మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్ పూర్తయ్యింది

సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో ఏర్పాటు చేసిన 265 పోలింగ్ కేంద్రాలకు గాను 265 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 53 మంది రిజర్వ్ పి. ఓ.లు,265 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 53 మంది ఎ.పి.ఓ.లు,795 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 159 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 34 వార్డులలో ఏర్పాటు చేసిన 68 పోలింగ్ కేంద్రాలకు గాను 68 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 14 మంది రిజర్వ్ పి. ఓ.లు,68 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 14 మంది ఎ.పి.ఓ.లు,204 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 41 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని 18 వార్డులలో ఏర్పాటు చేసిన 36 పోలింగ్ కేంద్రాలకు గాను 36 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 7 మంది రిజర్వ్ పి. ఓ.లు,36 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 7 మంది ఎ.పి.ఓ.లు,108 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 22 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 22 వార్డులలో ఏర్పాటు చేసిన 45 పోలింగ్ కేంద్రాలకు గాను 45 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 9 మంది రిజర్వ్ పి. ఓ.లు,45 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 9 మంది ఎ.పి.ఓ.లు,135 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 27 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని 15 వార్డులలో ఏర్పాటు చేసిన 15 పోలింగ్ కేంద్రాలకు గాను 30 మంది పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 6 మంది రిజర్వ్ పి. ఓ.లు,30 మంది ఎ.పి.ఓ.లతో పాటు 20 శాతం అదనంతో 6 మంది ఎ.పి.ఓ.లు,90 మంది ఓ.పి.ఓ. లతో పాటు 20 శాతం అదనంతో 18 మంది ఓ.పి.ఓ.లను రాండమైజేషన్ జరిగిందని తెలిపారు.సిబ్బంది తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.అధికారులకు అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్,ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…

ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్ నేటి,ధాత్రి:

 

జైపూర్ మండలం మూడో విడత జడ్పీ హైస్కూల్ ఎన్నికల కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు.బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగా పరిశీలించాలని,భోజన వసతి ఏర్పాట్లలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ సునయాసంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,ఏ.ఆర్ రాజ్ కుమార్ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా…

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా

ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి

కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాలు

వనపర్తి నేటిదాత్రి .

శనివారం కలెక్టర్ కార్యల్యములో పి ఒ, ఏ పీ ఓ లకు అక్టోబర్ 6న ఒకరోజు శిక్షణ కార్యక్రమం పై ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వెబ్ ఎక్స్ ద్వారా సమావేశం సూచనలు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిర్వహణలో కీలక పాత్ర వహించే ప్రీసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు గదులు మైక్ సిస్టమ్, పవర్ పాయింట్ ద్వారా అవగానం కల్పించేందుకు ఏర్పాట్లు తదితర అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారుఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల నిర్వహణ కోసం పీఓ లకు సోమవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలన్నారు
పీఓలకు ఈ ట్రైనింగ్ కార్యక్రమం చాలా కీలకమని, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు
శిక్షణ సందర్భంగా పోలింగ్ నిర్వహణకు , పి. ఒ ల పోలింగ్ శిక్షణను నిర్వహించాలన్నారు. పీఓలకు శిక్షణ సమయంలో వారి విధులకు సంబంధించిన హ్యాండ్ బుక్ అందజేయాలనీ నిబంధనలతో పాటు బ్యాలెట్ బాక్స్ నిర్వహణ హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇవ్వాలనీ సూచించారు.
శిక్షణ కు వచ్చే పీఓ లకు పోస్టల్ బాలట్ ఫారం 14 కూడా అందజేయాలన్నారు పోలింగ్ కేంద్రంలో ఏం జరిగిన పీఓలదే బాధ్యత అని జాగ్రత్త గా వ్యవహారించాలని వారికి తెలియజేయాలన్నారు.ఈసమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డివో సుబ్రహ్మణ్యం, డీపీఓ రఘనాథ్, డప్యూటీ సీఈఓ రామ మహేశ్వర్, డి ఈ ఓ అబ్దుల్ఇ ఘని, ఏ ఓ భాను, అధికారులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version