` ఈసారైనా ‘‘దయ’’ చూపమ్మా!

` సామాన్యులు చితికిపోతున్నారు.

` వేతన జీవులు విలవిలలాడుతున్నారు.

` పద్దుకు పన్నులే ముఖ్యమా?

` సామాన్యుల జీవితాలు పట్టవా?

` ఓట్లేసి గెలిపించేది పేద ప్రజలు!

` వాయింపులు అనుభవించేది సగటు జనాలు!

` మద్య తర’గతి’ మారేనా?

` ఈసారి పద్దులో పన్నుల భారం తగ్గేనా?

` ఈసారైనా సామాన్యులపై కనికరం చూపిస్తారా?

` పదేళ్లుగా మధ్య తరగతి నరకం చూస్తున్నారు.

` ఇప్పుడన్నా ఊరట కల్గుతుందేమో అని ఎదురుచూస్తున్నారు.

` ఇంతకాలం నడ్డి విరుస్తూనే వచ్చారు.

` పన్నుల మోత ఇకనైనా తగ్గించండి.

` వాయింపులు వాయిదా వేయండి.

` సామాన్యలను బతకనీయండి.

` పేదల బతుకు బస్టాండు చేయకండి.

` పన్నులు కట్టలేక పడరాని పాట్లు పడుతున్నారు.

` సంపాదించింది మిగలలేక దిగులు పడుతున్నారు.

` కొనుగోలు శక్తి తగ్గి కుదేలౌతున్నారు.

` సంపాదన తిండికే సరిపోవడం లేదు.

` దేశమంతటా వలసలు పోతున్నారు.

` ఉత్తరాధి నుంచి దక్షణాదికి కడుపు కట్టుకొని వస్తున్నారు.

` కూలీ నాలి చేసుకొని బతుకుతున్నారు.

` పిల్లలను కనీసం చదివించుకునే దిక్కులేదు.

` రోగమొస్తే వైద్యానికి దిక్కులేదు.

` గంభీరంగా జనం బతుకుతున్నారు.

` బలహీనంగా బతుకులీడుస్తున్నారు.

ఈసారైనా తమ కష్టాలు తీరుతాయా? పన్నులు తగ్గుతాయా? జీవితాలు మెరుగు పడతాయా? అంటూ సామాన్యులు కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలమ్మ ఈసారైనా మాపై దయచూపమ్మా అంటూ వేడుకుంటున్నారు. ప్రజలు సమస్యలతో సతమతమౌతున్నారు. ఆర్దిక ఇబ్బందులు తాళలేక ఆగమౌతున్నారు. వచ్చేరూపాయికి, వెళ్లే రూపాయికి పొంతన లేక జనం అవస్ధలు పడుతున్నారు. కొనుగోలు శక్తి లేక ఆకలికి మాడుతున్నారు. కడుపులు మాడ్చుకుంటున్నారు. ఉల్లి ధరలు పెరిగితే తినడం మానేయండి అని చెప్పినంత సులువు కాదు..జీవితాలంటే..ఓ వైపు ధరలు ఆకాశాన్నంటుతుంటే తగ్గించకపోగా, వాయింపులు పెరుగుతున్నాయి. ఏ కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదని జనం ఆందోళన చెందుతున్నారు. ప్రజలకు ఉచిత రేషన్‌ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. ఆ రేషన్‌తో జనం బతుకుతున్నారని పాలకులు లెక్కలేసుకుంటే బాగున్నారని అర్ధం కాదు. సగటు వ్యక్తి తన ఆశలు, కోరికలు అన్నీ చంపుకొని బతుకుతున్నాడు. కంటి నిండా నిద్రపోయే పరిస్ధితి లేదు. కుటుంబమంతా కష్టపడుతున్నా పూట గడవడం లేదు. పదేళ్లు అసంఘటిత కార్మికులు కూలీలు పెరగడం లేదు. వారి జీవితాలకు భరోసా లేదు. జీతాలు పెరగక వేతన జీవులు విలవిలలాడుతున్నారు. కార్మికుల జీవితాలు ఆగమ్య గోచరంగా తయారౌతున్నాయి. చిన్న పరిశ్రమలు లక్షల్లో మూతపడుతున్నాయి. కార్పోరేట్‌ వ్యాపారులు కూడా చేతులేత్తేసున్నారు. ఆర్ధిక వ్యవస్ధ కుదలేలౌతోంది. ఆర్ధిక వ్యవస్ద చిన్నాభిన్నమౌతోందని ఆర్ధిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచం ఎటు వెళ్తుందో..మనం ఎటు వెళ్తున్నామో కూడా తెలియకుండానే కాలం గడిచిపోతోంది. డిమాండ్‌, సప్లయ్‌లో సమతూకం లేకుండాపోతోంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పూర్తిగా క్షీణిస్తోంది. మార్కెట్‌లో మనీ సర్కులేషన్‌ లేకుండాపోతోంది. డిమాండ్‌ ఎకనామిక్స్‌ను అనుసరించాల్సిన పాలకులు సప్లయ్‌ ఎకనామిక్స్‌కు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. అయినా కార్పోరేట్‌ శక్తులు చేతులేత్తేస్తున్నాయి. అయినా పాలకులకు పట్టింపు లేదు. ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్నారు. కార్పోరేట్‌ కంపనీలకు రాయితీల మీద రాయితీలు ఇస్తున్నారు. అయినా ఎక్కడ లోపం జరగుతోంది. పెట్టుబడులు పెట్టి దివాళా తీశామని చెబుతున్నారే గాని, ఉపాది కల్పించి దాఖలాలు కనిపిస్తున్నాయా? నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోంది. కరోనా సమయంలో కార్పోరేట్‌ శక్తులకు పదిలక్ష కోట్లు మాఫీ చేశారు. కాని సగటు జనం నుంచి లెక్కకు మించి వసూలు చేస్తున్నారు. వేతన జీవి తన ఏడాది కాలంలో వచ్చే జీతంలో మూడు నాలుగు నెలల జీతంలో కోత పడుతోంది. పన్నుల రూపంలో నేరుగా ఖజానాకు చేరుతోంది. ఉద్యోగి జేబుకు నేరుగా చిల్లు పడుతోంది. ఈ చిల్లు పూడేదెలా? వేతన జీవి కొనుగోలు శక్తి పెరిగేదెలా? ప్రజల మీద వేసిన పన్నుల భారంతో 13శాతం వృద్ది రేటు పెరగుతుందని అంచానా వేశారు. కాని అది 33శాతానికి పెరిగింది. అదే కార్పోరేట్‌ శక్తుల నుంచి ఆదాయం పెరుగుతుందనుకుంటే .5 శాతానికి పడిపోయింది. లోపం ఎక్కడుంది. కార్పోరేట్‌ శక్తుల నుంచి పన్నులు వసూలు చేయడంలో అసత్వం వహిస్తున్నారు. సామాన్యుల నుంచి ఉప్పు, పప్పు, చెప్పు,నిప్పు నుంచి కూడా పన్నుల మీద పన్నులు వేసి వసూలు చేస్తున్నారు. ఖజానా నింపుకుంటున్నారు. కార్పోరేట్‌ శక్తులకు రాయితీలు ప్రకటిస్తున్నారు. జిడిపి 5శాతానికి పడిపోయిందంటున్నారు. యూపియే 2లో 9శాతంగా పెరిగిన జిడిపి ఇంతలా ఎందుకు దిగజారుతోంది. జనం వద్ద కొనుగోలు శక్తిలేక కార్పోరేట్‌ శక్తులు ఉత్పత్తులు తగ్గించాయి. కార్మికులను తొలగిస్తూ వున్నాయి. ఆఖరుకు కంపనీలే మూతపడుతున్నాయి. పన్నుల విధానం నచ్చక ఎంతో మంది దేశం వదిలి వెళ్లిపోతున్నారని నిత్యం వార్తలు వస్తున్నాయి. సగటువ్యక్తులు దేశంలోనే ఉపాధి వెతుక్కుంటూ దేశమంతా తిరుగుతున్నారు. ఇల్లూ, వాకిలి వదిలిపెట్టి వసలు పోతున్నారు. 2014లో బియ్యం ధరలు ఎలా వున్నాయి? ఇప్పుడు ఎలా వున్నాయి? అందుకే ప్రజలు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం వడ్డింపులపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. పాప్‌కార్న్‌ కొన్నా పన్నుల వాయింపులపై నిలదీస్తున్నారు. విద్యార్దులు రాసే పరీక్షల మీద కూడా జిఎస్టీ విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా జనం గొడు కేంద్రానికి పట్టడం లేదు. పద్దులకు పన్నులే ముఖ్యమా? అని నిలదీస్తున్నారు. ఈసారైనా పద్దులో కనికరం చూపమని కోరుతున్నారు. ఓ వైపు అమెరికా ప్రజలను పన్నుల భారం నుంచి విముక్తి చేస్తామని ప్రకటిస్తోంది. ప్రజలను పన్నుల భారం నుంచి తప్పిస్తామంటోంది. కాని మన దేశంలో పన్నులే అసలైన పద్దులన్నట్లు సాగుతోంది. ఓట్లేసి మూడుసార్లు ప్రజలు ఎన్నుకుంటే సామాన్యులకు ఎప్పుడైనా ఊరట కల్గిందా? ఓట్లేసి సామాన్యులు. గెలిపించేది సామాన్యులు. బాగు పడేది కార్పోరేట్లు. వాళ్లు ఓట్లేసేది లేదు. ఓట్లు వేమయని చెప్పేది లేదు. కాని వాళ్లను కాపాడుతున్నారు. ప్రజలజీవితాలను గాలికి వదిలేస్తున్నారు. ఈసారైనా..ఈసారైనా అంటూ పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడూ కూడా కోటి ఆశలు పెట్టుకుంటున్నారు. మధ్య తరగతి జీవితాలకు ఊరట కలుగుతుందని ఆశపడుతున్నారు. ఈసారి పద్దులో పన్నుల భారం తగ్గుతుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌కంటాక్స్‌ విషయంలో పది లక్షల నుంచి పదిహేను లక్షలకు వెసులుబాటు కల్పిస్తారని ప్రచారాలు సాగుతున్నాయి. కాని అయినా అనుమానం అందరినీ వెంటాడుతూనే వుంది. ఇంత కాలం వడ్డిస్తూనే వున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టినా, మనకు మాత్రం పైసా తగ్గింది లేదు. ఊరట లభించింది లేదు. కాని ధరల పెరుగుదల కనీసం ఆగింది లేదు. పెట్రోలు ధరలు తగ్గించింది లేదు. ఒకప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ఎంతో వ్యత్యాసముండేది. ఇప్పుడు రెండూ సరిసమానమైపోయాయి. ప్రపంచంలో ఎలక్రిసిటీ వాహనాలు పెరుగుతున్నాయంటూ మనం వాటి వెంట పరగులు తీస్తున్నాం. తాజాగా అమెరికాలో ఎలక్రిసిటీ వాహనాలకు స్వస్తిపలికేందుకు సిద్దపడిరది. పెట్రో ఉత్పత్తులను విపరీతంగా పెంచుకునేందుకు ట్రంప్‌ అనుమతులిస్తున్నారు. అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చేస్తే మొదటికే మోసం వస్తోంది. ప్రతి వ్యక్తి కనీస అవసరాలు తీరడం లేదు. సామాన్యుడు ఇల్లు కొనుక్కునే దిక్కులేదు. అంతెందుకు కనీసం ఓ ద్విచక్రవాహనం కొనుగోలు చేసుకునే పరిస్దితి లేదు. పెట్రోలు ధరలు పెరుగుతున్నా కొద్ది వాహనాల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. సామాన్యులకు అందకుండాపోతున్నాయి. ఉప్పు,పప్పుల పరిస్దితే ఇలా వుంటే ఖరీదైన వస్తువుల ధరలు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెల్‌ ఫోన్‌ వాడకం దారులకు నెల రీచార్జికి డబ్బులు వసూలు చేస్తూ, 28 రోజులకు వ్యాలిడిటీ అందిస్తుంటే వాటిని కంట్రోల్‌ చేయలేకపోతున్నారంటే అర్ధమేమిటి? అటు పాలకులకు వడ్డించి, అటు ప్రైవేటు కంపనీలు వాయించుకుంటూ పోతే సామాన్యుడు బతికెదెలా? పూట గడవడమే కష్టంగా మారుతుంటే పిల్లలకు చదువులెట్లా? వారి ఆరోగ్యాలకు భద్రత ఎట్లా? ఓ వైపు కుటుంబాల ఆర్దిక పరిస్దితి చితికిపోతుంటే, పిల్లల్ని కనండి అని ఉచిత సలహాలు ఇస్తూ పోతున్నారు. జనం గోడు వినిపించుకునే పరిస్దితి లేదు. అందుకే సామాన్యులను బతకనీయండి. పేదల బతుకులు బస్టాండ్‌ చేయండి. రాజుల కాలానికి ఇప్పటికీ తేడా ఏముంది? అప్పుడు రాజులు నిరంకుశత్వంగా పాలిస్తూ, ప్రజలను పీడిరచుకుతిన్నారు. మనల్ని పాలించిన ఆంగ్లేయులు పీడన భరించలేకనే స్వాతంత్య్రం తెచ్చుకున్నాము. ఆనాడు ఉప్పుమీద పన్నును భరించలేకనే పోరాటం చేశాము. మరి ఇప్పుడు మన పాలన. మన ప్రజాస్వామ్యం. మరి ఎవరి మేలు కోసం ఈ పన్నుల భారాలుఅని ప్రశ్నలు వినిపించడం లేదా? అభివృ ద్ది కావాలంటే పన్నుల వసూలు చేయాలి. కాని పన్నుల వసూలుకు, అభివృద్దికి సమతూకం లేదు. ప్రజలు పన్నులు కట్టలేక పడరాని పాట్లు పడుతున్నారు. సంపాదించిన దానిలో రూపాయి మిగలడం లేదని దిగులు పడుతున్నారు. అనారోగ్యాల పాలౌతున్నారు. ప్రభుత్వానికి ఖజానా ఎంత ముఖ్యమో..ప్రజలకు తమ ఆర్ధిక స్ధితి కూడా అంతే…కాకపోతే ప్రభుత్వ ఖజానాలో నిలువ వుండదు. జనం జేబులను కూడా అలాగే మార్చుతున్నారు. దీనిని ఆర్ధిక ప్రగతి అనలేరు. దివాళా దిశగా పరుగులు అంటారు. ఇప్పటికైనా అర్దం చేసుకోండి. ప్రజలకు ఊరట కల్గించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!