‘మా’ మీ తాతల జాగీరా?!

https://epaper.netidhatri.com/view/234/netidhathri-e-paper-12th-april-2024%09/3

-నువ్వకాకపోతే..నేను కాకపోతే నువ్వు!

-ఆంధ్రా నటులే అధ్యక్షులా?

-తెలంగాణ నటులు అధ్యక్షులు కావొద్దా!

-మళ్ళీ మంచు విష్ణు ప్రెసిడెంటా?

-జనరల్‌ బాడీ నిర్ణయమని మళ్ళీ కొత్త కథా?

-మీకు మీరే ప్రకటించుకుంటే అసోసియేషన్‌ ఎందుకు?

-సభ్యులందరి తీర్మానం లేకుండా ఏకగ్రీవం ఎలా అవుతుంది?

-జనరల్‌ బాడీ ఏకగ్రీవం చేసేందుకు మా ప్రైవేటు అసోసియేషనా?

-పదేళ్ళు దాటుతున్నా తెలంగాణ నటుల ప్రాతినిధ్యం వుండదా?

-మా అసోసియేషన్‌ అధ్యక్షుడుగా తెలంగాణ నటులు వద్దా!

-మూడేళ్ళ క్రితం చెప్పిన బిల్డింగ్‌ ఏదీ?

-మరో ఐదేళ్లు ప్రకటించుకోవడానికి కనీస అర్హత ఏమిటి?

-తెలంగాణ వ్యతిరేకులదే ఇంకా మా లో పెత్తనమా?

-తెలంగాణపై విషం చిమ్మిన మోహన్‌ బాబును మా నుంచి తరిమేయాలి.

-హైదరాబాద్‌ తెలంగాణది కాదన్న మోహన్‌ బాబు మా సభ్యత్వం తొలగించాలి.

-వెంటనే విష్ణును ఆ పదవి నుంచి తొలగించాలి.

-సమైక్యాంధ్ర అన్న చిరంజీవికు కుటుంబానికి మా లో చోటు లేకుండా చేయాలి.

-అది ఆంధ్రా అసోసియేషనా?

-తెలుగు సినిమా అసోసియేషనా?

-తెలంగాణ వారికి ప్రాతినిధ్యం లేదా?

-తెలంగాణ వచ్చినా ఇంకా మీ పెత్తనమేనా!

-ఎన్నికల లేకుండా విష్ణు ఏకగ్రీవం అయ్యారా?

-మీరు, మీరు కుమ్మక్కై నాటకాలాడుతున్నారా?

-తెలంగాణ కన్నెర్ర చేసేదాకా చూసుకుంటారా?

-మా అధ్యక్ష పదవి తెలంగాణ నటులకివ్వాలి.

-సివిఎల్‌ లాంటి సీనియర్‌ను ప్రెసిడెంట్‌ చేయాలి.

-తెలంగాణ నటులంతా ఏకం కావాలి.

-మా అసోసియేషన్‌ లో కీలకం కావాలి.

-అసోసియేషన్‌లో పూర్తి స్థాయిలో తెలంగాణ నటుల భాగస్వామ్యం వుండాలి

హైదరాబాద్‌,నేటిధాత్రి:

మా…మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌…ఇది సినీ నటులకు సంబంధించిన పెద్దన్న పాత్ర పోషించాల్సిన సంస్ధ. నటీనటులకు సంబంధించినంత వరకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన సంస్ధ. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో మా.. అన్న పదం వచ్చేలా పేరును పెట్టారు. అంటే నటీనటులకు కన్న తల్లి లాంటి కళామతల్లిని గుర్తు చేసుకునేలా పేరును పెట్టుకున్నారు. ఇంత వరకు బాగానే వుంది. కాని అది ఆంద్రా మూవీ ఆర్టిస్టు అసోసియేషనా..లేక తెలుగు ఆర్టిస్టు మూవీ అసోసియేషనా? అన్నది ప్రపంచానికి తెలియాల్సిన ఆవశ్యకత వుంది. తెలంగాణకు చెందిన నటులకు న్యాయం జరగాల్సిన అవసరం వుంది. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ 1993లో ఏర్పాటు చేశారు. ఇప్పటికి ముప్పై సంవత్సరాలు దాటింది. తొలి అధ్యక్షుడుగా చిరంజీవిని ఎన్నుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌కు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కొక్కరు ఒకటికి రెండుసార్లు, అధ్యక్షులుగా పనిచేశారు. చిరంజీవి తర్వాత కృష్ణ రెండు సార్లు పదవి చేపట్టారు. తర్వాత మురళీ మోహన్‌ రెండుసార్లు, నాగార్జున, మోహన్‌ బాబు, నాగబాబు, రాజేంద్ర ప్రసాద్‌, శివాజీ రాజా, నరేష్‌, మంచు విష్ణు. ఇంత మంది అధ్యక్షులలో ఒక్కరైనా తెలంగాణ నటుడున్నారా? మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో అందరూ హీరోలనే ఎంపిక చేశారనుకుందాం! మరి నాగబాబు హీరో కాదు. శివాజీ రాజా హీరో కాదు. ఇక జనరల్‌ సెక్రటరీలకు కూడా తెలంగాణ వాళ్లు పనికి రాకుండాపోయారా? అలీ లాంటి కమెడియన్‌లు జనరల్‌ సెక్రెటరీలయ్యారు. వైఎస్‌. ప్రెసిడెంట్లకు కూడా తెలంగాణ ఆర్టిస్టులు ఎవరూ పనికి రాలేదా? మూవీ ఆర్టిస్టు అసోయేషన్‌ అంటే నటులకు సంబంధించిన సంస్ధ. మరి ఆ సంస్ధకు అధ్యక్షుడయ్యే అర్హత ఏ తెలంగాణ నటుడికి లేకుండాపోయిందా? ఇంత వివక్షణా? నువ్వు కాకపోతే నేను..నేను కాకపోతే నువ్వు..మనిద్దరం కాకపోతే మన తమ్ళుళ్లు, కొడుకులు, స్నేహితులు ఇందుకేనా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ ఏర్పాటు చేసింది. మొత్తం సభ్యుల సంఖ్య మొత్తం900. ఇందులో పొరుగు రాష్ట్రాలకు చెందిన నటులు కూడా వున్నారు. ప్రకాశ్‌రాజ్‌ లాంటి వారు కూడా ప్రెసిడెంటు అయ్యేందుకు ఈ సోకాల్డు పెద్దలు సహకరించారు. కాని తెలంగాణ నటులను అవకాశం ఇవ్వలేదు. వారిని ముందుకు తీసుకురావడానికి మనసు రాలేదు. ఇంతకన్నా దుర్మార్గం వుంటుందా? ఇంతకన్నా వివక్ష మరేమనా వుంటుందా? మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో తెలంగాణకు చెందిన నటులకు కనీసం 2శాతానికి మించి సభ్యత్వం లేదు. వారికి ఎలాంటి గుర్తింపు లేదు. తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ వుంది. ఆంద్రా నటుల పెత్తనం మాత్రమే సాగుతుంది. తెలంగాణ భూములను ప్రభుత్వాలు కేటాయిస్తాయి. తెలంగాణలో సినిమాల నిర్మాణం చేపడతారు? తెలంగాణ ప్రభుత్వం నుంచి రాయితీలు తీసుకుంటారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఇంకా దుర్మార్గమైన పరిస్ధితులే వుండేవి.
ఇప్పుడైనా తెలంగాణ నటులకు కనీస గుర్తింపు లేదు. కారణం సీమాంధ్రకు చెందిన పిడికెడు మంది పెత్తనం. నిజం చెప్పాలంటే చెన్నై నుంచి అక్కడి పెద్ద పెద్ద హీరోలు తరిమేస్తే వచ్చిన బాపతు..అక్కడి నుంచి దిక్కులేక హైదరాబాద్‌ చేరుకున్నారు. తమ ప్రాంతం, యాస, కులం తప్ప తెలంగాణకు సినీమాలో ఛాన్సే లేదా? వుండదా? అసలు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ అనేదేమైనా మీ తాతల జాగీరా? ఇది మరీ విచిత్రంగా వుంది. 2021 తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు మరోసారి ఏకగ్రీవంగా ఐదేళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగేందుకు జనరల్‌ బాడీ నిర్ణయం తీసుకున్నదట. ఇంతకన్నా దౌర్భాగ్యమేమైనా వుందా? అంటే ఇదంతా అందరూ కలిసి ఆడుతున్న దొంగ నాటకం. ఇందులో చిరంజీవి కుటుంబం నుంచి మొదలు అన్ని కుటుంబాల పాత్ర వుంది. ఉమ్మడి రాష్ట్రంలో మాత్రం కత్తులు దూసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దోస్తులయ్యారు. లేని ప్రేమలు కల్పించుకొని, ఇంత కాలం దృతరాష్ట్ర కౌగిలి ఆలింగనాలు చేసుకున్నవాళ్లు కూడా ఒకటౌతున్నారు. తెలంగాణ వాళ్లు సినిమా రంగంలోకి దూరకుండా చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అడ్డుకుంటున్నారు. అసోసియేషన్‌లోకి అసలే రాకుండా ఇలాంటి కొత్త ఎత్తుగడ వేసుకున్నారు. ఇక్కడ చిరంజీవి దగ్గర నుంచి మొదలు, అన్ని కుటుంబాలన్నీంటికీ తెలంగాణ అంటే కోపం? అది వారు నిరూపించుకున్నదే…చరిత్రలోకి వెళ్తే అందరి జాతకాలు బైటకు వస్తాయి. కర్నాటక రాష్ట్ర నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ అధ్యక్షుడు కావడానికి ప్రోత్సహిస్తారు. వెనకుండి నడిపిస్తారే గాని, తెలంగాణ నటులకు మాత్రం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ అధ్యక్షుడయ్యేందుకు మాత్రం సహకరించరా? వారిని ప్రోత్సహించరా? తెలంగాణకు చెందిన ఎంతో మంది గొప్ప సీనియర్‌ నటులున్నారు. ఎంతో మంది యువ నటులున్నారు. అసలు వారికి పాత్రలు ఇవ్వడమే గొప్ప అన్నంత దోరణిలో ఆదిపత్యం చేస్తారు. తెలంగాణ వాళ్లే ప్రత్యేకంగా సినిమా తీస్తే ఆంధ్రలో నడవకుండా చూస్తారు. ఆ సినిమాలను విడుదల కాకుండా అడ్డుకుంటారు. అదే పని తెలంగాణకు చెందిన వాళ్లు చేయడం మొదలు పెడితే ఆంధ్ర నటులు ఎక్కడుంటారు? తెలంగాణ ఉద్యమం, దాని స్వరూపం ఎలాంటిదో సినీ పెద్దలుగా చెలామణి అయ్యే చిరంజీవి లాంటి వారికి తెలియంది కాదు. ఉద్యమ సమయంలో ఆర్య2 అనే సినిమా పరిస్ధితి ఏమైందో చిరంజీవికి బాగా తెలుసు.
అసలు సామాజిక తెలంగాణ అంటే అర్ధమేమిటో తెలియని చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని, మోసం చేయాలని చూశాడు.
కాని ప్రజలు చిరంజీవి నమ్మలేదు. తెరమీద పాటలకు డ్యాన్సులు చేస్తుంటే చూసిన ప్రజలు చిరంజీవిని నాయకుడిగా ఒప్పుకోలేదు. ఓ జర్నలిస్టు సూటిగా సామాజిక తెలంగాణ అంటే అర్ధమేమిటంటే నీళ్లు నమిలిన చిరంజీవి…2009లో కేంద్రం తెలంగాణ ప్రకటన చేసిన వెంటనే జై సమైక్యాంధ్రా అన్నారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయినా చిరంజీవి కుటుంబానికి తెలంగాణ సమాజం ఆదరిస్తూనే వుంది. తాను పుట్టిన నియోజకవర్గ ప్రజలే చిరంజీవిని తమ నాయకుడిగా అంగీకరించక చిత్తుగా ఓడిరచారు. అయినా చిరంజీవిలో మార్పు రాలేదు. తెలంగాణ పోరాటం గొప్పదనం గుర్తించలేదు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని గుర్తించలేదు. అందుకే తెలంగాణ ప్రకటన వచ్చిన వెంటనే ఆయన యూటర్న్‌ తీసుకున్నాడు. తెలంగాణకు ద్రోహం చేశాడు. చిరంజీవి తిన్నింటి వాసాలు లెక్కపెట్టినా, ఆ కుటుంబానికి చెందిన సినిమాలను ఆదరిస్తూనే వుంది. అయినా వారిలో మార్పు రాదు. ఇక తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత 11 రోజులు అన్నం తినలేదు..నిద్ర పోలేదు అని స్వయంగా చెప్పారు. తెలంగాణ రావడం ఇష్టం లేదని చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ చెప్పే సొల్లు పురాణం తెలంగాణ వింటూనే వుంది. జనసేన పేరతో ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలిచింది లేదు. అయినా తెలంగాణ మీద అక్కసు పోలేదు. సీమాంద్రకు సపోర్టుగా నిలవడం మానడం లేదు. పైగా పవన్‌ కళ్యాన్‌ రెండు మూతుల పాము లాగా తెలంగాణలో పోరాటం గొప్పదంటారు? ఆంధ్రాకెళ్లి మన రాష్ట్రానికి అన్యాయం చేశారంటారు. అందుకే ఆయనను ఎవరూ నమ్మరు. తెరమీద పిచ్చిగంతులేస్తుంటే చూస్తుంటారు. అయినా వారికి వారే గొప్పగా ఫీలౌతుంటారు. ఇక మోహన్‌ బాబు హైదరాబాద్‌తో తెలంగాణకు సంబంధమే లేదన్న మూర్ఖు శిఖామణి. హైదరాబాద్‌ భూములన్నీ నైజాంలకు చెందనవంటూ తన అజ్ఞానాన్ని చాటుకున్నాడు. తెలంగాణ మీద పదే పదే విషం చిమ్మాడు. అలాంటి వారి చేతుల్లో సినిమా పరిశ్రమ వుండడంతో తెలంగాణ నటులకు న్యాయం జరగుతుందా? ఇంకా వందేళ్లయినా సినిమాలలో తెలంగాణ ప్రాతినిద్యం పెరగదు. మూవీ ఆర్టిసు అసోసియేషన్‌లోకి దారులు తెరవరు. ప్రతిసారి అన్యాయమే జరుగుతోంది. తాజాగా తన కుమారుడు మంచు విష్ణు రెండోసారి అడ్డదారిలో ఐదేళ్లపాటు అధ్యక్షుడిగా పొడిరచుకున్నారు. దేవుని పేరు చెప్పి సత్యాల మాటును అసత్యాలు వల్లిస్తూ, కళామతల్లి అంటూ కబుర్లు చెబుతూ, తెలంగాణ నటులను ఎదకుండా అణచివేస్తున్నారు. ఇక తెలంగాణ సినీ సమాజం ఆంధ్రా పెత్తనాన్ని సహించే పరిస్ధితుల్లో లేదు. తెలంగాణ నుంచి కూడా ఇప్పుడిప్పుడే హీరోలు వస్తున్నారు. ఆంధ్రా హీరోల వారసులను తలదన్నే హీరోలు వస్తున్నారు. వారి ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారు. అణచివేసే కుట్రలు చేస్తున్నారు. అందుకే వారి వారసులకు కూడా సినిమా లేకుండాపోతున్నాయి. సినిమాలు ఆడకుండా బాక్సులు తిరిగి వస్తున్నాయి. ఇప్పటికైనా మారండి. లేకుంటే తెలంగాణ సినీ అసోసియేషన్‌ పోరును ఎదుర్కొవాల్సివస్తుంది. తెలంగాణలో మరో సినీ ఉద్యమం రుచి చూడాల్సివస్తుంది. రాజకీయ నాయకుల్లాగా తట్టాబుట్టా సర్ధుకోవాల్సివస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *