తిరుమలనాథ స్వామి హుండీ లెక్కింపు

తిరుమలనాథ స్వామి హుండీ లెక్కింపు

నిజాంపేట: నేటి ధాత్రి

శ్రీ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు గత కొన్ని రోజుల క్రితం ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండలం చల్మెడ శివారులో గల తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వాహకులు ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నెలరోజులు, బ్రహ్మోత్సవాలతో కలిపి మొత్తం హుండీ ఆదాయం 84,709 వచ్చినట్లు తెలిపారు. ఈ ఆదాయాన్ని బ్యాంకులో జమ చేయనున్నట్లు చైర్మన్ అక్క పల్లి రామిరెడ్డి, ఈవో రవికుమార్ తెలిపారు. డిప్యూటీ తహసిల్దార్ రమ్యశ్రీ, సీనియర్ అసిస్టెంట్ రమేష్, డైరెక్టర్ బాజా రమేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version