శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో పూలే యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చెల్ఫూరి శ్రీకాంత్ గౌరవ సలహాదారులు నాగుల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పిట్టల వికాస్, కార్యదర్శిగా పల్లెబోయిన అఖిల్, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ రిజ్వాన్, క్రీడా విభాగం కార్యదర్శులుగా బిల్లా వెంకటేష్, గిరబోయిన ప్రశాంత్, సాంస్కృతిక కార్యదర్శిగా కుక్కల దేవేందర్, సహాయ కార్యదర్శిగా తడక బద్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పైన నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు. పూలే, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.