మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్ పూర్తయ్యింది

సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో ఏర్పాటు చేసిన 265 పోలింగ్ కేంద్రాలకు గాను 265 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 53 మంది రిజర్వ్ పి. ఓ.లు,265 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 53 మంది ఎ.పి.ఓ.లు,795 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 159 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 34 వార్డులలో ఏర్పాటు చేసిన 68 పోలింగ్ కేంద్రాలకు గాను 68 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 14 మంది రిజర్వ్ పి. ఓ.లు,68 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 14 మంది ఎ.పి.ఓ.లు,204 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 41 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని 18 వార్డులలో ఏర్పాటు చేసిన 36 పోలింగ్ కేంద్రాలకు గాను 36 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 7 మంది రిజర్వ్ పి. ఓ.లు,36 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 7 మంది ఎ.పి.ఓ.లు,108 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 22 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 22 వార్డులలో ఏర్పాటు చేసిన 45 పోలింగ్ కేంద్రాలకు గాను 45 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 9 మంది రిజర్వ్ పి. ఓ.లు,45 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 9 మంది ఎ.పి.ఓ.లు,135 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 27 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని 15 వార్డులలో ఏర్పాటు చేసిన 15 పోలింగ్ కేంద్రాలకు గాను 30 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 6 మంది రిజర్వ్ పి. ఓ.లు,30 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 6 మంది ఎ.పి.ఓ.లు,90 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 18 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.సిబ్బంది తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.అధికారులకు అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్,ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version