ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి
పరకాల నేటిధాత్రి
పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ని రెండోవార్డ్ కు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు బొమ్మకంటి రుద్రమదేవి చంద్రమౌళికీ ఇల్లు మంజూరు కావడం జరిగింది.ముఖ్య అతిథిగా పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి రెండో వార్డులో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేసి,కొబ్బరికాయ కొట్టి ఇల్లు నిర్మాణం కోసం ముగ్గు పోసి ప్రారంభించడం జరిగింది.గత పది సంవత్సరాలుగా ఏ ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయని గత ప్రభుత్వం కేవలం అసమర్థ పాలన పరిపాలించిందని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజా సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలను ఆదుకునే రీతిలో నడిపిస్తున్నదని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కట్టుకుని బాగుపడాలని అర్హులైన వారికి ఇండ్లు మంజురు చేసి వారిని ఆదుకునే రీతిలో ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ బొమ్మకంటి రుద్రమదేవి – చంద్రమౌళి,(ఎస్సీ సెల్ అధ్యక్షులు)హనుమకొండ జిల్లా సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్,కాంగ్రెస్ నాయకులు మచ్చ సుమన్, పోరండ్ల వేణు,బొచ్చు మోహన్,బొచ్చు జెమిని, దావు పరమేశ్వర్ వార్డ్ ఆఫీసర్ కృష్ణంరాజు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు మడికొండ కవిత చంగల్ రావు,రిటైర్డ్ హెచ్ఎం ఆకునూరి పుష్ప విజయ్ కుమార్,రిటైర్డ్ సిఎస్ఐ పాస్టర్ రెవరెండ్ బొచ్చు ప్రకాశం మంద మహేష్ ,ఒంటేరు అమర్నాథ్, కుక్ మూడి రాజారాం చుక్క శాంతి కుమార్,దుప్పటి అన్నయ్య తదితరులు పాల్గొన్నారు.