ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి

పరకాల నేటిధాత్రి
పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ని రెండోవార్డ్ కు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు బొమ్మకంటి రుద్రమదేవి చంద్రమౌళికీ ఇల్లు మంజూరు కావడం జరిగింది.ముఖ్య అతిథిగా పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి రెండో వార్డులో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేసి,కొబ్బరికాయ కొట్టి ఇల్లు నిర్మాణం కోసం ముగ్గు పోసి ప్రారంభించడం జరిగింది.గత పది సంవత్సరాలుగా ఏ ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయని గత ప్రభుత్వం కేవలం అసమర్థ పాలన పరిపాలించిందని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజా సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలను ఆదుకునే రీతిలో నడిపిస్తున్నదని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కట్టుకుని బాగుపడాలని అర్హులైన వారికి ఇండ్లు మంజురు చేసి వారిని ఆదుకునే రీతిలో ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ బొమ్మకంటి రుద్రమదేవి – చంద్రమౌళి,(ఎస్సీ సెల్ అధ్యక్షులు)హనుమకొండ జిల్లా సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్,కాంగ్రెస్ నాయకులు మచ్చ సుమన్, పోరండ్ల వేణు,బొచ్చు మోహన్,బొచ్చు జెమిని, దావు పరమేశ్వర్ వార్డ్ ఆఫీసర్ కృష్ణంరాజు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు మడికొండ కవిత చంగల్ రావు,రిటైర్డ్ హెచ్ఎం ఆకునూరి పుష్ప విజయ్ కుమార్,రిటైర్డ్ సిఎస్ఐ పాస్టర్ రెవరెండ్ బొచ్చు ప్రకాశం మంద మహేష్ ,ఒంటేరు అమర్నాథ్, కుక్ మూడి రాజారాం చుక్క శాంతి కుమార్,దుప్పటి అన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

బిసిలను దళితులను మోసం చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం.

బిసిలను దళితులను మోసం చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం

దళితులకు దళిత బందు 12 లక్షల రూపాయలు ఇవ్వాలి

బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు

నేటిధాత్రి చర్ల

 

 

shine junior college

 

బిసిలను మోసం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అని బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు విమర్శించారు బిసిలకు రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో 80 శాతం బిసిలు ఉన్నారు వారికి నష్టం చేస్తే బిసిలు చూస్తు ఊరుకోరని ఏన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పుతారని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేయడం లేదు 6 గ్యారంటీలు 420 హమీలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క పధకం అమలు చేయడం లేదు తులం బంగారం లేదు ఆసరా పెన్షన్లు 4 వేలు లేదు వికలాంగులకు 6000 పెన్షన్ ఇవ్వాలి ప్రతీ మహిళకు 2500 లేదు రైతు భీమా లేదు 500 లకు గ్యాస్ లేదు రాజీవ్ వికాస అనేక వేల మంది నిరుద్యోగులను మోసం చేసారు దళితబందు 12 లక్షలు లేవు జూన్ 2 న నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు అందిస్తామని చెప్పారు దాని విషయం మర్చిపోయారు నిరుద్యోగులు బ్యాంక్ ల ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఏది ఏమైనా బిసి రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేని ఎడల బిసిలు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందజేయాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందజేయాలి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

 

గత సీజయన్ లో రైతు భరోసా ఇవ్వని రైతులకు వెంటనే రైతు బరోసా డబ్భులు ఇవ్వాలని బిఆర్ఎస్ నర్సంపేట మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో అధ్యక్షుడు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ గతకాలం సీజన్ లో రైతులకు రైతు భరోసా కేవలం 3 ఎకరాలలోపు ఉన్న కొందరు రైతులకు మాత్రమే రైతు భరోసా వేశారని ఇప్పుడు వానాకాలం సీజన్ మొదలు అవుతుందని అన్నారు.గౌరవ తెలంగాణ తోలి ముఖ్యమంత్రి కేసిఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రైతు బందును సమయానికి రైతుల ఖాతాలో వేసి రైతులకు అదుకున్నారని పేర్కొన్నారు. నేడు ముఖ్యమంత్రి ఓక సీజన్ రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశాడని ఆరోపించారు.ఎలాంటి అంక్షలు లేకుండా రైతు భరోసా బాకి ఉన్న రైతులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరాములు,మోతే జైపాల్ రెడ్డి,మోతే పద్మనాభ రెడ్డి,కోమల్ల గోపాల్ రెడ్డి,బండారి రమేష్,మోటూరి రవి,కోడారి రవి,తాల్లపెల్లి రాం ప్రసాద్,భూక్య వీరన్న,కడారి కుమారస్వామి,పెద్ది శ్రీనివాస్ రెడ్డి,వళ్ళల కర్ణకార్,అల్లి రవి,మర్ద నవీన్,సంగెం శ్రీకాంత్,చిప్పు రాజు తదితరులు ఉన్నారు.

మైనార్టీ వర్గానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్.

మైనార్టీ వర్గానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం –

 

బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా

కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్లతోనే గెలుస్తుందని చెప్పుకునే కాంగ్రెస్ లీడర్స్ మరి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి ఏడాదిన్నర అవుతున్న కూడా ఒక్క మినిస్ట్రీ కూడా మైనార్టీ వర్గానికి ఎందుకు కేటాయించలేదు అని జ్యోతి పండాల్ ప్రశ్నించారు.

 

దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వాళ్ళని ఓట్ల కోసమే వాడుకుంటుందని చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుందని మరియు మైనార్టీ వారి పట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎంత చిత్తశుద్ధి ఉందోనని దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు.

 

ఇది వారి వర్గానికి అన్యాయం చేయడమే అవుతుంది అని జ్యోతి పండాల్ అన్నారు.

 

మైనారిటీ వర్గం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చాలా చిన్న చూపు మరియు వివక్ష చూపిస్తుందని జ్యోతి పండాల్ అన్నారు.

 

సెంట్రల్ లో ఉన్న మా బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీ వాళ్ళ కోసం చాలా స్కీమ్స్ అమలు చేసి అట్టడుగు వర్గాల మైనార్టీ వాళ్ళని ఎన్నో విధాలుగా ఆదుకుంటుంది అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను.

 

రెండు సంవత్సరాల క్రితం అంటే 2022 నాటికే ఇల్లు లేని వాళ్ళ కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 14 లక్షలు పైగా ఇండ్లని ముస్లిం మైనారిటీలకు కేటాయించడం జరిగింది.

 

అలాగే ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఎవరైతే డబ్బులు పెట్టుకొని చదువుకో లేని స్థితిలో ఉంటారో వారి కోసం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, అండర్ గ్రాడ్యుయేట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఇలా అన్ని వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటుంది మా బిజెపి ప్రభుత్వం.

 

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మైనార్టీలను మభ్యపెట్టి ఎలక్షన్ టైం లో వాళ్ళ ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పైన చిన్నచూపు చూసి వాళ్ళని కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని జ్యోతి పండాల్ అన్నారు.

 

కావున కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఓట్లు వేసిన ముస్లిం మైనారిటీల పట్ల వివక్షత, చిన్న చూపు మరియు కించపరిచేలా ప్రవర్తించవద్దని జ్యోతి పండాల్ కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.

సొంత ఇంటి కల నెరవేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

సొంత ఇంటి కల నెరవేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం.

నరసింహులపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు సొంతింటి కలను నెరవేరుస్తున్న ఏకైక ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అని .

ఇందుకుగాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి. గత ప్రభుత్వం.

ఎన్నో ప్రాజెక్టు ల. పేరిట. అప్పులు.చేసిన కూడా. వాటిని కట్టుకుంటూ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని

ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డికి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి.

మంత్రి పొన్నం ప్రభాకర్ కి. ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ.నియోజవర్గ ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు.

అలాగే ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం అందిస్తుందని నిర్మాణాలకు ఇసుక ఉచితంగా సరఫరా ప్రభుత్వమే చేస్తుందని లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేసుకుంటూ.

ఇల్లు నిర్మాణం చేపట్టి పనులు వేగవంతంచేసి ఇందిరమ్మ ఇంటి సహకారం ఇందిరమ్మ కలను సహకారంచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ పేరిట ప్రజల సొమ్ము దోచుకున్నారని ప్రజా ప్రభుత్వంలో ఇప్పటి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనలో.

అటువంటి వాటికి తావు లేకుండా ఉంటుందని

ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు అధికారులకు నాయకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన లబ్ధిదారులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. ఏఎంసి వైస్ చైర్మన్.

నేరెళ్ల నరసింహం గౌడ్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి.

సత్తు శ్రీనివాస్ రెడ్డి. ఏం సి డైరెక్టర్ పరశురాములు. కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షులు మల్లేశం యాదవ్.

కాంగ్రెస్ పార్టీ నాయకులు కటకం రాజశేఖర్. జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ. తిరుపతి. కిషన్. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

హోం మినిస్టర్‌ రాములమ్మ.

-తెలంగాణ తొలి మహిళా హోం మినిస్టర్గా విజయశాంతి.

FOR E-PAPER CLICK BELOW LINK

https://epaper.netidhatri.com/view/610/netidhathri-e-paper-3rd-june-2025

-తెలంగాణ కోసం అందరినీ ధిక్కరించిన ధీశాలి విజయశాంతి.

-నాలుగు సంవత్సరాల పాటు నిరంతరం పార్లమెంటు సమావేశాలను అడ్డుకున్న ఏకైక తెలంగాణ నాయకురాలు.

home minister vijayashanthi

-డిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

-బిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే ఉద్యమ కారులతోనే ఎదుర్కోవాలి.

-బిఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగట్టాలంటే విజయశాంతి లాంటి వాళ్లే కావాలి.

-ఉద్యమ ఆకాంక్షలు, కేసిఆర్‌ మోసాలు తెలిసిన నాయకురాలు విజయశాంతి.

-అధిష్టానం ఇప్పటికే స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది.

-ఏపిలో కూడా మహిళా హోం మంత్రి వున్నారు.

-డైనమిక్‌ విజయశాంతికి హోం బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారు.

-రాములమ్మ కాంగ్రెస్‌లో చేరినప్పుడే ఇచ్చిన మాట.

-తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆనాడు పార్టీలో చేరారు.

-అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు.

-తెలంగాణ కోసం తల్లి తెలంగాణ ఏర్పాటు చేసిన విజయశాంతి.

-రాష్ట్ర ఏర్పాటు కోసం జీవితం త్యాగం చేసిన నాయకురాలు విజయశాంతి.

-ఏనాడు పదవుల కోసం ఆశించి రాజకీయాలు చేయలేదు.

-పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి కెరియర్‌ కూడా వదులుకున్నారు.

-ఎన్నికల రాజకీయాలలో పదవుల అనుభవించిన వారు త్యాగాలు అని చెప్పుకుంటున్నారు.

-విజయశాంతి త్యాగం అంతకన్నా వెయ్యి రెట్లు ఎక్కవ.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాములమ్మ హోం మంత్రి కాబోతున్నారా? అంటే డిల్లీ సర్కిళ్లలో ఔననే సమాధానం వస్తోంది. మంత్రి వర్గ విస్తరణలో కచ్చితంగా ఎమ్మెల్సీ విజయశాంతిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్సీల నుంచి ఎవరూ మంత్రి లేరు. ఎమ్మెల్సీ కోటాలో ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అనుకుంటున్నట్లు చెబుతున్నారు. పైగా బిసి సామాజిక వర్గానికి మరింత ప్రాదాన్యతనిచ్చినట్లు సంకేతాలు కూడా కాంగ్రెస్‌ పంపాలని అనుకుంటోంది. అందుకే ఆరు మంత్రి పదవులు ఇంకా భర్తీ చేయాల్సిన అవసరం వుంది. అయితే అవి ఇప్పుడే భర్తీ చేస్తారా? లేక ఇంకా కొంత కాలం ఆగి చేస్తారా? అన్నది త్వరలోనే తేలనుంది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి డిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. పార్టీ పరమైన పదవులు ఇప్పటికే చాలా వరకు కొలిక్కి వచ్చాయి. అందుకు సంబంధించిన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. పదవుల పంపకాలు దాదాపు పూర్తయినట్లే లెక్క. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మాత్రమే మిగిలివున్నాయి. పార్టీ ఉపాధ్యక్ష పదవులు ఇంకా రాలేదని కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్‌లో వున్న పార్టీపరమైన సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యేలందరూ పార్టీ అటోమెటిగ్‌గా ఉపాధ్యక్షులౌతారు. ఇది అనాదిగా ఆపార్టీలో అనుసరిస్తున్న సంప్రదాయమే. అవి కూడా పూర్తయనట్లే లెక్క. ఇక మిగిలినవి మంత్రి పదవులు. నామినేటెడ్‌ కార్పోరేషన్‌పదవులు ఇంకా కొన్ని పెండిరగ్‌లో వున్నాయి. ముఖ్యమంత్రి డిల్లీ పర్యటనలో నామినేటెడ్‌ పదవులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం వుంది. కాని మంత్రి పదవుల పంపకాలలో కొన్ని పీట ముడులున్నాయి. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం మేరకు ఒక్క రాములమ్మకు మాత్రమే మంత్రి పదవి ఖాయమైందని తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకురాలు. తెలంగాణ ప్రకటన వచ్చిన వెంటనే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో చేరుతామని బిఆర్‌ఎస్‌లో వున్నప్పుడు చెప్పిన మాటకు కట్టుబడి ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఆ సమయంలో ఆమె మెదక్‌ పార్లమెంటును పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె ఎన్నికల్లో పోటీచేసేందుకు పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. పార్టీ నుంచి సూచనలు వచ్చినా ఆమె పార్టీకి సేవ చేయడానికే పరిమితయ్యారు. అందుకే ఆమె 2018 ఎన్నికల్లో ప్రచార కమిటీ చైర్‌ పర్సన్‌గా బాద్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆమెకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత దక్కడం లేదని ఎన్ని రకాల వార్తలు వచ్చినా స్పందించలేదు. తాను కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తిగా వున్నానని కూడా చెప్పలేదు. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా ఆమె చేసుకుంటూ వెళ్లారు. అంతే తప్ప ఎక్కడా పార్టీపై ఇంత వరకు ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. తాను చేసిన సేవలకు, తెలంగాణ ఉద్యమ కారిణిగా సరైన సమయంలో సరైన గుర్తింపు వస్తుందని మాత్రం నమ్మకంతో వున్నారు. ఆ నమ్మకమే ఇప్పుడు వరంగా మారింది. తెలంగాణ వచ్చిన సమయంలో పార్టీ ఆమెకు కొన్ని వాగ్ధానాలు చేసింది. పార్టీ అధికారంలోకి వస్తే సముచితస్ధానం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ పదేళ్లలో ఆమె ఎన్ని రాజకీయ పరిణామాలు జరిగినా, కాంగ్రెస్‌లోనే వున్నది. ఓ దశలో రాములమ్మ కాంగ్రెస్‌లో వున్నట్లా? లేనట్లా? అంటూ వార్తలు కూడా వచ్చాయి. గత ఎన్నికల్లో ఎన్నికల ప్రచారానికి పిలుపు లేదని కూడా ఆమె ఎక్కడా ఒక్క ప్రకటన కూడా చేసింది లేదు. సమయం కోసం వేచి చూశారు. ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల ముందు వరకు కూడా ఆమెకు పదవి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అంటే కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఎంత నిబద్దతతో వుంటుందో ఈ ఒక్క విషయంలోనే తేలిపోయింది. ఎంతో మంది పేరు ఎమ్మెల్సీల ఎంపికలో వచ్చినా, విజయశాంతికి ఇస్తారని ఎవరూ ఊహించలేదు. విజయశాంతి అంటే కాంగ్రెస్‌ పార్టీకి ఎంత విశ్వాసమో అర్దం చేసుకోవచ్చు. ఎందుకంటే విజయశాంతి అంటే సామాన్యురాలు కాదు. ఆమె ఒకప్పటి సినీ సూపర్‌ స్టార్‌. ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోయినా, మూడు దశాబ్దాల పాటు ఆమె సినీ పరిశ్రమను ఏలిన నటి. తెలుగు, తమిళ్‌, హిందీ భాషలలో ఆమె అగ్రశ్రేణి నటిగా ఓ వెలుగు వెలిగారు. దేశమంతా లేడీ అమితాబ్‌ అని కీర్తించేవారు. ఆమెతో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూలో వుండేవారు. కేరిర్‌ పీక్‌ స్టేజ్‌లో వున్నప్పుడు ఆమె జై తెలంగాణ అన్నారు. ఇప్పటి వరకు సినిమా పరిశ్రమ ఇచ్చింది చాలు. ప్రేక్షకుల ప్రేమచాలు. ఇక తన పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడం కోసం వస్తున్నానని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. నిజానికి ఆమె రాజకీయంగా పదవులే కావాలనుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో పదవులు వచ్చేవి. తమిళనాడులో కూడా ఆమెకు పెద్ద పెద్ద పదవులే వచ్చేవి. ఎందుకంటే తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు విజయశాంతి ఎంతో సన్నిహితురాలు. ఆమె రాజకీయం చేయాలనుకుంటే తమిళనాడు నుంచికూడా ఎమ్మెల్యే అయ్యేది. మంత్రి అయ్యేది. కాని ఆమె తెలంగాన ఉద్యమంలోకి వచ్చారు. కేరీర్‌ వదులుకున్నారు. కోట్ల రూపాయల సంపాదన వద్దనుకున్నారు. కార్లు, అద్దాల మేడలు, ఏసి గదుల్లో జీవితం వదులుకొని ప్రజా క్షేత్రంలోకి వచ్చారు. తెలంగాణ ప్రజలకు తోడుగా పోరాటంలోకి దిగారు. తల్లి తెలంగాణ రాజకీయ పార్టీని పెట్టారు. తాను సంపాదించిన కోట్లాది రూపాయలను ఆమె ఉద్యమానికి ఖర్చు చేశారు. తల్లి తెలంగాణ పార్టీ నిర్వహణకు కోట్లు ఖర్చు చేశారు. నిజానికి ఆమె ఆ పార్టీని అలాగే నడిపి వుంటే ఆమె రాజకీయ భవిష్యత్తు మరోలా వుండేది. ఆమె ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చేది. కేసిఆర్‌ మాటలు నమ్మి, కేవలం తెలంగాణ కోసం పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేసింది. ఆ సమయంలో ఎంతో మంది కేసిఆర్‌ పార్టీలో తల్లి తెలంగాణను విలీనం చేయొద్దని సూచించారు. కేసిఆర్‌ వల్ల మొదటికే మోసం వస్తుందని కూడా హెచ్చరించారు. ఎందుకంటే అప్పటికే తల్లి తెలంగాణ పార్టీ తెలంగాణ అంతటా విస్తరించింది. అన్ని జిల్లాల కమిటీలు వేయడం జరిగింది. టిఆర్‌ఎస్‌కు పోటీగా తల్లి తెలంగాణ ఎదిగింది. ఆ పార్టీ కోసం, ఉద్యమం కోసం కొన్ని వందల మంది తల్లి తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా పెద్దఎత్తున ఖర్చు చేసింది. వాళ్లందరికీ బిఆర్‌ఎస్‌లో సముచిత స్ధానం వుంటుందని విజయశాంతిని నమ్మించారు. చివరికి ఆమెను కూడా కేసిఆర్‌ నట్టెట ముంచారు. తొలుత విజయశాంతిని సొంత చెల్లెలుకన్నా ఎక్కువ అంటూ ఆమెను నమ్మించారు. తర్వాత ఆమె ప్రాధాన్యత తగ్గిస్తూ పోయారు. అయినా ఆమె ఏనాడు వెరవలేదు. తెలంగాణ కోసం మాత్రమే తాను వచ్చానని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప తనకు ప్రత్యేకమైన రాజకీయం అవసరంలేదని తేల్చి చెప్పారు. టి ఆర్‌ఎస్‌ నుంచి తప్పించినా, ఆమె చిరునవ్వుతోనే స్వాగతించింది. తాను కోరుకున్న రాష్ట్రం ఏర్పాటైందన్న సంతోషమే ఆమె ఎక్కువ పడిరది. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర సాధనలో కీలకభూమిక పోషించిన చరిత్ర చాలనుకున్నది. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో చేరుతానన్న మాటను కూడా నిలబెట్టుకున్నది. ఆమె అంకితభావం కాంగ్రెస్‌ పార్టీ గుర్తించింది. అంతే కాదు తెలంగాణ ఉద్యమ సమయంలో విజయశాంతి పోరాట పటిమ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యక్ష్యంగా చూసింది. డిసెంబర్‌ 9 ప్రకటన పరిణామాల తర్వాత జరిగిన ఉద్యమంలో విజయశాంతి చూపిన చొరవ అంతా ఇంతా ఇంతా కాదు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు సాగిన పార్లమెంటు సమావేశాలను ఏ ఒక్కనాడు సజావుగా సాగకుండా అడ్డుకున్న ఏకైన నాయకురాలు విజయశాంతి. నాలుగేళ్ల సుధీర్ఘ కాలం అంటే సామాన్యమైన విషయం కాదు. నిత్యం ఆమె సభ జరుగుతున్నంత సేపు నిలబడి నిరసన తెలియజేసేశారు. వెల్‌లోకి దూసుకెళ్లెవారు. ఆ అవకాశం దక్కనప్పుప్పుడు తనసీట్‌ వద్దనే నిలబడి నిరసన తెలియజేసేవారు. నిజానికి లోక్‌సభ సమావేశాలకు కేసిఆర్‌ పెద్దగా హజరయ్యేవారు కాదు. బడ్జెట్‌సమావేశాలకు కూడా వెళ్లేవారు కాదు. కాని విజయశాంతి ఏ ఒక్కరోజు కూడా వెళ్లకుండా వుండలేదు. నిరసన తెలియజేయని రోజంటూ లేదు. అలా నాలుగు సంవత్సరాల పాటు లోక్‌సభలో నిరవదిక నిరసన చేసిన ఏకైక నాయకురాలు విజయశాంతి. ప్రపంచ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డు అని కూడా చెప్పడంలో సందేహం లేదు. అలాంటి ఉద్యమకారిణి విజయశాంతి త్వరలో తెలంగాణ మంత్రి కానున్నారు. ఆమె చేసిన త్యాగం వృధా కాలేదు. కాస్త ఆలస్యం కావొచ్చు. కాని గుర్తింపు ఎప్పటికైనా పక్కా అనుకున్న ఆమె నమ్మకం మరోసారి నిలబడిరదనే చెప్పాలి.

కాంగ్రెస్ ప్రభుత్వంలో చితికిపోయిన వ్యవసాయ రంగం.

కాంగ్రెస్ ప్రభుత్వంలో చితికిపోయిన వ్యవసాయ రంగం.

కరెంటు లేక ఎండుతున్న పంటలు..

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపు..

నర్సంపేట, నేటిధాత్రి:

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా చితికిపోయింది, రైతులు మానసిక ఒత్తిడికి గురైతున్నారు.రైతులకు ఆర్దికంగా చేయూతలేదు.పంటల నష్టం జరిగితే ఏ నాయకుడు రైతులకు మొఖం చూపెట్టలేని పరిస్థితి వచ్చిందని తెలంగాణ ఉద్యమనేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.బిఆర్ఎస్ పార్టీ 25 యేండ్ల రజితోత్సవ సభ ఏర్పాట్లు,సభ సక్సెస్ పట్ల నర్సంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ 2 వ పంటకు సరిపడా నీళ్లు ఇవ్వక అవి చేతికిరాకముందే పశువులను మేపే పరిస్థితి,అలాగే కరెంట్ సరిపడా ఇవ్వకపోవడంతో కరెంట్ మోటార్ల తోనే రైతులు జీవిస్తూన్నారని పేర్కొన్నారు.వ్యవసాయం అంటేనే కేసీఆర్ అని వ్యవసాయాన్ని పండుగగా చేసి చూపించిన ఘనత ఆయనకే దక్కిందని వివరించారు.ఏరికోరి కొని తెచ్చుకుంటే రైతులను నట్టేట ముంచుతున్నదని ఆరోపించారు. అకాల వర్షలతో రైతులు

Congress



పంటలు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు ఉండదా అని పేర్కొన్నారు. రజితోత్సవ సభ బాధ్యతలో ఉన్నానని చెప్పారు.
నర్సంపేట నియోజకవర్గం నుండి కదిలే పార్టీ శ్రేణులు,ప్రజలు స్పష్టమైన రూట్ మ్యాప్ ఇస్తాంన్ పార్కింగ్ స్థలాల వద్ద ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా సౌకర్యాలు చేపడుతున్నట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలకు ఈ. కలెక్టివిటీ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. నర్సంపేట నియోజకవర్గం నుండి వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు, డీసీఎం, ద్విచక్ర వాహనాలు, ప్రైవేటు వాహనాలతో సుమారుగా 26 వేలకు పైగా నియోజకవర్గ ప్రజలను తరలిస్తామని ప్రత్యేకంగా పదిలక్షల మజ్జిగ ప్యాకెట్లు, పదిలక్షల వాటర్ బాటిల్ సభకు సర్వం సిద్ధం చేసినట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, ఓడిసిఎంఎస్ మాజీ చైర్మన్ గోగులోత్ రామస్వామి నాయక్, పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగేల్లి వెంకట్ నారాయణ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ , బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనె యువరాజ్,పట్టణ ప్రధాన కార్యదర్శి వెనుముద్దల శ్రీధర్ రెడ్డి,మాజీ జడ్పిటిసి బాలు, మాజీ కౌన్సిలర్లు నాగిశెట్టి ప్రసాద్, దేవోజు సదానందం, మండల శ్రీనివాస్,బండి ప్రవీణ్, శివరాత్రి స్వామి, పట్టణ యువజన విభాగం ప్రథాన కార్యదర్శి నాయిని వేణుచంద్,ఉపాధ్యక్షులు పైసా ప్రవీణ్ కుమార్, బిఆర్ఎస్వి పట్టణ అధ్యక్షులు దేవోజు హేమంత్,బీరం అనంతరెడ్డి,నల్ల రవీందర్ తదితరుల పాల్గొన్నారు.

పేదలందరికీ సన్నబియ్యం అందించడమే.!

పేదలందరికీ సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యం…
– దేశంలోనే సన్న బియ్యం అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ
– కాంగ్రెస్ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు మొగుళ్ళపల్లి

నేటి ధాత్రి. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాష్టకంగా: చేపట్టిన ఉచిత సన్నబియ్యం పథకాన్ని మొగుళ్లపల్లి మండలపరిధిలోని పాత ఇ స్సీ పేట గ్రామంలో జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు డీలర్ బొచ్చు లక్ష్మి లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా తక్కల్లపల్లి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదవాడీ ఇంటికి సన్నబియ్యం చేరాలన్న గొప్ప సంకల్పంతో చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఉగాది, రంజాన్ పండుగల శుభసందర్భంగా దారిద్రరేఖకు దిగువనున్న పేదవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న గొప్ప ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని 2కోట్ల 61లక్షల మందికి పేదలకు తలకు ఆరు కిలోల సన్నబియ్యం అందజేస్తున్నామని తెలిపారు. అందుకు 10600 కోట్లు కేటాయించింది అయినప్పటికీ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. .పేదలు దొడ్డు బియ్యం తినలేకపోవడం వలన పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు, దళారులు రీ సైక్లింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచనతో, పేద వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాం.
దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచింది. ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. రైతుల శ్రమ ఎక్కడికీ పోదు. ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల మేరకు రుణమాఫీ చేశాం. 7,625 కోట్ల మేరకు రైతు భరోసా చెల్లించాం. రైతు భరోసా 10 వేల నుంచి 12 వేలకు పెంచిన గొప్ప ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. సన్నవడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని రైతులను ప్రోత్సాహకాలు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్..

ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్

@. నాడు ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం

@ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండల వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమని పలు గ్రామాలలో ని రేషన్ షాప్ ల వద్ద రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సంపేట టి పి సి సి సభ్యుడు రంజిత్ రెడ్డి నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఈరోజు నెక్కొండలో మండల వ్యాప్తంగా నెక్కొండ, దిక్షకుంట, చంద్రుగొండ, అలంకానిపేట, అప్పలరావుపేట, గ్రామాలతో పాటు పలు గ్రామాలలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాలతో ఉచితంగా పంపిణీ చేసే సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని నాడు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఈ కార్యక్రమంలో నెక్కొండ తాసిల్దార్ రాజకుమార్, డిప్యూటీ తాసిల్దార్ పల్ల కొండ రవి కుమార్, నెక్కొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్ హంస నరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏజీపీ అడ్వకేట్ బండి శివకుమార్, ఈదునూరి సాయి కృష్ణ, మార్కెట్ డైరెక్టర్లు రావుల మైపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగర్ ప్రశాంత్, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పోలిశెట్టి భాను, పలు గ్రామాలకు చెందిన రేషన్ డీలర్లు, రేషన్ వినియోగదారులు, ఆయా గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version