ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉపేందర్ మాదిగ
భూపాలపల్లి నేటిధాత్రి
ఎంహెచ్పిఎస్ భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నీలాల రాజు మాదిగ నియామకం
మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా పనిచేయాలని వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ అన్నారు. మంగళవారం రోజున భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎంహెచ్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనీ మాట్లాడుతూ మాదిగలకు 12శాతం రిజర్వేషన్ పోరాటం ద్వారానే సాధ్యం అయితదని నూతన ఎండిఏ ప్రభుత్వము వచ్చే వర్షాకాల సమావేశాలలో వర్గీకరణ బిల్లు పెట్టాలని మాదిగల జనసభలను నిర్వహిస్తున్నాం ఎంహెచ్పిఎస్ సంగం రాష్ట్రవ్యాప్తంగా సంగం పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ పదవికి సహకరించిన రాష్ట్ర జిల్లా కమిటీలకు కృతజ్ఞతలు ఈ సమావేశంలో ఎంహెచ్పిఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు మంచినీళ్ల ఎల్లారి మాదిగ,మండల అధ్యక్షులు తిక్కరాజు,రాకేష్,నాని,అంబాల దావీదు తదితరులు పాల్గొన్నారు.