కలెక్టరేట్లో 24×7 హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లాలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు – 2026 నిర్వహణ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో 24×7 హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఈ హెల్ప్‌డెస్క్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, సందేహాలు, సూచనలు స్వీకరించబడతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా యంత్రాంగానికి వచ్చే ఫిర్యాదులను మూడు రోజులలోపు పరిష్కరించి, వాటి నివేదికలను ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలిపారు.
ఈ హెల్ప్‌డెస్క్‌కు సంబంధించిన సెల్ నంబర్: 9030632608 కాగా, ఇది 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
హెల్ప్‌డెస్క్ నిర్వహణకు కింది సిబ్బందిని నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
ఎస్.కే. అమ్జద్ అహ్మద్ అబ్బాస్, నాయబ్ తహసీల్దార్ (ఎన్నికలు) & హెచ్ సూపరింటెండెంట్
ఎస్. సువర్ణ – ఐటీ సెల్ (ఎన్నికలు)
పి. నవీన్ – సీనియర్ అసిస్టెంట్,
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
