ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ వినోద్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మహారాష్ట్ర లోని పూనే నగరం లో 1827 ఏప్రిల్ 11 న మహత్మ జ్యోతి బా పూలే జన్మించారు.ఒకసారి తన స్నేహితుని పెళ్లి లో తనకు జరిగిన అవమానానికి బాధపడ్డ పూలే తన తండ్రి ద్వారా అవమానానికి కారణం కులం అని తెలుసుకోవడం జరిగింది.కుల వ్యవస్థ వలననే నిమ్న వర్గాలు చదువుకు దూరం అయ్యారని,చదువుకు దూరం కావడం వలననే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారని భావించి వారికి చదువు నేర్పడం వలననే కుల సమస్య కొంత రూపు మాపొచ్చు అని భావించారు 1848లో నిమ్న వర్గాలకు మొట్ట మొదటి స్కూల్ ను స్థాపించి స్వయంగా వారి భార్యనే అందులో ఉపాధ్యాయురాలు ని చేశారు.1852 వరకు పూలే గారు పూనే చుట్టూ పక్కల 15బడులను తెరిచారంటే ఆయన విద్య కోసం పడిన తపన ఎంతనో మనకు అర్థం అవుతుంది. అంతే కాకుండా అతిచిన్న వయసులో భర్త చనిపోయిన అగ్రవర్ణ మహిళలకు పునర్విహాాలు జరిపించారు .వారికి పుట్టిన పిల్లలను తనకు అప్పజెప్పాలని కోరారు.సత్యశోధక్ సమాజ్ ను స్థాపించి ఆదర్శ వివాహాలు జరిపించారు.సతీ సహగమనం ను పూర్తిగా వ్యతిరేకించి ఆ దురాచారాల కు వ్యతిరేఖంగా పోరాటం చేశారు.
ఈ పోరాటాన్ని అర్థం చేసుకున్న రాజ్యంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిభ పూలే ను గురువు గా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కోల శ్యామ్ ,కార్యదర్శి బుర్రి శివరాజ్,కోశాధికారి రామిళ్ల రవి,సలహాదారు ముద్దమల్ల భార్గవ్,జిల్లా నాయకులు కోడెపాక శంకర్, కృష్ణస్వామి, లక్పతి నాయక్, సన్నీ ముదిరాజ్ ,మాజీ జడ్పిటిసి జోగుల సమ్మయ్య,ప్రజా సంఘాల నాయకులు పీక కిరణ్,బీసీ సంఘాల నాయకులు గట్ల రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *