ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సర్పంచ్…

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సర్పంచ్

అభివృద్ధి దిశగా పంచాయతీలో పనులు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా మోతే గ్రామంలోని ముత్యాలమ్మ గుడి ఆవరణలో భక్తుల సౌకర్యం మరియు ప్రజల మంచినీటి అవసరాల నిమిత్తం హ్యాండ్ బోర్ అవసరం ఉందని సర్పంచ్ దృష్టికి తీసుకొని రాగా స్పందించి పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు సంబంధించిన అధికారులు ఎంపీడీవో మరియు ఎంపీవోతో మాట్లాడి వారి సహకారంతో ఎంపీపీ నిధులలో మంజూరు చేయించి ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించి నూతన బోర్ పనులను ప్రారంభించిన సర్పంచ్ సుజాత పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయద్ ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ముత్యాలమ్మ గుడి వద్దకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి సౌకర్యం కోసం అలాగే గ్రామ ప్రజలకు కూడా త్రాగునీటికి ఈ బోర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అక్కిరెడ్డి నిర్మల, సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు, ఎల్లి సోమిరెడ్డి, బుడగ వెంకన్న, అక్కిరెడ్డి మల్లారెడ్డి, రాజేందర్, మోతే గ్రామస్తులు పెద్దలు పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

వారపు సంత ప్రచారాన్ని ప్రారంభించిన సర్పంచ్ సుజాత..

వారపు సంత ప్రచారాన్ని ప్రారంభించిన సర్పంచ్ సుజాత

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,,నేటిధాత్రి..

 

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మరియు సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు తిధి 13 -2-2026 శుక్రవారం రోజున వారపు సంత ఏర్పాటు చేయడం కోసం పాలకవర్గంలో తీర్మానం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సర్పంచ్ సుజాత ఉప సర్పంచ్ బుడగం రాము మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ జెండా ఊపి ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎర్ర సురేష్, జలగం కృష్ణ, ముంజాల సాయిబాబా, వార్డు మెంబర్లు పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

వ్యతిరేక చర్యలు చేపడితే ఉపేక్షించేది లేదు..

వ్యతిరేక చర్యలు చేపడితే ఉపేక్షించేది లేదు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య

గుండాల,నేటిధాత్రి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం గుండాల మండల సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్బంగా 3వ విడుతలో భాగంగా గుండాల మండల కేంద్రం గుండాల గ్రామ పంచాయతీ లో మిత్రపక్షం సిపిఐ సహకారం తో కాంగ్రెస్ పార్టీ తరుపున నిలపడిన అభ్యర్థికి కాకుండ ఇతర పార్టీలతో జతకలిసి కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకం గా ఓట్లు వేపించి పార్టీ ఓటమి కోరుకుంటునటువంటి ఈసం పాపారావు వ్యక్తి పైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధిష్టానం అతనిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య తెలియజేసారు. గతంలో కూడా ఇలా వ్యవహరించినట్టు సమాచారం అయినా తన సీనియర్టిని గౌరవించి మందలింపూ తో సరిపెట్టడం జరిగింది కానీ పార్టీ ఓటమి కోసం పని చేస్తుంటే ఇక ఉపేక్షించేది లేదని గురువారం నుండి ఈసం పాపారావు కు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని తనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ గుండాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేశారు. అంతే కాక భవిష్యత్ లో ఇలాంటి కార్యక్రమాలు ఎవరు నిర్వహించిన వారు ఏ స్థాయి వ్యక్తులు అయినా సరే పార్టీ నుండి ఇలాంటి క్రమ శిక్షణా చర్యలే ఎదురుకోవలసి వస్తదని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version