సొంత ఖర్చులతో విద్యుత్ మోటార్ల ఏర్పాటు
మాజీ ఉపసర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డి
జైపూర్,నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ,ఎస్టి కాలనీ, అంబేద్కర్ కాలనీలో బోర్వెల్ కు సంబంధించిన విద్యుత్ మోటర్లు చెడిపోయి నీటి వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు స్థానిక కాంగ్రెస్ నాయకులకు తెలిపారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన,గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశాల మేరకు మాజీ ఉపసర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డి కాలనీవాసులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను11 బోర్లు బిగించి నీటి కొరతను తీర్చారు.ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి మంతెన లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న నేటి సమస్యలను తీర్చడంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముందుంటారని అన్నారు.ప్రభుత్వ నిధులతోనే కాకుండా తమ విశాఖ ట్రస్ట్ ద్వారా అనేక బోర్ బావులు వేపించి ప్రజల కష్టాలు తీర్చారని తెలిపారు.అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలను నియోజకవర్గంలోని ప్రజలందరికీ చేరువ చేస్తూ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు.అదేవిధంగా సొంత ఖర్చులతో విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసిన మాజీ ఉపసర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డికి కాలనీవాసులు అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబల్ల రవి,మాజీ వార్డు సభ్యులు అరిగేల శ్రీనివాస్,ఇరిగిరాల శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.