిబంధనలు మరియు చట్టపరమైన విధానాల ప్రకారం, ఎస్.ఎస్.టి బృంద ఇన్‌చార్జ్ జి. ఆనంద్, ఎ.పి.ఓ సమక్షంలో మధ్యవర్తుల (పంచనామా సాక్షుల) సమక్షంలో స్వాధీనం చేసుకోవడమైనది. ఆ నగదు యొక్క మూలం మరియు ఉపయోగ ఉద్దేశ్యం తెలుసుకునేందుకు తదుపరి విచారణ / దర్యాప్తు కొనసాగుతోందని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే.కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version